Daily Current Affairs in Telugu 02-07-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 02-07-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

నార్వే దేశ భారత రాయబారిగా బాద్యతలు స్వీకరించిన బాల బాస్కర్ :

నార్వే దేశంలో భారత రాయబారిగా బి.బాల బాస్కర్ బాద్యతలు ఇటీవల స్వీకరించారు .పశ్చిమ ఆసియా దేశాల సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. 1993 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసు కు చెందిన అధికారి.ఈయన ఆంధ్రప్రదేశ్ లో ని నెల్లూర్ జిల్లా కు చెందినవారు .గతం లో హైదరాబాద్ లో ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిగా కూడా పని చేశారు. ఉస్మానియా యునివర్సిటీ నుంచి ఇండియన్ ఎనర్జీ సెక్యురిటి అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్  అనే అంశం పై ఈయన పిహెచ్ డి పొందారు. బాలబాస్కర్ పాలస్తీనా ,అమెరికా ,చైనా రాయబార కార్యాలయాల్లో కీలక బాద్యతలు నిర్వహించారు. లాక్ డౌన్  నేపద్యం లో విదేశాలలో చిక్కుకున్న భారతీయులకు వేని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ వందే భారత్ వ్యవహారాలను ఈయన పర్యవేక్షించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : నార్వే దేశ బారత రాయబారిగా బాద్యతలు స్వీకరించిన బాల బాస్కర్

ఎవరు: బాల బాస్కర్

ఎక్కడ: నార్వే

ఎప్పుడు: జులై 02

ప్రపంచ ఆన్ లైన్ క్యారం విజేతగా నిలిచిన శ్రీనివాస్  :

తెలుగు తేజం అయిన కే.శ్రీనివాస్ ప్రపంచ క్యారం ఆన్ లైన్ చాంపియన్ గా నిలిచాడు. ఆన్ లైన్ లో తొలిసారి గా నిర్వహించిన టోర్నీలో యు.కే  ,స్విట్జర్ లాండ్ ,కెనడా ,శ్రీలంక మరియు తదితర దేశాలు వారివారి దేశాలకు చెందిన 80 మంది ఆటగాళ్ళు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్లో రియాజ్ అక్బర్ పై గెలిచి  శ్రీనివాస్ కైవసం చేసుకున్నారు .మహిళల టైటిల్ కూడా భారత్ కే దక్కింది. నాగజ్యోతి తమిళనాడు రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఈ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ ఆన్ లైన్ క్యారం విజేతగా నిలిచిన శ్రీనివాస్ 

ఎవరు: శ్రీనివాస్

ఎక్కడ:  న్యుడిల్లి

ఎప్పుడు: జులై 02

ఐఐఎంసి డైరెక్టర్ జనరల్ గా సంజయ్ ద్వివేది నియామకం :

ప్రొఫెసర్ సంజయ్ ద్వివేది ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యునికేషన్  (ఐఐఎంసి) డైరెక్టర్ జనరల్ గా జూన్ 01న నియమించారు. ద్వివేది ప్రస్తుతం భోపాల్ లోని మఖాన్ లాల్ చతుర్వేది నేషనల్ యునివర్సిటీ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యునికేషన్ రిజిస్త్రార్ గా ఉన్నారు. మూడేళ్ళ కాలానికి ప్రత్యక్ష  నియామక ప్రతిపాదికన డిజి ,ఐఐఎంసి గా అయన నియామకానికి కేబినేట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఐఐఎంసి డైరెక్టర్ జనరల్ గా సంజయ్ ద్వివేది నియామకం

ఎవరు: సంజయ్ ద్వివేది

ఎప్పుడు: జులై 02

ఐరాస సంస్తలకు కొత్త రాయబారిగా భారత్ తరపున ఇంద్ర మణి పాండే నియమకం :

జేనివాలోని ఐక్యరాజ్య సమితి సంస్థలు మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలకు తదుపరి భారత రాయబారిగా ఇంద్ర మణి పాండే భారత ప్రభుత్వం నియమించింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఓ) అందువల్ల ఐక్యరాజ్యసమితి  మానవ హక్కుల మండలి యుఎన్ హెచ్ ఆర్సి తో సహా జెనివాలో ని యుఎన్ కు చెందిన 25 కి పైగా ముఖ్యమైన సంస్థలలో ఆయన భారతదేశానికి ప్రాతినిత్యం వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య సభలో 2020 లో డబ్ల్యు హెచ్ వో కు కట్టుబడి ఉన్న ఎగ్సిక్యుటివ్ చైర్ గా భారత్ ను నియమించారు. జెనివాలో ఈ ఐక్యరాజ్య సమితి సంస్థలకు మునుపటి రాయబారి గా రాజీవ్ కే.చందర్ తన మూడేళ్ళ పదవి కాలాన్ని పూర్తి చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఐరాస సంస్తలకు కొత్త రాయబారిగా భారత్ తరపున ఇంద్ర మణి పాండే నియమకం

ఎవరు: ఇంద్ర మణి పాండే

ఎప్పుడు: జులై 02

ఐసిసి చైర్మన్ పదవికి వీడ్కోలు పలికిన శశాంక్ మనోహర్:

అంతర్జతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐఐసి)తొలి స్వతంత్ర చైర్మన్ గా ఎన్నికైన మనోహర్ పదవి కాలం జులై 01 నాటికీ ముగిసింది. దీంతో ఈ బాద్యతలు నుంచి శశాంక్ వైదొలిగారు. కొత్త చైర్మన్ గా ఎన్నికయ్యేందుకు డిప్యుటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా (హాంకాంగ్) తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరిస్తారని  ఐసిసి ప్రకటించింది. మహారాష్ట్ర కు చెందిన 62 ఏళ్ల శశాంక్ మనోహర్  2008 నుంచి 2011 సంవత్సరం వరకు ,2015నుంచి 2016 వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)  అధ్యక్షునిగా పని చేశారు. ఐసిసిలో తొలి స్వతంత్ర చైర్మన్ గా 2015నవంబర్ లో రెండేళ్ళ కాలానికి శశాంక్ బాద్యతలు చేపట్టారు. 2017 లో మల్లి రెండేళ్ళ కాలానికి అయన ఎన్నికయ్యారు. ఐసిసి నిబందనల ప్రకారం ఇంకా రెండేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్న పొడగింపు కోరుకోవడం లేదని ఈ బాద్యతల నుంచి వైదొలిగారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఐసిసి చైర్మన్ పదవికి వీడ్కోలు పలికిన శశాంక్ మనోహర్

ఎవరు: శశాంక్ మనోహర్

ఎప్పుడు: జులై 01

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
https://manavidya.in/16981/

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *