
Daily Current Affairs in Telugu 03-08-2020
ఎస్బిఐ కార్డ్ ఎండి అండ్ సియివో గా బాద్యతలు చేపట్టిన అశ్వని తివారి :

దేశంలోనే రెండవ అతి పెద్ద క్రెడిట్ కార్డ్ ఇష్యుయర్ అయిన ఎస్బిఐ కార్డ్ ఎండి అండ్ సియివో గా అశ్విని తివారి గారు బాద్యతలు ఇటీవల స్వీకరించారు. జులై 31న తేదిన బాద్యతలు విరమించిన హర దయాల్ ప్రసాద్ గారి స్థానంలో అశ్విని తివారి గారు కొత్తగా బాద్యతలను చేపట్టారు.ఈయన కొత్త బాద్యతలు చేపట్టకముందు 2017 ఏప్రిల్ నుంచి న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎస్బిఐ యుఎస్ ఆపరేషన్స్ హెడ్ గా పనిచేసారు. ఎస్బిఐ (కాలిఫోర్నియా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేసిన అనుబవం ఆయనకు ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎస్బిఐ కార్డ్ ఎండి అండ్ సియివో గా బాద్యతలు చేపట్టిన అశ్వని తివారి
ఎవరు: అశ్వని తివారి
ఎప్పుడు: ఆగస్ట్ 04
హెచ్డిఎఫ్ సి బ్యాంక్ సియివో ,ఎండి నియామకానికి శశిదర్ జగదీషణ్ ఎంపిక కు ఆర్బిఐ ఆమోదం :

ఆదిత్య పూరివారసుడిగా హెచ్.డిఎఫ్.సి బ్యాంక్ పగ్గాలు శశిదర్ జగదీషణ్ గారు స్వీకరించనున్నారు..హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సియివో ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) గా శశిదర్ జగదీశన్ గారి పేరు ఖరారైంది. అక్టోబర్ 27 నుంచి మూడేళ్ళ పాటు ఆయన నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆరబీ ఐ) ఆమోద ముద్ర వేసింది. హెచ్.డిఎఫ్.సి బ్యాంక్ వెల్లడించింది.ఇది స్థాపించినప్పటినుంచి 25 ఏళ్లకు పైగా ఆదిత్య పూరి బ్యాంకుసేవలు అందిస్తూ వస్తున్నారు.అక్టోబర్ 26 న ఆయన పదవి కాలం ముగుస్తుంది. పూరి నేతృత్వంలో అత్యంత విలువైన భారతీయ ప్రైవేట్ బ్యాంకు గా హెచ్.డిఎఫ్.సి బ్యాంక్ నిలిచింది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో శశిధర్ యొక్క ప్రయాణం 1996లో ప్రారంబమైంది.1999 లో ఫైనాన్స్ విభాగానికి ఆయన వ్యాపార అధిపతి అయ్యారు. 2008 లో ముఖ్య ఆర్ధిక అధికారిగా నియమితులయ్యారు.అనతంరం చేంజ్ ఏజంట్ గ కూడా బాద్యతలు చేపట్టారు.ప్రస్తుతం అయన మానవ వనరులు న్యాయ,సెక్రటరియల్ ,పరిపాలన ,మౌలిక వసతులు కార్పోరేట్ కమ్యునికేషన్స్ ,కార్పోరేషన్ ,కార్పోరేట్ సామజిక విభగాలకు సారద్యం వహిస్తూనే స్ట్రాటజిక్ చేంజ్ ఏజెంట్ గా కూడా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హెచ్డిఎఫ్ సి బ్యాంక్ సియివో ,ఎండి నియామకానికి శశిదర్ జగదీషణ్ ఎంపిక కు ఆర్బిఐ ఆమోదం
ఎవరు: శశిదర్ జగదీషణ్
ఎప్పుడు: ఆగస్ట్ 04
దేశంలోనే ఉత్తమ వర్సిటీలో మొదటి స్థానంలో నిలిచిన డిల్లి విశ్వవిద్యాలయం :

ఇండియా టుడే మార్కెటింగ్ అండ్ డెవలప్ మెంట్ రీసర్చ్ అసోసియేషన్ (ఎండి ఆర్ఎ) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో దేశంలోనే అత్యుత్తమ యునివర్సిటీ లో డిల్లీలో లోని జవహర్ లాల్ నెహ్రు వర్శిటీ మొదటి స్థానం లో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ (హెచ్‌సి యు) ద్వితీయ స్థానంను సంపాదించింది. కీర్తి ,పాలన ,అకాడమి,రీసర్చ్ఎక్సలెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ లివిండ్ ఎక్స్ పిరియన్స్ పర్సనాలిటీ నాయకత్వ అబివృద్ది కెరియర్ పురోగతి ప్లేస్ మెంట్ వంటి అంశాలలో సాధించిన అబివృద్ది ఆదారంగా తాజాగా ప్రకటించిన ర్యాంకులను ప్రకటించారు.ఇందులో బాగంగా సర్వే కోసం 995 విశ్వవిద్యాలయాల యొక్క జాబితాను రూపొందించింది. దేశంలోని 30 నగరాలలో సర్వే ను నిర్వహించారు. పరిశోధకులు ,గణాంక వేత్తలు విశ్లేషకులు సర్వే బృందలతో కూడిన పెద్దల బృంద౦ ఈ ప్రాజెక్టు పై 2019 డిసెంబర్ నుంచి 2020 జులై వరకు వీటిపై పని చేసి ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే ఉత్తమ వర్సిటీలో మొదటి స్థానంలో నిలిచిన డిల్లి విశ్వవిద్యాలయం
ఎవరు: డిల్లి విశ్వవిద్యాలయం
ఎప్పుడు: ఆగష్ట్ 04
ఎక్కడ: న్యుడిల్లి
నాటక రంగ స్థల పితామహుడు ఇబ్రహీం అల్కజి కన్నుమూత :

నాటక రంగ స్థల పితామహుడు కళా తపస్వి ఇబ్రహీం అల్కజి (84) గుండె పోటుతో మరణించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి సుదీర్గాకాలం పాటు డైరెక్టర్ గా సేవలు అందించిన అల్కజి వివిధ తరాలకు చెందిన రంగ స్థల నటులను అయన తీర్చి దిద్దారు.ఈయన కొడుకు ఫైజల్ అల్కజి కూతురు అమర్ అల్లాన కూడా చాలా పేరున్న నాటక రంగ డైరెక్టర్ లు పేరు ఉంది.అల్కజి 1977 లో తన భార్య రోషన్ అల్కజి తో కలిసి డిల్లీలో ఆర్ట్ హెరిటేజ్ గ్యాలరిని ప్రారంబించారు. పద్మ భూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం ఈయనను సత్కరించింది.1962 లో అయన దర్శకత్వానికి గుర్తింపుగా అతడిని సంగీత్ నాటక అకాడమి అవార్డు వరించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: నాటక రంగ స్థల పితామహుడు ఇబ్రహీం అల్కజి కన్నుమూత
ఎవరు: ఇబ్రహీం అల్కజి
ఎప్పుడు: ఆగష్ట్ 04
ఎక్కడ: న్యుడిల్లి
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |