
Daily Current Affairs in Telugu 16-08-2020
స్పానిష్ గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచిన లూయిస్ హమిల్టన్ .:

ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ అయిన లూయిస్ హమిల్టన్ జోరు కొనసాగిస్తున్నాడు. ఆగస్ట్ 16 న జరిగిన స్పానిష్ గ్రాండ్ ఫ్రీ లో అతను విజేతగా నిలిచాడు. కెరీర్లో 88 వ గ్రాండ్ ఫ్రీ టైటిల్ సాధించిన అతను .శుమంకర్ (91) రికార్డును మరింత చేరువలో ఉన్నాడు.గంట 31 నిమిషాల 45,279 సెకన్ లలో రేసు ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఈ మెర్సిడెజ్ రేసర్ ప్రపంచ చాంపియన్ షిప్ పాయింట్లు ఆధిక్యాన్ని 37 కు పెంచుకున్నాడు.వేర్ స్తాపెన్ (రెడ్ బుల్),బొటాస్ (మెర్సిడెజ్) లు వరుసగా రెండు మూడు స్థానాలలో నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్పానిష్ గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచిన లూయిస్ హమిల్టన్
ఎవరు : లూయిస్ హమిల్టన్
ఎప్పుడు : .ఆగష్ట్ 15
ఫ్రాగ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా నిలిచిన సిమోనా హలేప్ :

కరోనా వైరస్ నేపద్యంలో చాల రోజుల విరామం తరువాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ లోనే రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హాలేప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆగస్ట్ 16న ముగిసిన ఫ్రాగ్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ గా హలేప్ 6-2,7-5, తో మూడో సీడ్ లో ఎలిజ్ మేర్తెన్స్ (బెల్జియం )పై విజయం సాధించింది.ఈ ఏడాది హాలేప్ ఖాతాలో చేరిన రెండో టైటిల్ ఇది ఓవరాల్ గా ఆమె కెరీర్లో ఇది 21వ సింగిల్స్ టైటిల్ .93 నిమిషాలు పాటు జరిగిన ఫైనల్లో హలేప్ తన ప్రత్యర్థి సర్వీసును ఆరు సార్లు బ్రేక్ చేసేంది.చాంపియన్ హలేప్ కు 25వేల డాలర్ల ప్రైజ్ మని తో పాటు 280 ర్యాంకింగ్ పాయంట్లు లబించాయి. గత ఫిబ్రవరిలో దుబాయ్ ఓపెన్ లోను హాలేప్ విజేతగా నిలిచింది.ఆ తరువాత కరోన వైరస్ కారణంగా అంతర్జాతీయ టోర్నీలు నిలిచిపోయాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫ్రాగ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా నిలిచిన సిమోనా హలేప్:
ఎవరు : సిమోనా హలేప్
ఎక్కడ: ఫ్రాగ్ (చెక్ రిపబ్లిక్ )
ఎప్పుడు : .ఆగష్ట్ 16
ఇండియన్ క్రికెటర్ ,సీనియర్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా ఆటకు ప్రకటించిన రిటైర్మెంట్ :

సీనియర్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా కూడా టీం ఇండియా మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని బాటలోనే నడిచాడు. ధోని అంతర్జతీయ ఆటకు వీడ్కోలు పలికినట్లు వెల్లడించిన కొద్దిసేపటి లో తాను కూడా తప్పు కుంటున్నట్లు 33 ఏళ్ల ఈ క్రికెటర్ సురేష్ రైనా ప్రకటించాడు. అతను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెపుతూ ధోని సహా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తో ఉన్న పోటో ను పోస్ట్ చేసాడు .2005 శ్రీలంక పై వన్డే లో అరంగ్రేటం చేసిన రైనా 2018 లో తన చివరి మ్యాచ్ ను ఆడాడు. 226 వన్డే లలో 35.31 సగటు తో 5615 పరుగులు చేసిన రైనా 5శతకాలు ,36 అర్థ శతకాలు సాధించాడు.18 టెస్టుల్లో 26.48 సగటు తో 768 పరుగులు ,78 టి20 లలో 29.18 సగటు తో 1605 పరుగులు చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్ క్రికెటర్ ,సీనియర్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా ఆటకు ప్రకటించిన రిటైర్మెంట్:
ఎవరు : సురేష్ రైనా
ఎక్కడ: చెన్నై
ఎప్పుడు : .ఆగష్ట్ 16
2020 సంవత్సరానికి గాను శౌర్య చక్ర అవార్డులకు నలుగురిని ఎంపిక :

2020 సంవత్సరానికి గాను స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా నలుగురిని శౌర్య చక్ర అవార్డులకు ఎంపిక అయ్యారు. ఈ మేరకు భారత రక్షణ బలగాలకు ఇచ్చే వివిధ గ్యాలంటరీ అవార్డు లకు భారత రాష్ట్రపతి అయిన రామ్ నాథ్ కోవిద్ గారు ఆమోద ముద్ర వేసారు.ఈ ఏడాది శౌర్య చక్ర పురస్కారానికి ముగ్గురు ఆర్మీ నుంచి ఒకరు వైమానిక దళం నుంచి ఎంపిక అయినట్లు రక్షణ శాఖా ఆగస్ట్ 14 తెలిపింది.జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద వ్యతిరేఖ కార్యకలపాల్లలో పాల్గొన్న లెఫ్టినెంట్ కల్నల్ కిషన్ సింగ్ రావత్ ,మేజర్ అనిల్ ఉర్స్ ,హవల్ దార్ అలోక్ కుమార్ దూబే ఆర్మీ నుంచి ఎయిర్ పోర్స్ నుండి వింగ్ కమాండర్ విశాక్ నాయర్ లకు శౌరుచక్ర అవార్డు కు ఎంపిక అయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి2020 సంవత్సరానికి గాను శౌర్య చక్ర అవార్డులకు నలుగురిని ఎంపిక
ఎవరు : లెఫ్టినెంట్ కల్నల్ కిషన్ సింగ్ రావత్ ,మేజర్ అనిల్ ఉర్స్ ,హవల్ దార్ అలోక్ కుమార్, విశాక్ నాయర్
ఎక్కడ: న్యు డిల్లీ
ఎప్పుడు : .ఆగష్ట్ 16
టీం ఇండియా మాజీ ఓపెనర్ అయిన చేతన్ చౌహాన్ కన్ను మూత:

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ గారు ఇటీవల కన్నుమూసారు. కోవిద్ -19 దుష్ప్రబవాల మూలంగా ఆగస్ట్ 16న ఆయన తుది శ్వాస విడిచారు.73 ఏళ్ల చేతన్ ఉత్తరప్రదేశ్ కేబినేట్ మంత్రి కూడా పనిచేసారు..కరోన సోకడం తో జులై 12 న లక్నవు లోని సంజయ్ గాంధీ పి జి ఐ లో చేరారు. కిడ్నీ సమస్య ఉండడంతో అయన ఆరోగ్యం క్షీణించింది.దీంతో గురుగ్రాం లోని మేదాంత ఆసుపత్రికి మార్చారు.36గంటల పాటు వెంటి లెటర్ పై ఉన్న అనంతరం ఆయన మృతి చెందారు. చేతన్ భారత జట్టు తరపున 40టెస్టుల్లో 31.57 సగటు తో 2084 పరుగులు చేశారు.ఏడు వన్డేలో 153 పరుగులు చేసారు
క్విక్ రివ్యు :
ఏమిటి: టీం ఇండియా మాజీ ఓపెనర్ అయిన చేతన్ చౌహాన్ కన్ను మూత
ఎవరు : చేతన్ చౌహాన్
ఎక్కడ: ఉత్తరప్రదేశ్ (లక్నో)
ఎప్పుడు : .ఆగష్ట్ 16
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |