Daily Current Affairs in Telugu 28-08-2020

Daily Current Affairs in Telugu 28-08-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2020 ను గెలుచుకున్న డచ్ రచయిత మేరీకే లూకాస్ రిజ్నెవెల్డ్:

డచ్ రచయిత, మేరీకే లూకాస్ రిజ్నెవెల్డ్ తన తొలి నవల ‘ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్’ అనే నవల కు  అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2020 ను గెలుచుకున్నారు. రిజ్నెవెల్డ్ 29 సంవత్సరాల వయస్సులో ఈ బహుమతిని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాల రచయితగా నిలిచారు. ఈ పుస్తకం ఒక క్రైస్తవ వ్యవసాయ కుటుంబంలో జాస్ అనే అమ్మాయి యొక్క కల్పిత కథను గురించి చెబుతుంది, ఆమె సోదరుడు తన కుందేలుకు బదులుగా చనిపోతాడని ఆమె కోరిన తరువాత ప్రమాదంలో మరణిస్తుంది. ఈ పుస్తకం మొట్టమొదట 2018 లో డచ్‌లో ప్రచురించబడింది మరియు చివరికి మిచెల్ హచిసన్ ద్వారా  ఆంగ్లంలోకి అనువదించబడింది. ఇద్దరికీ సమాన గుర్తింపు ఇవ్వడానికి £ 50,000 బహుమతి ($ 66,000) రచయితకు మరియు అనువాదకుల మధ్య సమానంగా విభజించబడుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2020 ను గెలుచుకున్న డచ్ రచయిత మేరీకే లూకాస్ రిజ్నెవెల్డ్:

ఎవరు: డచ్ రచయిత మేరీకే లూకాస్ రిజ్నెవెల్డ్

ఎప్పుడు: ఆగష్ట్ 28

200 2ఉపాధ్యాయుల  జాతీయ అవార్డుకు ఎంపికయిన శ్రీమతి సుధా పైనులి :

శ్రీమతి సుధా పైనులి 2020 ఉపాధ్యాయులకు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయులకు 2020సంవత్సరానికి గాను జాతీయ అవార్డుకు ఎంపికైన 47 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో ఆమె ఒకరు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం ఏర్పాటు చేసిన కమిటీ జాతీయ స్థాయిలో స్వతంత్ర జ్యూరీ ద్వారా ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. శ్రీమతి సుధా పైనులి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద స్థాపించబడిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఇఎంఆర్ఎస్) నుండి మొదటి NAT అవార్డు గ్రహీత గా నిలిచారు. ఆమె పాటశాల స్థాపించబడినప్పటి నుండి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని EMRS- కల్సీ వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తోంది. ఆమె తన వినూత్న ప్రయోగాలైన ఏకలవ్య బర్త్ డే గార్డెన్, థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్, ఏకలవ్య ట్రైబల్ మ్యూజియం, స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్ మొదలైన వాటికి ఎంపికైంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2020 ఉపాధ్యాయుల జాతీయ అవార్డుకు ఎంపికయిన శ్రీమతి సుధా పైనులి

ఎవరు: శ్రీమతి సుధా పైనులి

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు:ఆగష్ట్ 28

ఏపి ఐసిడిఎ బోర్డు చైర్మన్ గా సిఎం జగన్ భాద్యతలు :

రాష్ట్ర పారిశ్రామిక నడవా అబివృద్ది సంస్థ (ఏపి ఐసిడిఎ ) ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆగస్ట్ 28న ఉత్తర్వులు జారీ చేసింది.2017 రాష్ట్ర పారిశ్రామిక నడవా అబివృద్ది చట్టంలోని నిబందనల మేరకు బోర్డు ఎగ్సిక్యుటివ్ కమిటీ ఏర్పాటు చేయాలనీ ఉత్తర్వుల్లో పేర్కొంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు  ఏపిఐసిడిఎ బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తారు.వైస్ చైర్మన్ గా పరిశ్రమ శాఖ మంత్రి గౌతం రెడ్డి ,ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్న  రాజేంద్ర నాథ్ రెడ్డి తో పాటు వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శిగా ఉన్నత అధికారులు పదిమంది సభ్యులు ఉంటారు. ఎపి ఐసిడిఏ  ఎగ్సిక్యుటివ్ కమిటీ చైర్మన్ గా పరిశ్రమల శాఖ ప్రత్యెక కార్యదర్శిగా వ్యవహరిస్తారు.వివిధ శాఖలకు చెందిన ఎనిమిది మంది అధికారులు సబ్యులుగా ఉంటారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఏపి ఐసిడిఎ బోర్డు చైర్మన్ గా సిఎం జగన్ భాద్యతలు

ఎవరు: సిఎం జగన్

ఎక్కడ:ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు:ఆగష్ట్ 28

ప్రపంచ౦లోనే అత్యంత ధనికుడు జేప్ బెజోస్ సృష్టించిన సరికోత్త రికార్డు :

ప్రపంచంలోనే అత్యంత ధన వంతుడైన  జెఫ్ బెజోస్ మరో రికార్డును సృష్టించారు.ప్రపంచంలోనే తొలిసారిగా రెండు వందల బిలియన్ డాలర్ల  (దాదాపు రూ.15 లక్షల కోట్లు )సంపదను అధిగమించిన తొలి వ్యక్తిగా అయ్యారు. బ్లూమ్ బర్గ్  బిలియనీర్ సూచీ ప్రకారం అమెజాన్ సియివో సంపద ఆగస్ట్  27నాటికి  202 డాలర్ల  బిలియన్ డాలర్లకు చేరింది. కంపెని షేర్లు రాణించడం ఇందుకు నేపద్యం. గత మూడు నెలల్లోనే అమెజాన్ కంపెని షేరు 25శాతం ఈ ఏడాది మొత్తం మీద 86శాతం మేర పెరగడం విశేషం .

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ లోనే అత్యంత ధనికుడు జేప్ బెజోస్ సృష్టించిన సరికోత్త రికార్డు

ఎవరు: జేప్ బెజోస్

ఎప్పుడు: ఆగష్ట్ 28

ప్రముఖ  కంప్యుటర్ డిజైనర్ &ఇంజనీర్ ఆర్నాల్డ్ స్పీల్ బెర్గ్  కన్నుమూత :

ఆర్నాల్డ్  మేయర్  స్పీల్ బెర్గ్ ఒక  ప్రముఖ కంప్యుటర్  డిజైనర్ మరియు వినూత్న ఇంజనీర్ 103 సంవత్సరాల వయసులో కన్నుమూసారు.స్పీల్ బెర్గ్  మరియు చార్లెస్ ప్రపార్ట్స్ 1950 వ సంవత్సరం చివరిలో జనరల్ ఎలక్ట్రిక్ కోసం పని చేస్తున్నపుడు GE-225 అనే మెయిన్ ఫ్రేం కంప్యుటర్ ను రూపొందించారు.ఈ యంత్రం  దార్మౌత్ కాలేజిలో కంప్యుటర్ శాస్త్రవేత్త లను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ ను అబివృద్ది చేయడానికి అనుమతించింది. ఇది 1970 మరియు 80 లలో వ్యక్తిగత కంప్యూటర్ల తయారీలో పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడింది. స్పీల్ బెర్గ్  ఫిబ్రవరి 6,1917  న ఒహియోనా లోని సిన్సినాటి లో జన్మించాడు. అతను ఆయన కు కుమారుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఒక చిత్ర నిర్మాత.ఈయన యొక్క మొట్ట మొదటి పూర్తిస్థాయి చిత్రం “ఫైర్ లైట్ “ ను నిర్మించడానికి వారికీ స్పీల్ బెర్గ్ సహాయం చేసాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రముఖ  కంప్యుటర్ డిజైనర్ &ఇంజనీర్  ఆర్నాల్డ్ స్పీల్ బెర్గ్  కన్నుమూత

ఎవరు: ఆర్నాల్డ్ స్పీల్ బెర్గ్ 

ఎప్పుడు: అగస్ట్  28

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *