
Daily Current Affairs in Telugu 01-08-2020
హౌస్ ఆఫ్ లార్డ్స్ సబ్యుడిగా ఎంపిక అయిన మాజీ క్రికెటర్ ఇయాన్ బోధం :

బ్రిటిష్ పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ సబ్యుడిగా ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజ ఆల్ రౌండర్ ఇయాన్ బోధం ఎంపిక అయ్యాడు. అక్కడి ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 36 మంది సబ్యుల జాబితాలో అతనికి చోటు దక్కింది. క్రికెట్ చారిటి పరంగా ఆయన చేసిన సేవలకు గాను 2007 లో అతనికి నైట్ హుడ్ గుర్తింపు లబించింది.. బ్రిగ్జిట్ కు మద్దతు గా నిలిచే ఈ మాజీ కెప్టెన్ ఇంగ్లాండ్ తరపున 102 టెస్టులు ఆడాడు. అతను స్వతంత్ర సబ్యుడిగా హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎంపిక అయిన తొలి క్రికెటర్ ఇయాన్ బోధం కావ డం విశేషం .
క్విక్ రివ్యు :
ఏమిటి: హౌస్ ఆఫ్ లార్డ్స్ సబ్యుడిగా ఎంపిక అయిన ఇయాన్ బోధం
ఎవరు: ఇయాన్ బోధం
ఎక్కడ: లండన్
ఎప్పుడు: ఆగస్ట్ 01
ఐఐటి రూర్కీ పూర్వ విద్యార్థికి దక్కిన జిన్నోవ్ -2020 పురస్కారం :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర్కీ పూర్వ విద్యార్ధి అయిన ఉప్పల సునీల్ కుమార్ కు ప్రతిస్థాత్మక జిన్నోవ్-2020 పురస్కారం లబించింది. కృత్రిమ మేధా ,డేటా అనలిటిక్స్ రంగాల్లో చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డు లబించిది అని ఐఐటి ఆగస్ట్ 01 న ప్రకటించింది.ఐఐటి రూర్కీ కి ఇది గర్వకారణం అని తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐఐటి రూర్కీ పూర్వ విద్యార్థికి దక్కిన జిన్నోవ్ -2020 పురస్కారం
ఎవరు: సునీల్ కుమార్
ఎప్పుడు: ఆగస్ట్ 01
ఎన్ ఎండి సి సిఎండి గా బాద్యతలు స్వీకరించిన సుమిత్ దేబ్ :

ఎన్ఎండిసి సిఎండి గా సుమిత్ దేబ్ గారు ఆగస్ట్ 01 న ఆయన బాద్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఎన్.బెజేంద్ర కుమార్ గారు పదవి విరమణ చేశారు. నూతన సిఎండి గా సుమిత్ దెబ్ కు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్(ఆర్ఎన్ఐఎల్) ,ఎన్ఎండిసి లిమిటెడ్ లో దీర్గాకాలం పాటు పని చేసిన అనుబవం ఆయనకు ఉంది. ఇంతకుముందు వరకు ఆయన ఎన్ ఎండిసి లోనే డైరెక్టర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ) గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎన్ ఎండి సి సిఎండి గా బాద్యతలు స్వీకరించిన సుమిత్ దేబ్
ఎవరు: సుమిత్ దేబ్
ఎప్పుడు: ఆగస్ట్ 01
ఐవోబి ఎండి గా ప్రతిం సేన్ గుప్తా నియామకం :

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబి) మేనేజింగ్ డైరెక్టర్ సియివో గా పార్థ ప్రతిం సేన్ గుప్తా నియమితులయ్యారు.ఈ మేరకు బ్యాంక్ ఆగస్ట్ 01న ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకు ముందు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) లో డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ ,చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ గా కూడా అయన సేవలను అందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐవోబి ఎండి గా ప్రతిం సేన్ గుప్తా నియామకం
ఎవరు: ప్రతిం సేన్ గుప్తా
ఎప్పుడు: ఆగస్ట్ 01
రాజ్యసభ సీనియర్ సబ్యుడు ఎంపి అమర్ సింగ్ కన్నుమూత :

రాజ్యసభ సీనియర్ సభ్యుడు సమాజ్ వాది పార్టీ మాజీ నేత అమర్ సింగ్ (64) కన్నుమూసారు. దీర్గకాళికాలికంగా అయన అస్వస్థతతో బాధ పడుతున్నాడు. సింగ పూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్ట్ 01న అయన కన్నుమూసారు. సమాజ్ వాది పార్టీలో అగ్ర నేత అయిన ములాయం సింగ్ కు అమర్ సింగ్ అత్యంత నమ్మకస్తునిగా ఉండేవాడు. 2008 భారత్-అమెరికామద్య జరిగిన అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి యుపిఎ సర్కారుకు వామ పక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. ఆ సమయంలో ఎస్పీమద్దతుతో ప్రభుత్వం ను నిలబెట్టుకోవడంలో అమర్ సింగ్ ది కీలక పాత్ర పోషించాడు..
క్విక్ రివ్యు :
ఏమిటి: రాజ్యసభ సీనియర్ సబ్యుడు ఎంపి అమర్ సింగ్ కన్నుమూత
ఎవరు: ఎంపి అమర్ సింగ్
ఎప్పుడు: ఆగస్ట్ 01
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |