Daily Current Affairs in Telugu 22-08-2020
భారత హాకి హై పర్ఫార్ఫెన్స్ డైరెక్టర్ గా ఉన్న పదవికి డేవిడ్ జాన్ రాజీనామా :

భారత హాకి హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ అయిన డేవిడ్ జాన్ ఇటీవల రాజీనామా చేసారు.సుదీర్గ కాలం పాటు ఈ పదవిలో ఉన్న అతను సమాఖ్య అధికారులతో పొసగక ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.డేవిడ్ తో ఒప్పందాన్ని సాయ 2021 సెప్టెంబర్ వరకు పొడగించిన తరువాత అతను రాజీనామా చేయడం గమనార్హం .వ్యక్తి గత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నట్లు హాకి ఇండియా సాయ్ కు పంపిన లేఖలో డేవిడ్ పేర్కొన్నారు. హాకి ఇండియా తన ప్రాదాన్యం తగ్గించడం తో జాన్ విసిగిపోయాడు. 2011 లో కోచ్ గా మైకేల్ నాబ్స్ అద్వర్యంలో ని టీం ఇండియా కు పిజియో గా సేవలందించిన అయన జున్ 2012 లండన్ ఒలింపిక్స్ తరువాత జట్టును వీడాడు.మళ్ళి 2016 హై పర్మార్మేన్స్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత హాకి హై పర్ఫార్ఫెన్స్ డైరెక్టర్ గా ఉన్న పదవికి డేవిడ్ జాన్ రాజీనామా
ఎవరు: డేవిడ్ జాన్
ఎప్పుడు: ఆగస్ట్ 21
నూతన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియామకం :

కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. అశోక్ లవాసా రాజీనామాతో ఈ నెల 31 నుంచి ఖాళి అయ్యే స్థానంలో రాజీవ్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించ్నట్లు ఆగస్ట్ 20న జరీ చేసిన నోటిఫికేషన్ లో కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేసింది. రాజీవ్ కుమార్ 1984 జార్ఖండ్ కేదార్ ఐఎఎస్ అధికారి 1960 ఫిబ్రవరి 19 న ఉత్తరప్రదేశ్ లో జన్మించిన ఈయన తనకు 65 ఏళ్ళు వచ్చేంత వరకు ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారు.ఆర్ధిక కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ప్రధాన మంత్రి ముఖ్య నినాదమైన ఆర్ధిక సమ్మిలిత విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నూతన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియామకం
ఎవరు: రాజీవ్ కుమార్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: ఆగస్ట్ 21
బ్రిటిష్ టెన్నిస్ లెజెండ్ ఏంజెలా బక్త్సన్ కన్నుమూత :

బ్రిటిష్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ ఛాంపియన్, సమాన హక్కుల మార్గదర్శకురాలు ఏంజెలా బక్త్సన్ కన్నుమూశారు. బక్త్సన్ 1956 లో రోలాండ్ గారోస్ మరియు వింబుల్డన్ రెండింటిలోనూ ఆల్తీయా గిబ్సన్‌తో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. బక్స్టన్ 1956 లో వింబుల్డన్‌లో సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్నాడు, కాని అమెరికన్ షిర్లీ ఫ్రై చేతిలో ఓడిపోయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిటిష్ టెన్నిస్ లెజెండ్ ఏంజెలా బక్త్సన్ కన్నుమూత
ఎవరు: ఏంజెలా బక్స్టన్
ఎప్పుడు: ఆగస్ట్ 20
ఉత్తమ ఉపద్యాయులకు జాతీయ అవార్డు లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం :

కేంద్ర విద్యాశాఖ జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్ టీచర్ ఆసన్న మధు బాబు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర పాఠశాల విద్యా విభాగం సంచాలకులు జి.విజయభాస్కర్ ఆగస్ట్ 21న జారీచేసిన ఉత్తర్వు లో పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి మలక్ పేట్ ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ ఉపాధ్యాయులు పద్మప్రియ వుమ్మాజి ఎంపికయ్యారు విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య విభాగం 2020 సంవత్సరానికి అవార్డు గ్రహీతలను ఎన్నుకోవటానికి జాతీయ స్థాయిలో స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీ ఇచ్చిన విజేతలు నివేదిక ఆధారంగా ఈ సెలెక్షన్ లిస్టుని ప్రకటించింది ఈ సంవత్సరానికి ఆ జ్యూరీ కమిటీ 153 మంది ఉపాధ్యాయులను షార్ట్ లిస్ట్ చేయగా అందులో నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన 36 మంది టీచర్లను జాతీయ టీచర్ అవార్డులకి ఎంపిక చేసింది. ఈ జాబితాకు కేంద్ర విద్యాశాఖా మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ ఆమోదం తెలిపారు.
క్విక్ రివ్యు :
ఎవరు: ఉత్తమ ఉపద్యాయులకు జాతీయ అవార్డు లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం :
ఏమిటి: ఆసన్న మధు బాబు, పద్మప్రియ వుమ్మాజి
ఎక్కడ: న్యుదడిల్లి
ఎప్పుడు:ఆగస్ట్ 21
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |