Daily Current Affairs in Telugu 05-07-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 05-07-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న  క్వింటన్ డికాక్ :

క్రికెట్ దక్షిణాఫ్రికా (సిఎస్ఎ)ఇచ్చే వార్షిక అవార్డుల్లో సఫారి జట్టు వన్డే ,టి20 జట్టు కెప్టెన్ క్వింటన్ డికాక్ రెండు ప్రతిస్తాత్మక అవార్డులను గెలుచుకున్నాడు.కరోన నేపద్యంలో ఆన్ లైన్ లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో పురుషుల విభాగంలో డికాక్ మహిళల కేటగిరిలో లారా వోల్వార్డ్ “క్రికెటర్  ఆఫ్ ది ఇయర్” అవార్డునుగెలుచుకున్నారు.తన ఎనిమిదేళ్ళ అంతర్జాతీయ కెరీర్లో  డికాక్ ఇప్పటి వరకు 47టెస్టుల్లో,121 వన్డే లో,44 టి20 మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ అవార్డును రెండో సారి గెలుచుకున్న డికాక్ (2017) జాక్వెస్ కలిస్ (2004,2011) మఖాయ ఎన్తిని (2005,2006) ,హషీం ఆమ్ల (2010,2013),ఎబి డివిలియర్స్ (2014,2015)కగిసో రబడ (2016,2018) ల సరసన చేరాడు. దీంతో పాటు 27 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ డికాక్ టెస్టు “క్రికెటర్ ఆఫ్ ది  ఇయర్”  పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. పేసర్ లుంగీ ఎన్గిది వన్డే ,టి20 “ప్లేయర్ ఆఫ్ ది ఇయర్” అవార్డులను గెలుచుకోగా డేవిడ్ మిల్లర్ “ఫేవరేట్ ప్లేయర్” గా నిలిచాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న  క్వింటన్ డికాక్

ఎవరు: క్వింటన్ డికాక్

ఎప్పుడు: జులై 05

స్పీడ్ చెస్ గ్రాండ్ ఫ్రీ  విజేత గా నిలిచినా వలెంటీ నా గునీనా :

అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆద్వర్యం లో జరిగిన మహిళల స్పీడ్ చెస్ గ్రాండ్ ఫ్రీ -2 ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ లో వలెంటీ నా గునీనా (రష్యా) విజేతగా నిలిచింది. జులై 04న జరిగిన  ఫైనల్లో గునీనా 7-5 పాయింట్లు తేడాతో అనా ఉషేనినా కాతరీన లగ్నో (రష్యా) 9.5-2.5తో సారసదత్ (ఇరాన్)పై గెలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: స్పీడ్ చెస్ గ్రాండ్ ఫ్రీ  విజేత గా నిలిచినా వలెంటీ నా గునీనా

ఎవరు: వలెంటీ నా గునీనా

ఎప్పుడు: జులై 05

భారత చెస్ 66వ గ్రాండ్ మాస్టర్ గా అవతరించిన ఆకాష్ :

భారత చెస్ లో మరో గ్రాండ్ మాస్టర్ (జిఎం) అవతరించాడు. తమిళనాడు కు చెందిన  23 ఏళ్ల జి. ఆకాష్ భారత్ తరపున 66 వ గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే)కౌన్సిల్ సమావేశం లో ఆకాష్ కు అధికారికంగా జిఎం హోదా ఖరారు చేశారు. 2012లో జాతీయ జూనియర్ చాంపియన్గా నిలిచిన ఆకాష్ 2014 లో ఇంజనీరింగ్ విద్య కోసం చెస్ నుంచి నాలుగేళ్ల పాటు విరామం తీసుకున్నాడు.2018 లో ఇంజనీరింగ్  పూర్తయ్యాక చెస్లో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం 2495 ఎ లో రేటింగ్ కలిగిన ఆకాష్ నాలుగు జిఎం నార్మ్ లను సంపాదించి గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత చెస్ 66వ గ్రాండ్ మాస్టర్ గా అవతరించిన ఆకాష్

ఎవరు: ఆకాష్

ఎక్కడ: తమిళనాడు

ఎప్పుడు: జులై 05

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిద్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసిన డిల్లి ప్రభుత్వం :

ప్రపచంలోనే అతి పెద్దదైన కోవిద్ కేర్ సెంటర్ ను డిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ జులై 05 ప్రారంబించాడు.దిల్లిలోని ఛాతర్పూర్  వద్ద ఏర్పాటు చేసిన ఈ కేర్ సెంటర్ లో 10వేల పడకలు ఉన్నాయి.ఇక్కడ అందుబాటులో ఉన్న పడకలు ఆక్సిజన్ సిలిందర్స్ వెంటి లెటర్స్ ఐసియు ను అనిల్ బైజాల్ గారు పరిశీలించారు.ఈ కేంద్రాన్ని ఆపరేషన్ కరోన వారియర్స్ పేరిట ఇండో టిబెటన్ బోర్డర్స్ పొలిసు(ఐటిబిపి) నిర్వహిస్తోంది. డిల్లి ప్రభుత్వం పరిపాలాన పరమైన సహకారం ను అందిస్తుంది.1700అడుగుల పొడవు ,700 అడుగుల వెడల్పు ఉన్నీ కేర్ సెంటర్ లో 200 ఎంక్లోజర్స్ ఉన్నాయి.ఒక్కో ఎంక్లోజర్స్ లో 50 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు.మొత్తం సెంటర్ లో 20పుట్ బాల్ ఆట స్థలాలను ఉంచవచ్చు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచంలోనే అతిపెద్ద కోవిద్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసిన డిల్లి ప్రభుత్వం

ఎవరు: డిల్లి ప్రభుత్వం

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: జులై 05

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *