Daily Current Affairs in Telugu 13-08-2020

Daily Current Affairs in Telugu 13-08-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

సెయిల్ తదుపరి ఛైర్మన్‌గా సోమా మొండల్ ను ఎంపిక చేసిన  పిఇఎస్‌బి:

సోమా మొండల్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) తదుపరి ఛైర్మన్‌గా పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పిఇఎస్‌బి) ఎంపిక చేసింది. ప్రస్తుత ఛైర్మన్ గా  అనిల్ చౌదరి బాధ్యతలు స్వీకరించనున్నారు. మొండల్ 2018 సెప్టెంబరులో సెయిల్ డైరెక్టర్ (కమర్షియల్) గా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు, ఆమె భువనేశ్వర్ నాల్కో, డైరెక్టర్ (కమర్షియల్), నాల్కో యొక్క మొట్టమొదటి మహిళా  డైరెక్టర్ గా  నియమితులయి ఆమె చరిత్ర సృష్టించింది

క్విక్ రివ్యు:

ఏమిటి: సెయిల్ తదుపరి ఛైర్మన్‌గా సోమా మొండల్ ను ఎంపిక చేసిన  పిఇఎస్‌బి

ఎవరు: సోమా మొండల్

ఎప్పుడు: ఆగష్ట్ 13

ICRIER కు నూతన  ఛైర్మన్ గా నియమితులయిన ప్రమోద్ భాసిన్ :

ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) కు నూతన  ఛైర్మన్‌గా ప్రమోద్ భాసిన్  గారు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ICRIER లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్  వైస్ చైర్ గా ఉన్నారు. ఆరోగ్య కారణాల వల్ల పదవీవిరమణ చేసిన ఇషర్ జడ్జి అహ్లువాలియా గారి స్థానంలో ఆయన నియమితులవుతారు. ఇషర్ 15 సంవత్సరాలు ఈ హోదాలో  ఉన్నారు. ఆమె చైర్‌పర్సన్ ఎమెరిటస్‌గా కొనసాగుతుంది, ఈ స్థానం కౌన్సిల్‌కు ఆమె చేసిన అసాధారణమైన కృషిని గౌరవించటానికి ప్రత్యేకంగా సృష్టించబడింది

క్విక్ రివ్యు:

ఏమిటి: ICRIER కు నూతన ఛైర్మన్ గా నియమితులయిన ప్రమోద్ భాసిన్

ఎవరు: ప్రమోద్ భాసిన్

ఎప్పుడు: ఆగస్ట్ 13

నౌక దళ  డిజి గా దినేష్ కే  త్రిపాటి నియామకం :

 భారత నౌక దళ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాటి  గారిని కార్యకలాపాల (నావల్ ఆపరేషన్స్ ) డైరెక్టర్ జనరల్ గా ఆగష్ట్  13 న బాధ్యతలు స్వీకరించారు.ఈయన జనవరి 15 ,2018 నుంచి మార్చి 30, 2019 వరకు  తూర్పు నావికా దళానికి ఫ్లాగ్ ఆఫీసర్ గా కమాండర్ గా బాద్యతలు నిర్వహించనున్నారు. జూన్ 2019 లో వైస్  అడ్మిరల్ గా పదోన్నతిని సాధించారు. సమాచార ఎలక్ట్రానిక్ యుద్ద రీతిలో త్రిపాటి నిష్ణాతులని భారత  నౌకా దళం  ఒక ప్రకటనలో పేర్కొంది.

క్విక్ రివ్యు:

ఏమిటి: నౌక దళ  డిజి గా   దినేష్ కే  త్రిపాటి నియామకం

ఎవరు: దినేష్ కే  త్రిపాటి

ఎక్కడ:న్యుడిల్లి

ఎప్పుడు: ఆగస్ట్ 13

ఇజ్రాయెల్ యుఎఈ దేశాల మద్య తొలిసారి జరిగిన దౌత్య ఒప్పందం :

ఇజ్రాయెల్  దేశం తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) తొలిసారిగా ఆగష్ట్  13న తన దౌత్య సంబందాలను ఏర్పరుచుకుంది. ఇజ్రాయెల్ తో దౌత్యం నెరపిన తొలి గల్ప్ దేశంగా అరబ్ ప్రపంచంలోనే మూడో దేశంగా నిలిచింది. పాలస్తీనియన్లు తమ బవిష్యత్ రాజ్యంగా భావిస్తున్న  వెస్ట్ బ్యాంక్ లో  ని పలు  భూబాగాలను  స్వాదీనం చేసుకోకుండా ఇజ్రాయెల్ తో యుఎఈ ఒప్పందం చేసుకుంది. ఇది ఒక చారిత్రకమైన రోజు అని  ఇజ్రాయెల్ ప్రదాని అయిన బెంజిమేన్ నేతన్యహు పేర్కొన్నారు. ద్వైపాక్షిక  సంబదాలను ముందుకు తీసుకువెళ్ళే  విషయంలో సహకరించుకోవాలని ఉభయ దేశాలు అంగీకరించినట్లు  దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ జయిద్ అల్  నయాన్ ట్వీ ట్ చేసారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఇజ్రాయెల్ యుఎఈ దేశాల మద్య తొలిసారి జరిగిన దౌత్య ఒప్పందం

ఎవరు: ఇజ్రాయెల్ యుఎఈ

ఎప్పుడు: ఆగస్ట్ 13

వైఎస్సార్  చేయూత అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి :

మహిలలో 45-60 ఏళ్ల మద్య వయసున్న వారికి  సంబంధించి  ఎలాంటి పథకం లేదని తన పాద యాత్రలో గుర్తించి వారి కోసం ఇప్పుడు వైఎస్సార్  చేయూత అనే కార్యక్రమాన్ని ప్రారంబించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తెలిపారు. ఈ పథకం కింద మహిళలకు నేరుగా వారి ఖతాలకే నిధులు చేరతాయని ఖర్చు చేసుకునే స్వేచ్చ కూడా వారిదేనని తెలిపారు. ఈ పథకాన్ని  ఆగస్ట్ 12 న  తాడేపల్లి లో ని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ గారు ప్రారంబించారు. ఎస్సి,ఎస్టీ ,బిసి మైనారిటీ  వర్గాలకు చెందిన 23 లక్షల మంది పేద మహిళలకు ఏడాదికి రూ. 18750 చొప్పున నగదు జమ చేస్తామని సిఎం జగన్ గారు తెలిపారు. ఇందుకు రూ 4687 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. పి అండ్ జి  వంటి సంస్థలతో నూ  ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: వైఎస్సార్  చేయూత అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి

ఎవరు: ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: ఆగస్ట్ 13

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *