Daily Current Affairs in Telugu 17-07-2020
వైరా కేవికే కు దక్కిన దీన్ దయాల్ ప్రోత్సాహక అవార్డు:

రైతులకు ఉత్తమ విస్తరణ మరియు వైజ్ఞానిక సేవలు అందించినందుకుగాను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రతిష్టాత్మకమైన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ అవార్డును పొందింది.భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 16న ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డును ప్రకటించారు. అలాగే జమ్మికుంట కేవీకేలో డ్రై కన్వర్ట్ వైట్ రైస్ విధానంలో వరి సాగు చేయడమే కాక, సోషల్ మీడియా ద్వారా ఇతర జిల్లాల రైతులను కూడా ఈ పద్ధతి వైపు మళ్లించేందుకు చేసిన కృషికిగాను మహిళా రైతు ఆర్.లక్ష్మి ఐసీఏఆర్ అవార్డు పొందారు
క్విక్ రివ్యు :
ఏమిటి: వైరా కేవికే కు దక్కిన దీన్ దయాల్ ప్రోత్సాహక అవార్డు
ఎవరు: వైరా కేవికే
ఎప్పుడు; జులై 17
సహకార రంగంలోనే ఏర్పాటుకానున్న తొలి మహిళా బ్యాంక్ :

సహకార రంగంలో తొలిసారిగా మహిళా బ్యాంకు ఏర్పడింది. రూరల్ మండలం చల్లవారిపాలెంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నల్లపాడు బ్రాంచ్ ని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారి చే జూలై 16న ప్రారంభించారు. స్వయం సహాయక గ్రూపుల సంక్షేమం కోసమే ప్రత్యేకంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ చైర్మన్ సీతారామాంజనేయులు తెలిపారు
క్విక్ రివ్యు :
ఏమిటి: సహకార రంగంలోనే ఏర్పాటుకానున్న తొలి మహిళా బ్యాంక్
ఎవరు: హోంమంత్రి మేకతోటి సుచరిత
ఎక్కడ:ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు; జులై 17
భారత్ లోనే ఏర్పాటు కానున్న వివో డిజైన్ సెంటర్ :

స్థానికంగా డివైజ్ ను అభివృద్ధి చేసే క్రమంలో చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో భారత్ లో పారిశ్రామిక డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్యను 30,000కు పెంచుకోనుంది. వివో ఇండియా డెరైక్టర్ (బ్రాండ్ స్ట్రాటజీ విభాగం) నిపుణ్ మార్యా జూలై 16న ఈ విషయాలు తెలిపారు. 3.3 కోట్లు యూనిట్లుగా ఉన్న స్మార్ట్ఫోన్స్ తయారీ సామర్థ్యాన్ని 12 కోట్లకు పెంచుకునే దిశగా భారత్ లో రూ. 7,500 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను కూడా కంపెనీ ఇప్పటికే ప్రకటించినట్లు ఆయన వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లోనే ఏర్పాటు కానున్న వివో డిజైన్ సెంటర్
ఎక్కడ: భారత్ లో
ఎప్పుడు: జులై 17
పాకిస్తాన్ మరియు చైనాదేశాలు “ఆజాద్ పట్టన్ హైడెల్ పవర్ ప్రాజెక్ట్” కోసం కుదుర్చుకున్న ఒప్పందం:

పాకిస్తాన్ మరియు చైనా ఆజాద్ పట్టన్ హైడెల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆజాద్ పట్టన్ జలశక్తి ప్రాజెక్టు కోసం చైనా గెజౌబాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చూశారు.సిపిఇసిలో భాగంగా, 1.5 బిలియన్ డాలర్లు మరియు 700.7 మెగావాట్ల విద్యుత్ పెట్టుబడితో, ఆజాద్ పట్టన్ ఎటువంటి ఇంధన దిగుమతి పరిమితిని కలిగి ఉండదు, స్థానిక ఉపాధి అవకాశాలను ఉత్పత్తి చేసేటప్పుడు దేశం చౌకగా మరియు పచ్చదనం వైపు వెళ్ళటానికి వీలు కల్పిస్తుంది. జీలం నది వద్ద ఉన్న ఈ ప్రాజెక్ట్ 2026 లో పూర్తవుతుందని భావిస్తున్నారు.ఈ ఒప్పందం సంతకం కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ దేశ అభివృద్ధి మరియు శ్రేయస్సులోఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పాకిస్తాన్ మరియు చైనాదేశాలు “ఆజాద్ పట్టన్ హైడెల్ పవర్ ప్రాజెక్ట్” కోసం కుదుర్చుకున్న ఒప్పందం
ఎవరు: పాకిస్తాన్ మరియు చైనాదేశాలు
ఎప్పుడు; జులై 16
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |