Daily Current Affairs in Telugu 23-08-2020

Daily Current Affairs in Telugu 23-08-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

 2020 ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న రోనీయో సులీవన్ :

స్నూకర్ ప్లేయర్ అయిన రోనీ ఓ సుల్లివన్  కైరెన్ విల్సన్‌ను 18-8 స్కోరుతో ఓడించి ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ 2020 ను గెలుచుకున్నాడు. షెఫీల్డ్ యొక్క క్రూసిబుల్ థియేటర్‌లో ఆగస్ట్ 22న జరిగిన పోటీలో  తన ఆరో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను పొందాడు. ఈ విజయంతో, 1978 లో 45 ఏళ్ళ వయసున్న రియర్డన్ తరువాత రోనీ ఓ సులీవన్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో చాలా రోజుల తరువాత ఆ ఘనత సాధించి  విజేతగా నిలిచాడు. అతను గత సంవత్సరం అయిన ఛాంపియన్ జుడ్ ట్రంప్ కంటే తొందరగా  ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి చేరుకున్నాడు

క్విక్ రివ్యు :

ఏమిటి: 2020 ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న రోనీయో సులీవన్

ఎవరు: రోనీయో సులీవన్

ఎప్పుడు: ఆగస్ట్ 23

 విజయవంతగా నింగిలోకి ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ను పంపిన చైనా :

సరికొత్త ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని చైనా ఆగస్ట్ 23న విజయవంతంగా  ప్రయోగించింది. గావో పెన్ 905 అనే ఈ ఉపగ్రహాన్ని జియోక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2డి రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది.ఈ రాకెట్ తో టి యాంగ్ టువో -5 ఉపగ్రహం మరో బహుళ ప్రయోజన శాటిలైట్ ను కూడా శాస్త్రవేత్తలు  ప్రయోగించారు.  లాంగ్ మార్చ్ శ్రేణి లోని  రాకెట్లలో ఇది 343 వ ప్రయోగమని వారు తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: విజయవంతగా నింగిలోకి ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ను పంపిన చైనా

ఎవరు: చైనా

ఎక్కడ: చైనా

ఎప్పుడు: ఆగస్ట్ 23

 “గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన హెచ్‌ఎస్‌బిసి ఇండియా :

గ్రీన్ డిపాజిట్ అనే  ప్రోగ్రామ్” ను హెచ్ఎస్బిసి ఇండియా ప్రారంభించింది. కార్పొరేట్ క్లయింట్ల కోసం ప్రత్యేకంగా “గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్” అనే ఒక ప్రోగ్రాం  ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం కింద, బ్యాంక్ డిపాజిట్లను హరిత కార్యక్రమాలు మరియు పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తుంది. దీనితో, హెచ్‌ఎస్‌బిసి ఇండియా ప్రారంభించిన డిపాజిట్ పథకం తన కార్పొరేట్ ఖాతాదారులకు స్థిరమైన మరియు ముందే అంగీకరించిన రాబడితో పాటు సాధారణ బ్యాంక్ డిపాజిట్ మాదిరిగానే రక్షణను అందిస్తుంది. “గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్” కింద  డిపాజిట్ ,పొదుపు  డిపాజిట్లతో పోలిస్తే అధిక ప్రయోజనాలతో టర్మ్ డిపాజిట్ రూపంలో వస్తుంది. తక్కువ కార్బన్, వాతావరణ స్థితిస్థాపకత మరియు స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు పరివర్తనను ప్రోత్సహించే అర్హతగల వ్యాపారాలకు మరియు ప్రాజెక్టులకు ఈ పథకం ఆర్థిక సహాయం చేస్తుంది

క్విక్ రివ్యు :

ఏమిటి: “గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన హెచ్‌ఎస్‌బిసి ఇండియా

ఎవరు: హెచ్‌ఎస్‌బిసి ఇండియా

ఎప్పుడు:ఆగస్ట్ 23

ఐసిసి హాల్ ఆఫ్ ఫేం లో చోటు దక్కించుకున్న ముగ్గురు క్రికెటర్లు :

దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాన్ కలిస్ ,పాకిస్తాన్ మాజీ ఆటగాడు జహీర్ అబ్బాస్ ,ఆస్ట్రేలియా మహిళల కెప్టెన్ లిసా స్తలేకర్ లకు “ఐసిసి హాల్ ఆఫ్ ఫేం” లో చోటు దక్కించుకున్నారు.ఆగస్ట్ 23 జరిగిన  వర్చువల్ కార్యక్రమంలో కలిస్ అబ్బాస్, స్ట లేకర్ లకు హాల్ ఆఫ్ ఫేం లో ఐసిసి స్థానం కల్పించింది.భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ,దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఐసిసి హాల్ ఆఫ్ ఫేం లో చోటు దక్కిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడు కలిస్ పాక్ తరపున అబ్బాస్ ఆరో ఆటగాడు  స్తలేకర్ 27 వ ఆస్ట్రేలియన్ ,తొమ్మిదో మహిళా క్రికెటర్ .

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐసిసి హాల్ ఆఫ్ ఫేం లో చోటు దక్కించుకున్న ముగ్గురు క్రికెటర్లు

ఎవరు: జాన్ కలిస్, జహీర్ అబ్బాస్, లిసా స్తలేకర్

ఎక్కడ:దుబాయ్

ఎప్పుడు: ఆగస్ట్ 23

వైఎస్సార్  సంపూర్ణ  పోషణ  పథకానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ౦ :

గర్బినులు,బాలింతలు ,పిల్లలు  పౌస్తికహరాన్ని  అందించేందుకు  ఉద్దేశించిన వై ఎస్సార్  సంపూర్ణ  పోషణ ,వైఎస్సార్  సంపూర్ణ  పోషణ ప్లస్ పథకాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  అద్యక్షతన  ఆగస్ట్ 19న సమవేశం అయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఈ పథకాలకు సెప్టెంబర్ 01వ తేదిన ప్రారంబించనున్నారు. ఇందులో బాగం గానే  వైఎస్సార్ ఆసరా పథకానికి,వై ఎస్సార్ భీమా పథకానికి కూడా రాష్ట్ర మంత్రి వర్గము ఆమోదం  తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: వైఎస్సార్  సంపూర్ణ  పోషణ  పథకానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ౦

ఎవరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ౦

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: ఆగస్ట్ 23

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *