Daily Current Affairs in Telugu 28-07-2020
పాకిస్తాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సయ్యద్ అలీ గిలాని :

కశ్మీరీ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీకి తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్-ఎ-పాకిస్థాన్’ను అవార్డును అందజేయాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని పాక్ సెనేట్ జూలై28 ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆయన పేరు మీద ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని కూడా సెనేట్ ప్రతిపాదించింది. పాక్ లో సయ్యద్ అలీ గిలానీ ప్రతినిధిగా ఉన్న అబ్దుల్లా గిలానీ ఈ విష యాలను ధ్రువీకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పాకిస్తాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సయ్యద్ అలీ గిలాని
ఎవరు: సయ్యద్‌అలీ గిలాని
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు: జూలై28
ఐక్య రాజ్య సమితి సలహా మండలిలో చోటు దక్కించుకున్న భారతీయ యువతీ :

భారత్ కు చెందిన మహిళా యువ పర్యావరణవేత్త ఒకరు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ యొక్క సలహామండలికి ఎంపికయ్యారు. రోజు రోజుకు దారుణంగా మారుతున్న పర్యావరణ పరిస్థితిని మెరుగుపరచేందుకు అవసరమైన సలహాలను వీరు యుఎన్ చీఫ్ కు అందిస్తారు. ఈ మండలి కి ప్రపంచ వ్యాప్తంగా ఏడుగురు (18-28 ఏళ్ల వారు) ఎంపిక కాగా భారత్ నుంచి అర్చన సోరెంగ్ (24) ఒకరు కావడం విశేషం. పర్యావరణాన్ని సంతులంగా ఉంచేందుకు ఆదివాసులు ఉపయోగిస్తున్న పద్దతులను వారి సాంప్రదాయ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ఆర్చన పరిశోదనలు సాగిస్తున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐక్య రాజ్య సమితి సలహా మండలిలో చోటు దక్కించుకున్న భారతీయ యువతీ
ఎవరు: అర్చన సోరెంగ్
ఎప్పుడు: జూలై28
ప్రతిష్టాత్మక రాఫెల్ యుద్ద విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్ గా నిలిచిన హిలాల్ అహ్మద్ రాథోడ్ :

ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్ ఎయిర్ కమా౦డర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు. కాశ్మీర్ కు చెందిన హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుంచి వస్తున్న తొలి బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం పొందారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా రఫేల్ ను మార్చే ప్రక్రియ లోని ఆయన పాలు పంచుకున్నారు. భారత వైమానిక దళ అధికారిగా మిరేజ్ 2000, మిగ్ 21, కిరణ్ యుద్ధ విమానాలు 3 వేల ఫైయింగ్ అవర్స్ నువిజయవంతగా ప్రమాద రహితంగా ముగించిన చరిత్ర ఆయనకు ఉంది. ప్రపంచం లోనే అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్ గా ఘనత సాధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక రాఫెల్ యుద్ద విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్ గా నిలిచిన హిలాల్ అహ్మద్ రాథోడ్
ఎవరు: హిలాల్ అహ్మద్ రాథోడ్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జూలై28
టెస్టు క్రికెట్ చరిత్రలో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరిన స్టువర్ట్ బ్రాడ్ :

ఇంగ్లాండ్ ఫేసర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన మైలురాయిని అందు కున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఐదొందల వికెట్లు చేజిక్కించుకున్న ఏడో బౌలర్ గా ఘనత సాధించాడు. విండీస్ ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 500వ వికెట్‌గా అతడి ఖాతాలో చేరాడు. మరో సీనియర్ ఇంగ్లాండ్ ఫాస్ట్ చేరు బౌలర్ ఆండర్సన్ కూడా 500 వికెట్ (2017లో) కావడం విశేషం. 84 ఏళ్ల బ్రాడ్ మొత్తం 140 టెస్టుల్లో 27.94 సగటుతో 501 వికెట్లు పడగొట్టాడు. 18 సార్లు ఐదు వికెట్లతీసిన ఘనత సాధించాడు. రెండో టెస్టులో ఆరు, మూడో టెస్టులో 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్ లో అత్యధిక వికెట్లు (16) తీసుకున్న బౌలర్ అతడే. 11 వికెట్లతో వోక్స్ రెండో స్థానంలో ఉన్నాడు. బెన్ స్టోక్స్ 363 (సగటు 90.75) పరుగులతో సిరీస్‌లో టాప్ స్కోరర్ గా నిలిచాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: టెస్టు క్రికెట్ చరిత్రలో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరిన స్టువర్ట్ బ్రాడ్
ఎవరు: స్టువర్ట్ బ్రాడ్
ఎప్పుడు: జూలై 28
ప్రమఖ రచయత ,తెలుగు సినీనటులు రావి కొండలరావు కన్నుమూత :

తెలుగు సినీ నటులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞా శాలి రావికొండలరావు (88) జూలై 28న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నటుడిగా సినీ రంగానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. సుమారు 600 పైగా సినిమాల్లో నటించారాయన. ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి సీనియర్ నటుల నుంచి ఇప్పటి నటి నటులతో కలిసి నటించారాయన, 1832, ఫిబ్రవరి 11న శ్రీకాకుళం లో జన్మించారు రావికొండలరావు, బాల్యంలోనే నాటికలు, సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. అదే ఆయన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది మొదట్లో వచ్చిన ‘శోభ సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు రావికొండలరావు, రాముడు భీముడు’, ‘తేనె మనసులు’, ‘ప్రేమించి చూడు’, ‘ఆలీబాబా 40 దొంగలు’, ‘అందాల రాముడు’, ‘దసరా బుల్లోడు’ వంటి పాపులర్ సినిమాల్లో కనిపించారాయన. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘985 డేస్’ ఆయన ఆఖరి చిత్రం. సినిమాల్లోకి రాక ముందు ఆనందవాణి, వనిత,జ్యోతి, విజయ చిత్ర వంటి పత్రికల్లో పని చేశారు
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రమఖ రచయత ,తెలుగు సినీనటులు రావి కొండలరావు కన్నుమూత :
ఎవరు: రావి కొండలరావు
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు:జూలై 28
కరోనా పై పోరులో భారత్ కు అందించిన ప్రాన్స్ చేయూత :

కరోనా పై పోరులో భారత్ కు ప్రాన్స్ దేశం చేయూతనిచ్చింది. ఈ మేరకు కొవిడ్-19 పరీక్ష కిట్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రిని విరా లంగా అందజేసింది. ఈ సామగ్రితో వచ్చిన ఫ్రాన్స్ విమానం జూలై 28 న డిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగింది. అనంతరం భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి ఆర్కే జైన్ లాంఛనంగా ఈ సామగ్రిని అంద చేశారు. వీటిలో 50,000 సిరలాజికల్ పరీక్ష కిట్లు, 50,000 ముక్కు, గొంతు కిట్లు, 120 వెంటిలేటర్లు, ఇతర పరికరాలు ఉన్నాయి
క్విక్ రివ్యు :
ఏమిటి: కరోనా పై పోరులో భారత్ కు అందించిన ప్రాన్స్ చేయూత
ఎవరు: ప్రాన్స్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు:జూలై 28
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |