Daily Current Affairs in Telugu 31-08-2020

current affairs in telugu 2019 pdf download,

Daily Current Affairs in Telugu 31-08-2020

rrb ntpc online exams in telugu

https://manavidya.in/daily-current-affairs-in-telugu-30-08-2020/

rs aggarwal online video classes

సింగపూర్ పార్లమెంట్ లో తొలి ప్రతిపక్ష నేతగా భారతీయ మూలలున్న నేత ప్రీతం సింగ్ :

భారతీయ ములాలలున్న సింగపూర్ రాజకీయ నేత ప్రీతం సింగ్ (43)ప్రతిపక్ష హోదా పొంది ఒక సరికొత్త చరిత్ర లిఖించారు.ఆ దేశ పార్లమెంట్ ప్రస్థానంలోనే  తొలి ప్రతి పక్ష నేతగా నిలిచారు.ఈమేరకు ఆగస్ట్ 31 బాద్యతలు స్వీకరించారు.ప్రీతం ప్రతినిత్యం వహిస్తున్న వర్కర్స్ పార్టీ జులై 10న పార్లమెంట్ లోని 93స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 10స్థానాలకు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఆ దేశంలో ప్రతిపక్ష పార్టీకి ఇన్ని సీట్లు రావడం ఇదే ప్రథమం. దీంతో ప్రతిపక్ష నేత హోదాను పార్లమెంట్ కట్టబెట్టింది.సభలో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ పక్ష నేత ఇంద్రాణి రాజాహ్ ఈ మేరకు ప్రకటన చేశారు.ఈమె కూడా భారతీయ మూలలున్న నేతగా కావడం గమనార్హం

క్విక్ రివ్యు :

ఏమిటి : సింగపూర్ పార్లమెంట్ లో తొలి ప్రతిపక్ష నేతగా భారతీయ మూలలున్న నేత ప్రీతం సింగ్

ఎవరు: ప్రీతం సింగ్

ఎప్పుడు:ఆగస్ట్ 31

ఎక్కడ:  సింగపూర్

భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ మహిళల వాణిజ్య కేంద్రం కేరళలో ఏర్పాటు :

కేరళలో భారతదేశ౦లోనే మొట్టమొదటి అంతర్జాతీయ మహిళల వాణిజ్య కేంద్రాన్ని (ఐడబ్ల్యుటిసి) అంగమాలిలో ఏర్పాటు చేస్తుంది. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి) కు అనుగుణంగా కేరళ ఐడబ్ల్యుటిసిని ఏర్పాటు చేస్తుంది.ఐడబ్ల్యుటిసి మహిళా వ్యవస్థాపకతను వేగవంతం చేయడానికి మరియు లింగ సమానత్వాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి,ఏర్పాటు చేయడానికి లేదా విస్తరించడానికి మరియు వారి ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి ఇంటి నుండి మహిళలకు అవకాశాన్ని కూడా ఇది అందిస్తుంది. ఐడబ్ల్యుటిసి మహిళా పారిశ్రామికవేత్తలను అంతర్జాతీయ వాణిజ్యంలో పాల్గొనడానికి మరియు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వారి పోటీతత్వాన్ని పెంచుతుంది. అందువల్ల, దీనిద్వారా  మహిళలు ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు

క్విక్ రివ్యు:

ఏమిటి: భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ మహిళల వాణిజ్య కేంద్రం కేరళలో ఏర్పాటు

ఎవరు: కేరళ

ఎక్కడ: కేరళ

ఎప్పుడు:ఆగస్ట్ 31

హైదరబాద్ ఎఫ్సి కొత్త కోచ్ గా మాన్యుయెల్ మార్కెజ్ నియామకం :

స్పానిష్ పుట్ బాల్ల జట్టు ల లీగ జట్టు ఎఫ్సి  బార్సిలోనా కోసం తమ హెడ్ కోచ్ ఆల్బర్ట్ రోకా (స్పెయిన్) ను విడుదల చేసిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రాంచైజీ హైదరబాద్ ఎఫ్ సి జట్టు అతడి స్థానంలో స్పెయిన్ కే చెందిన మాన్యుయెల్ మార్కెజ్ ను నియమించింది.ఈ మేరకు ఆయనతో ఏడాది కాలానికి ఒప్పందం కుధుర్చుకుంటునట్లు  హైదరాబాద్జ ట్టు ఆగస్ట్ 31న ఒక ప్రకటనలో తెలిపింది.డిపెండర్ గా కెరీర్ మొదలుపెట్టిన మార్కెజ్  28ఏళ్ల వయసులో ఆటకు గుడ్ బై చెప్పి కోచ్ గా మారాడు. అనంతరం ల లీగ్ లోని లాస్ పాల్ మష్ తో పాటు క్రొయేషియా లోని పలు టాప్ పుట్ బాల్ క్లబ్ లకు కోచ్ గా కూడా అయన పని చేసారు .

క్విక్ రివ్యు:

ఏమిటి: హైదరబాద్ ఎఫ్సి కొత్త కోచ్ గా మాన్యుయెల్ మార్కెజ్ నియామకం

ఎవరు: మాన్యుయెల్ మార్కెజ్

ఎక్కడ: : హైదరబాద్

ఎప్పుడు:ఆగస్ట్ 31

 “మేజర్ ధ్యాన్ చంద్ విజయపథ్ యోజన” అనే పథకంను ప్రారంభించిన యుపి ప్రభుత్వం ;

మేజర్ ధ్యాన్ చంద్ విజయపత్ యోజన” అనే ఒక నూతన కార్యక్రమంను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 19 మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఉంటున్న  తమ ఇళ్లకు రోడ్డు మార్గాల అనుసంధానం పొందుతారు. ఈ పథకం వల్ల లబ్ధి పొందబోయే 19 మంది అంతర్జాతీయ ఆటగాళ్లలో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్, మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్, పియూష్ చావ్లా, మహ్మద్ కైఫ్  వంటి వారు కూడా  ఉన్నారు. లబ్ధిదారుల ప్రారంభ జాబితాలో 19 మంది ఆటగాళ్ళు ఉన్నారు మరియు రాబోయే భవిష్యత్తులో ఈ పథకానికి ఎక్కువ మంది ఆటగాళ్ళు చేర్చబడతారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: “మేజర్ ధ్యాన్ చంద్ విజయపథ్ యోజన” అనే పథకంను ప్రారంభించిన యుపి ప్రభుత్వం

ఎవరు: యుపి ప్రభుత్వం

ఎక్కడ: ఉత్తరప్రదేశ్

ఎప్పుడు: ఆగస్ట్ 31

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి  కన్నుమూత

రాజకీయ దురండురుడు  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముకర్జి (84) కన్నుమూసారు.అనారోగ్యంతో గత 21రోజులుగా డిల్లిలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రెఫరల్ వైద్య శాలలో చికిత్స  పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ గారు ఆగస్ట్ 31న  సాయంత్రం కన్నుమూసారు.మెదడు లో రక్తం గడ్డ కట్టడంతో అదే హాస్పిటల్ లో ఆగస్ట్ 10న ఆయనకు వైద్యులు క్లిష్టమైన శాస్త్ర చికిత్స చేసారు.అదే సమయంలో ఊపిరి తిత్త్తులు ఇన్ఫెక్షన్ తో పాటు కరోనా కూడా సోకడం తో అప్పటి నుంచి ప్రణబ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.ప్రణబ్ ముఖర్జీ గారు దాదాపు ఐదు దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులను ప్రణబ్ ముఖర్జీ అధిష్టించారు.బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశ రాజకీయ చిత్ర పటం పై చెరగని ముద్ర వేసిన నేతగా పేరు గాంచారు. ఎన్నో సంక్షోబాల నుంచి ఆయన కాంగ్రెస్ ను విజయవంతగా గట్టేక్కించిన  ట్రబుల్ షూటర్ గా అయన గుర్తుండి పోతారు. 2019లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత రత్న తో ఆయనను గౌరవించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి  కన్నుమూత

ఎవరు: ప్రణబ్ ముఖర్జి 

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: ఆగస్ట్ 31

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *