
Daily Current Affairs in Telugu 19-07-2020
బియేల్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ ;

భారత గ్రాండ్ మాస్టర్ స్టార్ పెంటేల హరికృష్ణ (2890 ఎలో రేటింగ్) ఖాతాలో ప్రతిష్టాత్మక టైటిల్ చేరింది. బియల్ చెస్ టోర్నీలో హరికృష్ణ విజేతగా నిలిచాడు. ఏడు రౌండ్లకు గాను 5.5 పాయింట్ల హరికృష్ణ అగ్రస్థానంను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ‘హరి అజే యంగా నిలవడం విశేషం. కరోనా మహ మ్మారి తర్వాత జరుగుతున్న తొలి ముఖా ముఖి చెస్ టోర్నీ ఇదే. బియల్ చెస్ ఫేవ రెట్ గా బరిలో దిగిన హరి తొలి రౌండ్లో మైకెల్ ఆడమ్స్ (ఇంగ్లాండ్)తో డ్రా చేసుకు న్నాడు. రెండో రౌండ్లో అలెగ్జాండర్ దొంచెకొ (స్విట్జర్లాండ్), మూడో రౌండ్లో నోయెల్ స్టుడర్ (స్విట్జర్లాండ్) లో విజయాలు నమోదు చేశారు
క్విక్ రివ్యు :
ఏమిటి: బియేల్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ ;
ఎవరు: మాస్టర్ హరికృష్ణ
ఎక్కడ: చెన్నై
ఎప్పుడు: జులై 19
లద్దాక్ లో కేంద్ర కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన :

చైనాతో ఘర్షణల నేపథ్యంలో జూలై 17న లద్దాఖ్ లో సరిహద్దు ప్రాంతాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు.ఈ పర్యటన సందర్భంగా కుంగ్ లో ఆర్మీ ఐటీబీపీ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్ నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని, దేశం బలహీనమైంది కానేకాదని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ • బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే తో కలిసి లేహ్ పర్యటించిన మంత్రి పాంగాంగ్ సో సరస్సు తీరంలోని ఓ స్థావరంలో సైనికాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.లద్దాఖ్ ప్రాంతంలోని స్టార్ ప్రాంతంలో జూలై 17న జరిగిన మిలటరీ సైనిక విన్యాసాలను రక్షణ మంత్రి తిలకించారు. ఆర్మీ, వాయుసేనలకు సంబంధించిన ఆపాచీ, వీ5 యుద్ధ హెలికాప్టర్లు, రుద్ర, మిగ్-17 విమానాలతో పాటు ట్యాంకులు, పదాతిదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి
క్విక్ రివ్యు :
ఏమిటి: లద్దాక్ లో కేంద్ర కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన
ఎవరు: రాజ్ నాథ్ సింగ్
ఎక్కడ: లద్దాక్ లో
ఎప్పుడు: జులై 19
హంగేరి గ్రాండ్ ప్రి తో వరుసగా రెండో టైటిల్ ను గెలుచుకున్న లూయిస్ హమిల్టన్ :

ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ మెర్సిడెజ్ జోరు కొనసాగించాడు.. అతను ఈ సీజన్లో వరుసగా రెండో గ్రాండ్ పై టైటిల్ ను తాన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా స్టిరియన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్న ఈ బ్రిటన్ స్టార్ అదే జోరులో హంగేరియన్ టైటి లను కూడా సొంతం చేసుకున్నాడు. జులై 19 న జరిగిన తుది పోరులో హామిల్టన్ 1:38:124:73 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలి చారు. ఈ రేసులో వెరీ స్టీవెన్ (రెడ్ బుల్) బొటాస్ (మెర్సీడెజ్) తర్వాతి రెండు స్థానాలు సాధించిన మైకేల్ షుమాకర్ (91 టైటిళ్లు)కు ఉన్న రికార్డును హమిల్టన్ సమం చేశాడు.గతంలో ప్లేయర్ మైకేల్ షూమాకర్ ఫ్రెంచ్ గ్రాండ్ ఫ్రీ టైటిల్ ను గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హంగేరి గ్రాండ్ ప్రి తో వరుసగా రెండో టైటిల్ ను గెలుచుకున్న లూయిస్ హమిల్టన్
ఎవరు: లూయిస్ హమిల్టన్
ఎప్పుడు: జులై 19
ప్రముఖ హింది దర్శకుడు రజత్ ముఖర్జి కన్నుమూత :

ప్రముఖ హిందీ దర్శకుడు రజత ముఖర్జీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ దుతున్న ఆయన జైపూర్లోని తన విమానంలో జులై 19న తుది శ్వాస విడిచారు. ‘ప్యార్ తునే క్యా కియా, రోడ్, లవ్ ఇన్ నేపాల్ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వీటిలో ‘రోడ్ సినిమా రజత్ ముఖర్జీకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ హింది దర్శకుడు రజత్ ముఖర్జి కన్నుమూత
ఎవరు: రజత్ ముఖర్జి
ఎప్పుడు: జులై 19
ప్రముఖ గణిత శాస్త్రవేత్త ,పద్మభూషన్ గ్రహీత శేషాద్రి కన్నుమూత :

ఆల్జీబ్రా జామెట్రి లో నిష్ణాతుడుగా పేరు సంపాదించుకున్న మేథదిషియన్ ,పద్మబూషణ్ గ్రహీత సి.ఎస్ .శేషాద్రి (88) జులై 18న కన్నుమూశారు. ఆల్జీబ్రా,జామెట్రీ లో ఆయన అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. ఆ రంగంలో ఆయన చేసిన సేవలు నేటికీ గుర్తుగా నిలిచి ఉన్నాయి .బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కెరీర్ ప్రారంభించి ఆయన అనంతరం మేథమెటికల్ ఇన్స్టిట్యూట్ ని స్టాపించారు. 1998 రాయల్ సొసైటీ సభ్యుడిగా, 2010లో అమెరికా లోని నేషన్స్ కం సైన్సెస్ ఫారెన్ అసోసియేట్ గా ఎన్నికయ్యారు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని ప్రధాని మోదీ కొనియాడారు
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ గణిత శాస్త్రవేత్త ,పద్మభూషన్ గ్రహీత శేషాద్రి కన్నుమూత
ఎవరు: శేషాద్రి
ఎప్పుడు: జులై 19
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |