Daily Current Affairs in Telugu 01-07-2020

భూటాన్ తో 600 మెగా వాట్ల జలవిధ్యుత్ ప్రాజెక్ట్ కోసం భారత్ ఒప్పందం :

భూటాన్ లో 600 మెగా వాట్ల ఖోలాంగ్ చు జాయింట్ వెంచర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి భారత్ మరియు భూటాన్ ఇరు దేశాలు పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నాయి. భూటాన్ ప్రభుత్వం మరియు ఖోలాంగ్ చు హైడ్రో ఎనర్జీ లిమిటెడ్ మధ్య ఈ ప్రాజెక్ట్ కోసం ఈ ఒప్పందం ను భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ మరియు భూటన్ దేశ ప్రతినిధి కౌంటర్ తాండి దోర్జీ సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేయబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భూటాన్ తో 600 మెగా వాట్ల జలవిధ్యుత్ ప్రాజెక్ట్ కోసం భారత్ ఒప్పందం
ఎవరు; భారత్
ఎప్పుడు: జులై 01
స్కిల్ కనెక్ట్ ఫోరం అనే ఒక నూతన పోర్టల్ ను ప్రారంబించిన కర్ణాటక ప్రబుత్వం :

ఉద్యోగార్ధులను మరియు యజమానులతో ఓక సాదారణ వేదికపై కనెక్ట్ చేయడానికి కర్నాటక ప్రభుత్వం స్కిల్ కనెక్ట్ ఫోరం అనే ఒక పోర్టల్ ను ప్రారంబించింది. ఇది ఉద్యోగార్తులను అందుబాటులో ఉన్న ఉద్యోగులపై సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఏ వ్యక్తి అయిన వారి వివరాలు అర్హత నైపుణ్యం సెట్లు మరియు ఇతర వివరాలను అప్ లోడ్ చేయడం ద్వారా ఈ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చ్చు .అదే పద్దతిలో యజమానులు పోర్టల్లో కూడా నమోదు చేస్తారు.ఇది వారి వారి అవసరాలకు మరియు లబ్యత కు సరిపోయిన అబ్యర్తులను వారికీ కనెక్ట్ చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్కిల్ కనెక్ట్ ఫోరం అనే ఒక నూతన పోర్టల్ ను ప్రారంబించిన కర్ణాటక ప్రబుత్వం
ఎవరు; కర్ణాటక ప్రబుత్వం
ఎక్కడ: కర్ణాటక
ఎప్పుడు: జులై 01
భారత దేశ అటార్నీ జనరల్ గా కే.కే వేణుగోపాల్ పదవి కాలాన్ని పొడగింపు:

ప్రస్తుత భారత అటార్నీ జనరల్ గా ఉన్న కే.కే వేణుగోపాల్ గారి యొక్క పదవి కాలాన్ని పొడగింపు కు కేబినేట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. అతని పదవి కాలం జులై 01,2020 నుండి ఒక సంవత్సరం వరకు పొడగించబడింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత ను తిరిగి నియమించడానికి కూడా మూడేళ్ళ కాలానికి ACC ఆమోదం తెలిపింది. ACC డిల్లి హైకోర్ట్ కు చేతన్ శర్మ ను అదనపు (సొలిసిటర్ జనరల్ ఎఎస్జి) గా ACC నియమించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత దేశ అటార్నీ జనరల్ గా కే.కే వేణుగోపాల్ పదవి కాలాన్ని పొడగింపు
ఎవరు; కే.కే వేణుగోపాల్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జులై 01
భారతదేశంలోనే మొట్టమొదటి ఫాస్మ బ్యాంక్ను డిల్లిలో ఏర్పాటు:

కోవిద్ -19రోగులకు చికిత్స చేయడానికి డిల్లి ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి ఫ్లాస్మా బ్యాంక్ ను ఏర్పాటు చేస్తుంది.డిల్లి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరి సైన్స్ లో ఇది ఏర్పాటు చేయబదుతుంది. మరియు ఒక కోవిద్ -19 రోగికి అదే అవసరమైతే వైద్యులు లేదా ఆసుపత్రులు ఫ్లాస్మ కోసం బ్యాంకు ను సంప్రదించాలి 2020 జులై నాటికీ ఫ్లాస్మా బ్యాంక్ తన కార్యకలాపాలను ప్రారంబిస్తుంది. కోవిద్ -19 నుండి కోలుకున్న వారిని ఫ్లాస్మా దానం చేయమని డిల్లీ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశంలోనే మొట్టమొదటి ఫాస్మ బ్యాంక్ను డిల్లిలో ఏర్పాటు:
ఎవరు; డిల్లి ప్రభుత్వం
ఎక్కడ: డిల్లిలో
ఎప్పుడు: జులై 01
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |