Daily Current Affairs in Telugu 30-08-2020

current affairs in telugu 2019 pdf download,

Daily Current Affairs in Telugu 30-08-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రదాని షింజో అబే రాజీనామా :

జపాన్ ప్రధాని షింజో అబే ఇటీవల ఆరోగ్యం సరిగా లేనందున 2020 ఆగస్టు 28 న ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 65 ఏళ్ల అతను ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు నాయకుడిగా 7 సంవత్సరాలు ఎనిమిది నెలలు కాలం పాటు ప్రదనిగా ఉంది రికార్డు సృష్టించాడు, జపాన్ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి అయ్యాడు. షింజో అబే 26 డిసెంబర్ 2012 నుండి జపాన్ ప్రధానిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు, అతను జూలై 2006 నుండి సెప్టెంబర్ 2007 మధ్య స్వల్ప కాలానికి ప్రధానిగా పనిచేశాడు, దేశంలో అతి పిన్న వయస్కుడిగా, 52 సంవత్సరాల వయస్సులో ప్రదాని పదవికి ఎన్నికయ్యాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని షింజో అబే రాజీనామా :

ఎవరు: షింజో అబే

ఎక్కడ: రష్యా

ఎప్పుడు:ఆగస్ట్ 30

తొలిసారి చెస్ ఒలింపియాడ్ స్వర్ణం ను గెలుచుకున్న భారత్ :

భారత చెస్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది.96సంవత్సరాల చరిత్ర కలిగిన చెస్ ఒలిపియాడ్ లో తొలిసారి స్వర్ణం గెలుచుకుంది.అయిదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తెలుగు తేజాలు హంపి హారిక,హరికృష్ణ సబ్యులుగా ఉన్న భారత్ రష్యా లతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది.గతంలోనే ఒక కాంస్య పతకం (2014) మాత్రమే సాధించిన భారత జట్టు ఈ సారి అవకాశాన్ని వదలలేదు.చక్కని విజయాలతో మొదటి సారి ఈ టోర్నీ ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్ ఆఖరి సమరంలో ఎత్తులకు పై ఎత్తులతో బలమైన రష్యాను దీటుగా ఎదుర్కొంది.కాని తొలిసారి ఆన్ లైన్ లో జరిగిన టోర్నీ వివాదాస్పద రీతిలో ముగిసింది. హోరాహోరిగా సాగిన ఈ పోరులోమొదట భారత్ ఓడినట్లు ప్రకటించారు.ఇంటర్నెట్ కనెక్షన్ పోయిన కారణంగా చివరిదైన రెండో రౌండ్లో ఇద్దరు భారత క్రీడాకారులు నిర్ణీత సమయంలో ఎత్తులు వేయలేకపోయారు అనివాళ్ళు పరిగణించడం తో రష్యా గెలిచింది.భారత జట్టు అప్పీల్ చేసిన తరువాత విచారణ జరిపిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య రెండు జట్లకు బంగారు పథకాలు ఇవ్వాలని నిర్ణయించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: తొలిసారి చెస్ ఒలింపియాడ్ స్వర్ణం ను గెలుచుకున్న భారత్

ఎవరు: భారత్-రష్యా

ఎప్పుడు: ఆగస్ట్ 30

బెల్జియం గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచినా లూయిస్ హమిల్టన్ :

ప్రపంచ చాంపియన్  లూయిస్ హమిల్టన్ బెల్జియం గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచాడు.ఆగస్ట్ 30 పోల్ పోసిషన్ నుంచి రేసు అరంబించిన అతడు చివరి వరకు ఆధిపత్యాన్నికొనసాగించాడు.హమిల్టన్ (మెర్సిడెస్) కెరీర్ లోఆయనకు దక్కిన ఇది 89 వ విజయం. మెర్సిడెస్ కే చెందిన  బొటాస్ రెండో స్థానంలో నిలిచాడు. రెడ్బుల్ డ్రైవర్ వేర్ స్టాఫెన్  మూడో స్థానంలో సాధించాడు. హమిల్టన్ కు ఈ సీజన్ లో ఏడు రేసులో ఇది అయిదో విజయం.షూ మాకర్  పేరిట ఉన్న అత్యధిక టైటిల్ ల రికార్డు (91)కు హమిల్టన్ రెండే విజయాల దూరంలో ఉన్నాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: బెల్జియం గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచినా లూయిస్ హమిల్టన్

ఎవరు: లూయిస్ హమిల్టన్

ఎప్పుడు:ఆగస్ట్ 30

వెస్టర్న్ అండ్ సదరన్ టోర్నీ పురుషుల సిగిల్స్ ఫైనల్ విజేతగా నిలిచిన నోవాక్ జకోవిచ్ :

ప్రతిస్థాత్మక యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్ కు ముందు ప్రపంచ నంబర్ వన్ నోవాక్ జకోవిచ్ కు మరొక విజయం దక్కింది.ఆగస్ట్ 30 న వెస్టర్న్ అండ్ సదరన్ టోర్నీ (సిన్సినాటి మాస్టర్స్) పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జకోవిచ్ 1-6,6-3,6-4 తో మిలోస్ రావ్ నిచ్ (కెనడా) పై గెలిచి చాంపియన్ గా నిలిచాడు.విజేత జకోవిచ్ కు 2,85,000 డాలర్ల ప్రైజ్ మని (రూ.2కోట్లు),1000 ర్యాంకింగ్ పాయింట్లు రన్నరప్ రావ్ నిచ్ కు 1,85,015 డాలర్ల ప్రైజ్ మని (రూ.కోటి 35లక్షలు ),600 ర్యాంకింగ్ పాయింట్లు లబించాయి.జకోవిచ్ కు ఇది కెరీర్ లో ఇది 35 వ మాస్టర్ సిరీస్ కావడం విశేషం. ఈ క్రమంలో అత్యధిక మాస్టర్ సిరీస్ టైటిల్ గెలిచిన ప్లేయర్ గా రాఫెల్ నాదల్ (35. టైటిల్స్ స్పెయిన్ )పేరిట ఉన్న రికార్డును జకోవిచ్ సమం చేసాడు.అంటే కాకుండా ఈ విజయంతో  అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ (ఏటిపి) సర్క్యూట్ లో జరిగే తొమ్మిది వేర్వేరు మాస్టర్స్ సిరీస్ టైటిల్ ను కనీసం రెండు సార్లు చొప్పున గెలిచి కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారుడిగా జకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: వెస్టర్న్ అండ్ సదరన్ టోర్నీ పురుషుల సిగిల్స్ ఫైనల్ విజేతగా నిలిచిన నోవాక్ జకోవిచ్

ఎవరు: నోవాక్ జకోవిచ్

ఎక్కడ:న్యూయార్క్

ఎప్పుడు:ఆగస్ట్ 30

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *