
Daily Current Affairs in Telugu 30-07-2020
వేగవంతమైన మానవ కంప్యుటర్ గా ఖ్యాతి గాంచిన శకుంతల దేవికి అందించిన గిన్నిస్ సర్టిఫికేట్ :

అత్యంత వేగవంతమైన మానవ కంప్యుటర్ గా ఖ్యాతి గాంచిన భారత గణిత మేదావి శకుంతల దేవికి దాదాపు 4దశాబ్దాల తరువాత గిన్నిస్ సంస్థ సర్టిఫికేట్ అందజేసింది.1990 లో లండన్ ఇంపీరియల్ కాలేజ్ లో జరిగిన ప్రదర్శనలో 13అంకెల రెండు సంఖ్యలను గుణించిన శకుంతల దేవి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆమె సాధించిన రికార్డును చాల కాలం వరకు ఎవరు సమం చేయలేకపోయారు. అయితే అప్పటి నిబంధల ప్రకారం ఆమెకు గిన్నిస్ సంస్థ సర్టిఫికేట్ ను అందించలేదు.ఆమె 2013 బెంగుళూర్ లో చనిపోయారు.తాజాగా అరుణ్ మీనన్ దర్శకత్వంలో” శకుంతల దేవి” యొక్క బయోపిక్ ను రూపొందించింది. ఇందులో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించారు. జులై 30న జరిగిన లండన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో గిన్నిస్ ప్రతినిధులు శకుంతల దేవి కుమార్తె అనుపమ బెనర్జీకి అప్పటి రికార్డు సర్టిఫికేట్ ను అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వేగవంతమైన మానవ కంప్యుటర్ గా ఖ్యాతి గాంచిన శకుంతల దేవికి అందించిన గిన్నిస్ సర్టిఫికేట్ :
ఎవరు: శకుంతల దేవి
ఎప్పుడు: జులై 30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎన్.రమేష్ కుమార్ పునర్నియామకం :

హైకోర్ట్ తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించింది.ఈ మేరకు పంచాయితి రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది జులై 30 న ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్ట్ తీర్పు మేరకు ఆయనను తిరిగి నియమించాలని గవర్నర్ విశ్వబూషణ్ హరిచందన్ గారు నోటిఫికేషన్ జారీ చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎన్.రమేష్ కుమార్ పునర్నియామకం
ఎవరు: ఎన్.రమేష్ కుమార్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: జులై 30
ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలకు ఎంపిక అయిన తెలంగాణ రాష్ట్రం :

ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాల్లో తెలంగాణా రాష్ట్రం సత్తా చాటింది. రెండు స్వర్ణ పతకాలు ,ఒక రజత పతకాలను,రెండు ప్రతిభ పురస్కారాలను సాధించింది. జులై 30 డిల్లీలో నుంచి ఆన్ లైన్ లో జరిగిన 66వ స్కోచ్ శిఖరాగ్ర సదస్సులో నిర్వాహకులు వీటిని ప్రకటించారు. పారదర్శక పాలన ,ఆధునిక సాంకేతికత,సమ్మిలిత అబివృద్ది అంశాల్లో 2003నుంచి స్కోచ్ గ్రూప్ ఈ అవార్డులను అందజేస్తుంది. బ్లాక్ చైన్ సాంకేతికత ఆదారిత ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం రూపొందించిన ఐటి శాఖ స్వర్ణ పురస్కారాన్ని గెలుచుకుంది. టి-చిట్స్ ను రూపొందించినందుకు ఐటి శాఖకు వెండి పురస్కారం దక్కింది. .మేడారం జాతరలో రద్దీని నియంత్రించినందుకు గాను తెలంగణా పొలిసు శాఖక ,రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ సమాచార వెల్లడించే ఐటి శాఖకు రెండు ప్రతిభ పురస్కారాలు లబించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలకు ఎంపిక అయిన తెలంగాణ రాష్ట్రం
ఎవరు: తెలంగాణ రాష్ట్రం
ఎక్కడ: డిల్లీలో
ఎప్పుడు: జులై 30
నూతన జాతీయ విద్యా విధాన౦ 2020ను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్ :

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం నూతన జాతీయ విద్యా విధానం 2020 ను ఆమోదించింది. ఇటీవల ఆమోదించబడిన ఈ జాతీయ విద్యా విధానం 2020, ముప్పై నాలుగు సంవత్సరాల నాటి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ (ఎన్‌పిఇ), 1986 ను అమలు చేస్తుంది. జాతీయ విద్యా విధానం 2020 అనేది 21 వ శతాబ్దపు మొదటి విద్యా విధానం మరియు పాఠశాల మరియు ఉన్నత విద్యా రంగాలలో మార్పులు వంటి సంస్కరణలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ విద్యా విధానం 2020 సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాగా పెట్టుకుంది మరియు ఇది యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ, స్థోమత మరియు జవాబుదారీతనం యొక్క పునాది అంశాల పైన ఆధారపడి ఉంటుంది. 21 వ శతాబ్దం యొక్క అవసరాలకు అనుగుణంగా, పాఠశాల మరియు కళాశాల విద్యను మరింత సమగ్రమైన, సౌకర్యవంతమైన & మల్టీడిసిప్లినరీగా చేయడం ద్వారా భారతదేశాన్ని శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మరియు ప్రపంచ నాలెడ్జ్ సూపర్ పవర్‌గా మార్చడమే ఈ నూతన విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం .
క్విక్ రివ్యు :
ఏమిటి: నూతన జాతీయ విద్యా విధాన౦ 2020ను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్
ఎవరు : కేంద్ర కేబినేట్
ఎక్కడ : న్యుడిల్లి
ఎప్పుడు: జులై 29
బయోటెక్ రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన బి.ఎస్ బజాజ్ కన్నుమూత :

బయోటెక్ రంగంలో ప్రముఖ వ్యక్తిగా పేరున్న డాక్టర్ బి.ఎస్ బజాజ్ (93) జులై 28న కన్నుమూసారు.ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బయోటెక్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఎబిఎ) వ్యవస్థాపక కార్యదర్శిగా పని చేసిన ఆయన హైదరాబాద్ లో జినోమ్ వ్యాలీ ఏర్పాటుకు ,2019 లో జరిగిన బయో ఆసియా సదస్సుకు చాలా కృషి చేశారు. 1999 లో హైదరాబాద్‌లోని బయో టెక్నాలజీ స్థాపనకు బజాజ్ ఒక ప్రమోటర్ గా కూడా పనిచేసారు. రాష్ట్రంలో ఆయన రూపొందించిన బయోటెక్ పరిశ్రమ పాలసి ద్వారా జినోమ్ వ్యాలీ ఏర్పాటుకు దాని పెరుగుదలకు చాల ఉపయోగపడింది. బయో టెక్ రంగంలో ని మందులు వ్యాక్సిన్ లు తయారీలో ఆయన చాలా మంది శాస్త్రవేత్తలకు మార్గానిర్దేశకం గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బయోటెక్ రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన బి.ఎస్ బజాజ్ కన్నుమూత
ఎవరు: బి.ఎస్ బజాజ్
ఎప్పుడు: జులై 29
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |