Daily Current Affairs in Telugu 27-11-2020
అంతర్జాతీయ స్థాయి అవార్డు ను గెలుచుకున్న అనంతపురం వాసి శివశంకర్ రెడ్డి :
అనంత పురం జిల్లా రైతుకు అంతర్జాతీయ స్థాయి అవార్డు దక్కంది. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన అబ్యుదయ రైతు మేకల శివశంకర్ రెడ్డికి ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఉద్యాన వన పంటల సాగులో నూతన ఒరవడితో ముందుకు సాగుతున్నఆయన ఇప్పటికే పలు అవార్డులు రివార్డులు దక్కించుకున్నారు. తాజాగా డిల్లి ప్రదాన కార్యాలయంగా పని చేసే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి (ఐసిఐడి)-2020 అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు ప్రకటించగా అందులో రైతు విభాగంలో శివశంకర్ రెడ్డి ఎంపిక కావడం విశేషం. ఈయనకు డ్రిప్ పద్దతిలో ఉద్యాన వన పంటల సాగు చేసి వాటికీ పూర్తిగా ఫర్టిగేషన్ పద్దతిలో పోషకాలు అందించి మంచి దిగుబడులు సాధించినందుకు గాను ఎంపిక చేసారు. మిగతా మూడు కేటగిరీలు టెక్నాలజీ అవార్డు మేనేజ్ మెంట్ అవార్డు యంగ్ ప్రొఫెషనల్ అవార్డులను ఇరాన్ దేశస్తులు దక్కించుకున్నారు. ఇండోనేషియ వేదికగా త్వరలోనే ప్రదానం చేయనున్నారు.కరోనా నేపద్యం లో వర్చువల్ పద్దతిలో ఎక్కడి నుంచి అవార్డులు ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: అంతర్జాతీయ స్థాయి అవార్డు ను గెలుచుకున్న అనంతపురం వాసి శివశంకర్ రెడ్డి
ఎవరు : శివశంకర్ రెడ్డి
ఎక్కడ: అనంత పురం జిల్లా
ఎప్పుడు: నవంబర్ 27
ఇరాన్ ప్రముఖ అణు శాస్త్రవేత్త మోసిన్ పక్రజాదే హత్య :
ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న శాస్త్రవేత్త మోసిన్ పక్రజాడే నవంబర్ 27న హత్యకు గురయ్యారు. ఈయన ఇరాన్లో ప్రముఖ శాస్త్రవేత్త ఇరాన్ అను పితామహుడు అని కూడా అంటారు. టెహ్రాన్ శివారులోని అబ్సాద్ గ్రామoలో ఫక్రజాదే కారు పై దాడి జరిగింది. ఇందులో ఆయన తీవ్రంగా గాయపడిఆస్పత్రిలో మరణించారని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. పక్రజాదే ఇరాన్ అమద్ అణ్వాయుధ కార్యక్రమానికి ఈయన నాయకత్వం వహించారు. ఇరాన్ రహస్య అణ్వాయుధ కార్యక్రమం వెనుక పక్రజాదే నాయకర్వం వహిస్తునారని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. 2018లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నేతన్యాహు కూడా పక్రజాదే పేరును ప్రస్తావించారు. ఈయన 1990 నుంచి ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంలో ఉన్నారు. ఈయనపై ఐదుగురు దుండగులు దాడి చేసి వారు ప్రయాణిస్తున్న కారుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ విధంగానే 2010నుంచి 2012 మద్య నలుగురు ఇరాన్ అణుశాస్త్ర వేత్త్తలు హత్యకు గురయ్యారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఇరాన్ ప్రముఖ అణు శాస్త్రవేత్త మోసిన్ పక్రజాదే హత్య
ఎవరు : మోసిన్ పక్రజాదే
ఎక్కడ: ఇరాన్
ఎప్పుడు: నవంబర్ 27
ఆంధ్రపదేశ్ లో నూతంగా ప్రారంబించిన జగనన్న తోడు పథకం :
చిరు వ్యాపారులకు వడ్డి లేని రుణాలను అందించడంఅనే ముఖ్య లక్ష్యం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్నతోడు అనే ఒక నూతన పథకం ను ప్రారంబించింది. నవంబర్ 25న తాడేపల్లి లోని క్యాంపు ఆఫీస్ నుంచే ఈ పథకాన్ని ప్రారంబించిన ఆ రాష్ట్ర సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు వారం పది రోజులలోనే చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ .10 వేల చొప్పున వడ్డీ లేని రుణంను జమచేయనున్నారు. ఈ పథకం లో బాగంగా తొలి విడత గా 10లక్షల మందికి రూ.1000 కోట్ల మేర లోన్లు ఇవ్వనున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆంధ్రపదేశ్ లో నూతంగా ప్రారంబించిన జగనన్న తోడు పథకం
ఎవరు : ఆంధ్రపదేశ్ లో
ఎక్కడ: ఆంధ్రపదేశ్
ప్రదానమంత్రి స్వనిధిలో మొదటి స్థానం లో నిలిచిన తెలంగాణ రాష్ట్రము :
ప్రధాన మంత్రి స్వనిది పథకం పరిధిలోకి వీధి వ్యాపారుల గుర్తింపు బ్యాంకు లోన్ల మంజూరు లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం లో ఉందని నవంబర్ 25న కేంద్ర పట్టణ అబివృద్ది గృహ నిర్మాణ శాఖా కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా గారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 5,88,099 మంది వీధి వ్యప్రులను గుర్తించిoది అని వారిలో 3,07,279 మంది లోన్లు మంజూరు చేసిందని వెల్లడించారు
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రదానమంత్రి స్వనిధిలో మొదటి స్థానం లో నిలిచిన తెలంగాణ రాష్ట్రము
ఎవరు : తెలంగాణ రాష్ట్రము
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |