Daily Current Affairs in Telugu 27-08-2020

current affairs in telugu 2019 pdf download,

Daily Current Affairs in Telugu 27-08-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

చైనా కు చెందిన 24 కంపెని లపై  అమెరికా నిషేధం విధింపు:

దక్షిణ చైనా సముద్రంలో ని వివాదస్పద  దీవులలో నిర్మాణ  మరియు సైనిక పరమైన వాటికీ సంబంధించిన కార్యకలాపాలకు సహకరిస్తున్న 24చైనా కంపెనీలు, కొంత మంది వ్యక్తుల కు  లక్ష్యంగా అమెరికా చర్యలకు ఉపక్రమించింది.ఆయా కంపెనీలను నిషేధిత జాబితాలోకి చేరుస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించించి.చైనా దూకుడు కు సహకరిస్తున్న వ్యక్తులపై  కూడా వీసా ఆంక్షలు విదిస్తున్నట్లు విదేశీ వ్యవహరాలు శాఖా మరో ప్రకటనలో తెలిపింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: చైనా కు చెందిన 24 కంపెని లపై  అమెరికా నిషేధం విధింపు

ఎవరు: అమెరికా

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: ఆగస్ట్ 27

600 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ఖ్యాతి గాంచిన అండర్సన్ :

ఇంగ్లాండ్ క్రికెటర్ ఫేస్ బౌలర్జేమ్మి అండర్సన్  టెస్టుల్లో  600 వికెట్లు తీసిన  తొలి బౌలర్ గా నిలిచాడు. టెస్టు క్రికెట్ కు ముందు వన్డేలతో అండర్సన్ అంతర్జాతీయ అరంగ్రేటం జరిగింది.తొలి ఆరేళ్ళు  అతని కెరీర్  రెండు పార్శ్వలుగా సాగింది.ఒక్క సారి తనదైన  జోరు మొదలై అధ్బుతమైన  బౌలర్ గా కొన్ని సార్లు  కనిపించి కొన్ని సార్లు గతి తప్పి చెత్త బౌలర్ గా కూడా కనిపించాడు జట్టు లోని  కొందరు సీనియర్ బౌలర్ల వరుస వైపల్యాల తరువాత  2007-08 న్యూజిలాండ్ పర్యటనతో  పునరాగమనం చేసిన అండర్సన్ ఆ తరువాత తన స్థాయిని పెంచుకుంటూ  జట్టుకు కీలకంగా మారాడు. కొద్ది రోజులకే సొంత గడ్డ పై అదే జట్టు పై 7 వికెట్లు తీసి సత్తా చాటిన తరువాత జిమ్మీ అండర్సన్ కు తిరుగులేకుండా పోయింది. 2010 నుంచి అండర్సన్ తన బౌలింగ్ మరింత పదును పెంచాడు. జట్టులో  పేస్ బృందానికి నాయకుడిగా ఎదిగి  అతను దానికి తగినట్లుగా అధ్బుత  ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ తరపున  అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా  ఉన్న ఇయాన్ బోధం రికార్డును అధిగమించిన అనంతరం 500 వికెట్ల మైలు రాయిని కూడా దాటాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: 600 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ఖ్యాతి గాంచిన  జేమ్మి అండర్సన్

ఎవరు: జేమ్మి అండర్సన్

ఎక్కడ:ఇంగ్లాండ్

ఎప్పుడు:ఆగస్ట్ 27

టెన్నిస్ కు ఆటకు  బ్రయాన్ సోదరుల రిటైర్మెంట్ ప్రకటింపు:

డబుల్స్ దిగ్గజాలైన బ్రయాన్ బ్రదర్స్ బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు  ఆగస్ట్ 27న ప్రకటించారు.42ఏళ్ల ఈ సోదరులు జోడిగా 16 గ్రాండ్ స్లాం టైటిల్ 119 టూర్ లెవెల్ టైటిల్ ను గెలుచుకున్నారు. 2012 ఒలింపిక్స్ లో  కూడా స్వర్ణం సాధించారు.ఏటిపి  డబుల్స్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ జోడిగా పది సీజన్లు ముగించారు. బాబ్ మైక్  అమెరికా జట్టు 2007 లో డేవిస్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు.2020 లో తాము ఆటకు వీడ్కోలు  చెబుతామని ఈ బ్రయాన్ బ్రదర్స్  గతంలో  తెలిపారు. జాక్ సాక్ తో కలిసి  మైక్ మరో రెండు గ్రాండ్ స్లాం చరిత్రలో అత్యంత విజయవంతమైన జోడిగా 15ఏళ్లల్లో 25 మ్యాచ్ లు గెలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: టెన్నిస్ కు ఆటకు బ్రయాన్ సోదరుల రిటైర్మెంట్ ప్రకటింపు

ఎవరు: బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్

ఎప్పుడు: ఆగస్ట్ 27

ఎంసిడబ్ల్యుసిలో బంగారు పతకాన్ని సాధించిన నీలకంఠ భాను ప్రకాష్ :

మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ (ఎంఎస్‌ఓ) చేత మానసిక లెక్కల ప్రపంచ కప్ (ఎంసిడబ్ల్యుసి) లో హైదరాబాద్ నుంచి  నీలకంఠ భాను ప్రకాష్ జోన్నలగడ్డ భారతదేశాని తరపున  తొలి బంగారు పతకాన్ని ఈయన దక్కించుకున్నారు. అతను కొత్త ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించాడు మరియు మఠం మాస్ట్రోస్ అయిన శకుంతల దేవి మరియు స్కాట్ ఫ్లాన్స్బర్గ్ ల రికార్డులను కొట్టాడు.భారత్ నుంచి భాను ప్రకాష్ 167 స్కోరుతో స్వర్ణ పతకాన్ని, లెబనీస్ పోటీదారు అయిన మొహమ్మద్ ఎల్ మీర్ 102 స్కోరుతో రజత పతకాన్ని, యుఎఇ నుండి అస్మితా పాల్ 100 పాయింట్ల స్కోరుతో కాంస్య పతకాన్ని సాధించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఎంసిడబ్ల్యుసిలో బంగారు పతకాన్ని సాధించిన నీలకంఠ భాను ప్రకాష్

ఎవరు: నీలకంఠ భాను ప్రకాష్

ఎప్పుడు: ఆగస్ట్ 27

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *