Daily Current Affairs in Telugu 09-08-2020

Daily Current Affairs in Telugu 09-08-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

2021 ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్:

: కోవిడ్ -19 కారణంగా వాయిదా వేసిన ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2020 2022 లో ఆస్ట్రేలియాలో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ధృవీకరించింది. ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2021 ను భారత్ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తుంది. కోవిడ్ -19 మహమ్మారి క్రికెట్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన కారణంగా న్యూజిలాండ్‌లో జరిగిన ఐసిసి ఉమెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ 2021 ను ఫిబ్రవరి-మార్చి 2022 వరకు వాయిదా వేయాలని ఐసిసి నిర్ణయించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2021 ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్

ఎవరు: భారత్

ఎక్కడ: భారత్

ఎప్పుడు: ఆగస్ట్ 09

నూతనంగా “ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ”  అనే కార్యక్రమం ను ప్రారంభించిన డిల్లీ ప్రభుత్వం

 ఢిల్లీ  ప్రభుత్వం నూతనంగా “ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ” అనే కార్యక్రమం ను ప్రారంభించింది, దీని కింద రిజిస్ట్రేషన్ ఫీజు, రహదారి పన్నును మాఫీ చేస్తుంది మరియు కొత్త కార్ల కోసం 1.5 లక్షల వరకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి మరియు దేశ రాజధానిలో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి వాటి ద్వారా వారికీ ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే సెంటర్స్ పథకం ‘ఫేమ్ ఇండియా ఫేజ్ -2’ ఉంది, దీని కింద కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వ పథకం సెంటర్ పథకానికి అదనంగా ఉంటుంది మరియు ప్రజలు రెండు పథకాల క్రింద ప్రయోజనాలను పొందవచ్చు.

క్విక్ రివ్యు :

ఏమిటి: నూతనంగా “ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ”  అనే కార్యక్రమం ను ప్రారంభించిన డిల్లీ ప్రభుత్వం

ఎవరు: డిల్లీ ప్రభుత్వం

ఎక్కడ: డిల్లీ

ఎప్పుడు: ఆగస్ట్ 09

మహిళల పలేర్మో ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన ఫియానో ఫెర్రో:

టెన్నిస్ పున ప్రారంభంగా భావించిన మహిళల పలేర్మో ఓపెన్ టైటిల్ ను ఫియానో ఫెర్రో ఫ్రాన్స్ సొంతం చేసుకుంది.ఆమె ఫైనల్లో నాలుగో సీడ్ అనెట్ కొంటావేట్ (ఎస్టొనియా) కు షాక్ ఇచ్చింది.ప్రపంచ ర్యాoకింగ్స్ లో 53వ స్థానం లో ఉన్న ఫెర్రో 6-2,7-5 తేడాతో 20 వ ర్యాంకు గా ఉన్న అనెట్ ను ఓడించింది.ఈ టోర్నీ లో తుది పోరుకు చేరే క్రమంలో 23 ఏళ్ళ ఫెర్రో కేవలం ఒక్క  నెట్ మాత్రమే కోల్పోవడం విశేషం.ఆమెకు ఇది రెండో డబ్ల్యుటీ ఎ టైటిల్ . దాదాపు ఐదు నెలల విరామం తర్వాత నిర్వహించిన తొలి అధికారిక టోర్నీ(పురుషుల్లో ,మహిళల్లో కలిపి) ని అన్ని జాగ్రత్తలు తీసుకుని పకడ్బందీగా ఈ టోర్నీ ని ముగించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: మహిళల పలేర్మో ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన ఫియానో ఫెర్రో

ఎవరు: ఫియానో ఫెర్రో

ఎప్పుడు: ఆగస్ట్ 09

ఐసిసి ప్యానెల్ లో చోటు దక్కించుకున్న భారత అంపైర్ ఆనంతపద్మనాథన్:

ఐసిసి అంతర్జాతీయ అంపైర్ ల ప్యానెల్ లో భారత అంపైర్ అనంత పద్మనాథన్ కు చోటు దక్కింది.అతడు ఇక వన్డే టీ20 లతో పాటు జూనియర్ ప్రపంచ కప్ లో భాద్యతలు నిర్వర్తించవచ్చు. భారత్ నుంచి శంశుద్దిన్ ,అనంత పద్మనాథన్ ఈయన కేరళ తరపున 105 ఫస్ట్ క్లాస్ 54 లిస్ట్ -ఏ మ్యాచ్ లు ఆడాడు.మరో భారత్ అంపైర్ నితిన్ మీనన్ ఇటీవల అంతర్జాతీయ ప్యానెల్ నుంచి ఎలైట్ ప్యానెల్ పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐసిసి ప్యానెల్ లో చోటు దక్కించుకున్న భారత అంపైర్ ఆనంతపద్మనాథన్

ఎవరు: ఆనంతపద్మనాథన్

ఎప్పుడు: ఆగస్ట్ 09

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *