
Daily Current Affairs in Telugu 25-11-2020
న్యూజిలాండ్ దేశంలో ఎంపి గా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతి వ్యక్తి గౌరవ శర్మ:

న్యూజిలాండ్ ఎన్నికల్లో ఎంపి గా గెలుపొందిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్ గౌరవ శర్మ ఆ దేశ పార్లెమెంట్ లో సంస్కృతం లో ప్రమాణ స్వీకారం చేసారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శర్మ లేబర్ పార్టీ తరపున ఎంపిగా గెలిచారు. శర్మ తొలుత న్యూజిలాండ్ స్థానిక భాష అయిన మోరి భాషలో తరువాత సంస్కృతం లో ప్రమాణ స్వీకారం చేసారని న్యూజిలాండ్ లో భారత్ హై కమిషనర్ ముఖ్తేష్ పర్దేషి నవంబర్ 25 నతెలిపారు. ఈ విధంగా చేయడం రెండు దేశాల సంస్కృత ఆయన గౌరవించారు అని అన్నారు. శర్మ ఆక్లాండ్ లో ఎంబిబిఎస్ చేసి,వాషింగ్ టన్ లో శర్మ ఎంబిఎ పూర్తి చేసారు. హింది కన్నా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా భారతీయ భాషలను అన్నింటిని గౌరవించి నట్లు అయిందని శర్మ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: న్యూజిలాండ్ దేశంలో ఎంపి గా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతి వ్యక్తి గౌరవ శర్మ
ఎవరు: గౌరవ శర్మ
ఎక్కడ: న్యూజిలాండ్
ఎప్పుడు: నవంబర్ 25
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత :

కాంగ్రెస్ మరో సీనియర్ నేతగా కరోనా వైరస్ కారణంగా కన్నుమూసారు.కాంగ్రెస్ పార్టీ వ్యుహకర్త సంక్షోభ పరిష్కర్త సోనియా గాంధీ రాజకీయ సలహాదారులను అహ్మద్ పటేల్ (71) కరోనా తో పోరాడుతూ నవంబర్ 25న కన్నుమూసారు. తెల్లవారుజామున 3.30 గంటలకు గురుగ్రాం లోని మేదాంత ఆస్పత్రిలో అయన మృతి చెందారు. అక్టోబర్ లో అహ్మద్ పటేల్ కు కోవిద్-19 సోకింది అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్తితిక్షినిస్తూ వచ్చింది. శరీరం లో వివిధ అవయవాల పని చేయడ౦ విపమలవ్వడంతో అహ్మద్ పటేల్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. గాంధీ కుటుంబం తర్వాత కాంగ్రెస్ లో అత్యంత బలమైన నేతగా అహ్మద్ పటేల్ మూడు సార్లు లోక్ సభ కు ,ఐదు సార్లు రాజ్యసభ కు ఎంపిక అయిన ఈ గుజరాత్ నాయకుడు. ప్రచారానికి దూరంగాఉండి తెరవెనుక రాజకీయం నడపడం లో సిద్దహస్తుడు నాలుగు దశాబ్దాల రాజకియ ప్రస్థానం లో కింగ్ మేకర్ గానే పేరు పొందారు. 26 ఏళ్ల వయసులో 1997 లోగుజరాత్ లోని భారోచ్ లోక్ సభ స్థానం నుంచి గెలుపు సాధించిన అహ్మద్ పటేల్ ప్రధాన కార్యదర్శిగా కోశాదికరిగా వివిధ పదవుల్లో నాలుగు దశాబ్దాల పైగా పార్టీ కి సేవలందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత
ఎవరు: అహ్మద్ పటేల్
ఎప్పుడు: నవంబర్ 25
పుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా కన్నుమూత :

పుట్ బాల్ దిగ్గజం డిగో మారడోన కన్నుమూసారు. అద్బుతమైన ఆటతో ప్రపంచ పుట్ బాల్ ఆటను సుసంపన్నం చేసిన ఈ మేటి ఆటగాడు నవంబర్ 25న గుండె పోటుతో మరణించారు. కళ్ళు చెదిరే విన్యాసాలతో 1986 లో అర్జంటినా కు ప్రపంచ కప్ ను అందించిన డిగో కొకైన్ వాడకం మరియు ఊబకాయం తో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెదడుకు శాస్త్ర చికిత్స తర్వాత రెండు వారాల కిందటే అతడు ఆస్పత్రి నుంచి దిశ్చార్జ్ అయ్యారు. 1986 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ తో క్వార్టర్ ఫైనల్ లో చేసిన హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ గుర్తుండి పోయే డిగో అర్మాండో మారడోనా 20ఏళ్లకు పైగా అభిమానులను అలరించాడు. పొట్ల గిత్తను తలపించే దూకుడు తో ప్రత్యర్డులతో ప్రపంచ వ్యాప్తంగా ఆరాద్యుడిగా మారాడు. సాకర్ ను పిచ్చిగా ప్రేమిస్తే అర్జంటినా లో అతన్ని గోల్డెన్ భాయ్ గా పిలుస్తారు.1997 లో డోపింగ్ కుంబకోణం అతడికి పెద్ద దెబ్బ .కొకైన్ కు అలవాటు పడ్డట్టు అపుడు అయన అంగీకరించాడు. 37వ ఏట 1997 లో రిటైర్ అయ్యేంత వరకు ఆ కుంబకోణం ఆయనను వెంటాడింది.ఈయనను 2001 లో పీలే తో పాటు అతన్ని పుట్ బాల్ చరిత్రలో మేటి ఆటగాడిగా ప్రకటించారు. డిగో 1996 ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటిన జట్టు కెప్టెన్ అర్జెంటిన తరపున అతడు 91మ్యాచ్ లలో 34గోల్స్ కొట్టాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా కన్నుమూత
ఎవరు: డిగో మారడోనా
ఎప్పుడు: నవంబర్ 25
భారత ఐటి రంగ పితామహుడు ఎఫ్.సి కోహ్లి కన్నుమూత :

భారత ఐటి పరిశ్రమ పితామహుడు గా పేరొందిన ఫఖీర్ చంద్ .సి కోహ్లి నవంబర్ 26 న కన్నుమూసారు. ఆయన వయస్సు 96 సంవత్సరాలు . టాటా కన్సల్టేన్సి సర్వీసెస్ (టిసిఎస్) కు వ్యవస్థాపక కార్యనిర్వాహక అధికారి (సియివో) గా ఆయన బాద్యతలు నిర్వహించారు. జేఆర్.డి టాటా ప్రమేయం తో 1969 లో కోహ్లి టాటా గ్రూప్ లో చేరారని సంస్థ పేర్కొంది. తొలుత మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ గా ఆయన అడుగుపెట్టారు. ఆ తర్వాత రెండు దశాబ్దాలు సాఫ్ట్ వేర్ డెవలప్ విభాగం లో పని చేసారు. అనంతరం సియివో గా బాద్యతలు చేపట్టి ఆయన 1996 లో ఆ పదవి నుంచి వైదొలిగారు అని తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత ఐటి రంగ పితామహుడు ఎఫ్.సి కోహ్లి కన్నుమూత
ఎవరు: ఎఫ్.సి కోహ్లి
ఎక్కడ: ముంబై
ఎప్పుడు: నవంబర్ 27
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |