Daily Current Affairs in Telugu 03-01-2020
అఖిల బారత్ వ్యవసాయ సంఘం కార్యదర్శిగా వెంకట్:
అఖిల బారత్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రదాన కార్యదర్శిగా తెలంగాణా కు చెందిన బి. వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కేరళలోని కన్నురులో జరిగిన అఖిల భారత మహాసభలో జనవరి 03 న నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునారు.సంఘం జాతీయ అద్యక్షుడు గా విజయ్ రాఘవన్ ఎన్నిక అయ్యారు..
క్విక్ రివ్యూ:
ఏమిటి: అఖిల బారత్ వ్యవసాయ సంఘం కార్యదర్శిగా వెంకట్:
ఎవరు: బి. వెంకట్
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు: జనవరి 03
తారా మండలం చుట్టూ హైడ్రోజెన్ వలయం :
సుదూర విశ్వంలో ఓ నక్షత్ర మండలం చుట్టూ విస్తరించ ఉన్న అతుచిక్కని హైడ్రోజెన్ వాయు వలయాన్ని పూనే లో ని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ (ఎన్సిఆర్ఎ) పరిశోధకులు తాజాగా గుర్తించారు.భూమికి 26కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏజిసి 203001 అనే బారీ నక్షత్ర మండలం ఉంది .దాని వ్యాసార్థం 3.8లక్షల కాంతి సంవత్సరాలు .మన పాలపుంతలో పోలిస్తే అది 4ఎట్లు పెద్దది .ఏజిసి 203001 చుట్టూ దానికంటే పెద్దదైన తటస్థ హైడ్రోజెన్ వలయం విస్తరించి ఉందని జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (జిఎంఆర్ టి ) సహాయంతో ఎన్సి ఆర్ ఏ పరిశోధకులు గుర్తించారు.21సెంటి మీటర్ల తరంగ దైర్గ్యమున్న రేడియో తరంగాలు ఈ వలయం నుంచి వెలువడుతున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తారా మండలం చుట్టూ హైడ్రోజెన్ వలయం
ఎప్పుడు: జనవరి 03
గగన్ యాన్ వ్యోమగాములకు ప్రత్యేల ఆహారం ;
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ లో దోహద పడేలా మైసూర్ లోని రక్షణ ఆహార పరిశోదన ప్రయోగ శాల (డీ.ఎఫ్.ఆర్.ఎల్)కీలక ఆవిష్కరణ చేపట్టింది.వ్యోమ గాముల కోసం ప్రత్యేక్ల ఆహారాన్ని సృష్టించింది సాదారణంగా సుదూర విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు.దీంతో అక్కడ ఆహారాన్ని తయారు చేయడం,తినడం కష్టమవుతుంది.డీ.ఎఫ్.ఆర్.ఎల్ శాత్ర వేత్త జగన్నాధ్ తెలిపారు. నీటిని తాగడంలో ను హ్చాల ఇబ్బందులు ఉంటాయని ,పాకేట్లు ను తెరిచిన వెంటనే ఆహారం అటు ,ఇటు పోయే అవకశం ఉందని చెప్పారు. ఈ ప్రతికులతలను అధిగమించేలా ఆహారాన్ని చెక్కు చెదరకుండా కలిపి ఉంచేందుకు తాము బైన్దర్స్ ను ఉపయోగించినట్లు వెల్లడించారు. దాదాపు ఏడాదిగా తాము ఈ పరిశోదనలు సాగినట్లు ఆయన తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గగన్ యాన్ వ్యోమగాములకు ప్రత్యేల ఆహారం
ఎవరు: ఇస్రో
ఎక్కడ:బెంగళూర్
ఎప్పుడు: జనవరి 03
టేబుల్ టెన్నిస్ నంబర్ వన్ గా మానవ్ టక్కర్:
భారత యువ టేబుల్ టెన్నిస్ ఆటగాడు మానవ్ టక్కర్ ప్రపంచ నంబర్ వన్ అయ్యాడు.తాజాగా ప్రపంచ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్ లో అండర్ -21వి భాగంలో మానవ్ అగ్ర స్థానంలో నిలిచాడు.గతేదాది డిసెంబర్ లో ఐటి టిఎఫ్ నార్త్ అమెరికన్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఈ 19ఏల్ల టిటి కెరటం హర్మీత్ దేశాయ్ ,సత్యన్,సౌమ్యజిత్ గోష్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడు నిలిచాడు.2018 లో అండర్ -18 లోను మానవ్ నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. సీనియర్లలో సత్యన్ 30,ఆచంట శరత్ కమల్ 33వ ర్యాంకు లో నిలవగా అమ్మాయిల్లో మానిక్ బాత్ర 61వ స్థానం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: టేబుల్ టెన్నిస్ నంబర్ వాన్ గా మానవ్ టక్కర్:
ఎవరు: మానవ్ టక్కర్:
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు: జనవరి 03
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
107 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంబం :
బెంగలూర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని జనవరి 3న 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రదాని నరేంద్ర మోది ప్రారంబించారు.జనవరి 7వరకు జరగనున్న ఈ కాంగ్రెస్స్ ను సైన్స్ ,టెక్నాలజీ గ్రామినాబివృద్ది “ని అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.ఈ సదస్సుకు కేంద్ర శాస్త్ర ,సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్దన్ .కర్నాటక సిఎం యాడ్యురప్ప యునివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ వైస్ చాన్సెలర్ డాక్టర్ ఎస్.రాజేంద్ర ప్రసాద్ ,సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ గా సెక్రటరీ కే.ఎస్.రంగప్ప వివిధ దేశాల ప్రతినిధులు శాస్త్రవేత్తలు విద్యార్థులు హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 107 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంబం :
ఎవరు: ప్రదాని నరేంద్ర మోది
ఎక్కడ:బెంగళూర్
ఎప్పుడు: జనవరి 03
ప్లేమింగో ఫెస్టివల్ -2020 ప్రారంబం:
విదేశీ విహంగాల విడిది కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూర్ జిల్లా నూల్లుర్ పేట సమీపంలో నేలపట్టు లో ప్లేమింగో ఫెస్టివల్ -2020 జనవరి 3న ప్రారమబమైనది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల ప్రారంబానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ,పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస రావు ,జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ,ఐటి శాఖ మాత్రి మేకపాటి గౌతం రెడ్డి హాజరయ్యారు.నుల్లుర్ పేట,దొరవారి సత్రం,తడ మండల కేంద్రాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్లేమింగో ఫెస్టివల్ -2020 ప్రారంబం:
ఎక్కడ: నెల్లూర్ జిల్లా నుల్లుర్ పేట
ఎప్పుడు: జనవరి 03