
Daily Current Affairs in Telugu 18-08-2020
అటల్ ర్యాంకుల్లో ఐఐటీఎంకు తొలి స్థానం :

కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన అటల్ ర్యాంకింగ్ అఫ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ (ఎఆర్ఐఐఏ) లో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్’ (ఐఐటీఎం) కు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. ఐఐటీ బాంబే రెండో స్థానంలో.. ఐ ఐ టీ డిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణాలోని 30 విద్యాసంస్థలకు కూడా ఇందులో స్థానం దక్కింది. జాతీయ ప్రాధాన్యమున్న విద్యసంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల విభాగంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) కు 10వ ర్యాంకు సాధించింది. ఈ విభాగంలోని 11-25 ర్యాంకుల బ్యాండ్ లో హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ నిట్ లు నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : అటల్ ర్యాంకుల్లో ఐఐటీఎంకు తొలి స్థానం
ఎవరు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్’ (ఐఐటీఎం)
ఎక్కడ : న్యూ డిల్లీ
ఎప్పుడు : ఆగస్టు 18న
జేసి బోస్ ఫెలోషిప్ కి ఆచార్య దయానంద ఎంపిక :

సైన్స్ లో అత్యుత్తమ పరిశోధనలు చేపట్టే శాస్త్రవేత్తలకు అందించే ప్రతిష్టాత్మక జేసి బోస్ జాతీయ ఫెలోషిప్ కి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) స్కూల్ ఆఫ్ లైఫ్ సెన్సెస్ డీన్ ప్రో.దయానంద సిద్దావత్తం ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖకు అనుబంధంగా నడిచే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధన మండలి కార్యదర్శి సందీప్ వర్మ మంగళవారం ఉత్తర్వులు జారిచేశారు. ఫెలోషిప్ కింద ఆయనకు నెలకు రూ.25 వేలు మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఏడాదికి రూ. 15 లక్షలు మంజూరు కానున్నాయి. ఈ మొత్తాన్ని ఐదేళ్ళ పాటు అందజేస్తారు. దయానందది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా. గతంలో అనంతపురం జిల్లాలోని ఎస్కే యునివర్సిటీలోనూ పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జేసి బోస్ ఫెలోషిప్ కి ఆచార్య దయానంద ఎంపిక
ఎవరు : ఆచార్య దయానంద
ఎక్కడ : హైదరాబాద్
ఎప్పుడు : ఆగస్టు 18న
రోహిత్, వినేష్, రాణి, మణిక, మరియప్పన్ లకి అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న మరియు సాత్విక్ కి అర్జున అవార్డ్ లు

1992 లో ఖేల్ రత్న అవార్డ్ ను ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 38 మంది ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఏడాదికి ఒకరికి లేదా ఇద్దరిని మాత్రమే ఈ అవార్డ్ కోసం ఎంపిక చేస్తారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత ముగ్గురికి, 2016 రియో ఒలింపిక్స్ తర్వాత అత్యధికంగా నలుగురికి ఖేల్ రత్న అవార్డ్ దక్కింది. ఈసారి 20 క్రీడంశాల్లో ఖేల్ రత్న కోసం 40 ప్రదిపాదనలు రాగా.. కమిటి ఐదుగురు పేర్లను ప్రకటించగా వారిలో క్రీడల రెజ్లింగ్ చాంప్ వినేష్ ఫోగాట్, మహిళల హాకీ కెప్టన్ రాణీ రాంపాల్, టీటీ కెరటం మింక బాత్రా,రియో పారాలింపిక్స్ లో హైజంప్ లో పసిడి గెలిచినా మరియప్పన్ తంగవేలు క్రీడల శాఖకు అందజేసిన జాబితాలో ఉన్నారు. స్టార్ షట్లర్ కిడంబి శ్రీకాంత్ తో పాటు .. ప్రపంచ అండర్-20 చాంపియన్ హిమ దాస్ కు నిరాశ తప్పలేదు. నాలుగేళ్ల కాలంలో క్రీడాకారుల ప్రదర్శనలు పరిగనణలోకి తీసుకుని ఖేల్ రత్న,అర్జున అవార్డు విజేతలను నిర్ణయిస్తారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకి మాజీ కెప్టన్ సర్దార్ సింగ్, మాజీ పారా అథ్లెట్ దీపా మలిక్ తదితరులు కమిటీలో సభ్యులు. కేంద్ర క్రీడల మంత్రి ఆమోదం లభించాక ఆగస్టు 29 న (జాతీయ క్రీడల దినోత్సవం) జరిగే కార్యక్రమంలో అవర్డ్లను అందజేస్తారు.
రాజేవ్ ఖేల్ రత్న : రోహిత్ శర్మ (క్రికెట్), వినేష్ ఫోగాట్ (రెజ్లింగ్), మింక బాత్రా (టీటీ), రాణీ రాంపాల్(హాకీ), తంగవేలు మరియప్పన్ (పారాలింపిక్స్)
అర్జున అవార్డ్: సత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్), ఇషాంత్ శర్మ (క్రికెట్), సాక్షి మాలిక్ (రెజ్లింగ్), ద్యుతిచంద్ (అథ్లెటిక్స్), దివ్య కర్కాన్ (రెజ్లింగ్), అతానుదాస్(ఆర్చరీ), దీపక్ హుడా (కబడ్డీ), దీపిక (హాకి), దివిజ్ శరణ్ (టెన్నిస్), మీరాబాయ్ (వెయిట్ లిఫ్టింగ్), ఆకాష్ డీప్ (హాకీ), లవ్లీనా (బాక్సింగ్), మనూ బకర్ (షూటింగ్), సౌరభ్ చౌదరి (షూటింగ్) మనీష్ (బాక్సింగ్), సందేశ్ (పుట్ బాల్), దత్తు బోకానల్ (రోయింగ్) రాహల్ అవారె (రెజ్లింగ్), దీప్తి శర్మ (క్రికెట్), శివ కేశవన్ (వింటర్ స్పోర్ట్స్), మాధురిక (టీటీ), మనిష నర్వాల్ (పారా షూటర్), సందీప్ (పారా అథ్లెట్), సుయాంష్ (పారా స్విమ్మర్), విశేష్ (బాస్కెట్ బాల్), అజయ్ (టెంట్ పెగ్గింగ్), అదితి అశోక్ (గోల్ఫ్), సారిక (ఖోఖో).
ఖేల్ రత్న ఆవార్డ్ లకి పతకం సర్టిఫికేట్ తో పాటు రూ. 7.5 లక్షలు బహుమతిగా లభిస్తాయి.. అర్జున అవార్డ్ పొందిన వాళ్లకి జ్ఞాపికతో పాటు రూ. 5 లక్షలు ఇస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఖేల్ రత్న మరియు అర్జున అవార్డ్ లకి ఎంపిక
ఎవరు : రోహిత్, వినేష్, రాణి, మణిక, మరియప్పన్ లకి అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న మరియు సాత్విక్ కి అర్జున అవార్డ్ లు
ఎక్కడ : న్యూ డిల్లీ
ఎప్పుడు : ఆగస్టు 18న
ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా రాజీనామా :

కేంద్ర ఎన్నికల కమిషన్ లో సీనియారిటి పరంగా రెండో స్థానంలో ఉన్న ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా మంగళవారం రాజీనామా చేసారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడిబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆయన వచ్చే నెలలో ఆ భాద్యతలు చేపట్టడానికి సిద్దమయ్యారు. దీంతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న సుశీల్ చంద్రకు సునీల్ ఆరోరా తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా భాద్యతలు చేపట్టే అవకాశం దక్కింది. గతంలో అశోక్ లవాసా కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2018 జనవరిలో ఎన్నికల కమీషనర్ గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా రాజీనామా
ఎవరు : అశోక్ లవాసా
ఎక్కడ : న్యూ డిల్లీ
ఎప్పుడు : ఆగస్టు 18న
టీ-హబ్ స్టార్టప్ యాక్సేలరేటర్ కి 10 కొరియా అంకురా సంస్థల ఎంపిక :

కొరియా ఎస్ఎంఈ లు, స్టార్టప్స్ ఏజెన్సీ (కోస్మి) తో కలిసి స్టార్టప్ యాక్సేలరేటర్ 2020 కు 10 ప్రారంభాస్థాయి దక్షిణకొరియా అంకురా సంస్థలను ఎంపిక చేసినట్లు టి-హబ్ వెల్లడించింది. భారత విపణిలో కొత్త వ్యాపార అవకాశాలు, మార్కెట్ పరిస్థితులను అర్ధం చేసుకోవడం, వినియోగదారులను చేరుకోవడం వంటి ప్రయోజనాలను ఈ అంకుర సంస్థలు పొందనున్నాయి. టి-హబ్, కోస్మిలకు చెందిన నిపుణులు మదింపు చేసిన తర్వాత ఈ అంకుర సంస్థలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన అంకుర సంస్థల్లో వన్ బ్యూటీ కొరియా, ఏ-వర్చూవల్, హానర్ ఫార్మ్, ల్యాబ్ఎస్డీ, లెట్స్ ఫార్మ్, బ్రెయిన్ కొల్లా, కోకోనట్ సిలో లే ఎయిర్ పర్ కో, తఘివే, కొరియన్ ఏవియేషన్ లైట్స్ ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : టీ-హబ్ స్టార్టప్ యాక్సేలరేటర్ కి 10 కొరియా అంకురా సంస్థల ఎంపిక
ఎవరు : టీ-హబ్ స్టార్టప్ యాక్సేలరేటర్
ఎక్కడ : హైదరాబాద్
ఎప్పుడు : ఆగస్టు 18న
కన్నడ రచయిత విఠల్ రావుకు సాహిత్య అకాడమి :

కన్నడ రచయిత డాక్టర్ విఠల్ రావు టి గైక్వాడ్ కు 2019 వ సంవత్సరానికి గాను కన్నడంలో సాహిత్య అకాడమీ అనువాద అవార్డ్ దక్కింది. ఈ మేరకు అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఆగస్ట్ 18న ఓ ప్రకటనలో తెలిపారు. మరాఠీలో శరణ కుమార్ లింబాలే రాసిన ‘దళిత్ సాహత్యంచే సౌందర్య శాస్త్ర’ను విఠల్ రావు కన్నడంలో ‘దళిత సాహిత్యాద సౌందర్య ప్రజ్ఞే’గా అనువదించారు. జ్యూరి సభ్యులు ఆర్.పూర్ణిమ, ఎస్.దివాకర్, అరవింద్ మలగట్టిల సిఫార్సుల మేరకు ఈ అవార్డ్ ను ప్రకటించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. అవార్డ్ గ్రహితకు రూ. 50 వేల నగదు తామ్ర పత్రం త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అందజేస్తారని వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కన్నడ రచయిత విఠల్ రావుకు సాహిత్య అకాడమి
ఎవరు : రచయిత విఠల్ రావు
ఎక్కడ : న్యూ డిల్లీ
ఎప్పుడు : ఆగస్టు 18న
విపత్తుల శాఖ ఈడీగా నాగరాజు నియామకం :

విపత్తుల నిర్వహణ శాఖ నిర్వాహక డైరెక్టర్(ఈడీ)గా డాక్టర్ సి.నాగరాజును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. కర్నూల్లో జిల్లా ప్రణాళికాదికారి (సీపీఓ) గా పనిచేస్తున్న ఆయనను ఏడాది కాలానికి ఈడీ గా నియమిస్తూ ప్రణాళిక శాఖ ఎక్స్అఫిషియో కార్యదర్శి విజయకుమార్ ఉత్తర్వులనిచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : విపత్తుల శాఖ ఈడీగా నాగరాజు
ఎవరు : నాగరాజు
ఎక్కడ : అమరావతి
ఎప్పుడు : ఆగస్టు 18న
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |