Daily Current Affairs in Telugu 08-03-2021
స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన కోనేరు హంపి :
బి.బి.సి ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి తెలుగు చెస్ తేజం అయిన కోనేరు హంపి ఎంపిక అయింది. 40మంది తో కూడిన జ్యూరి బృందం గత నెలలో హంపి తో పాటు రెజ్లర్ వినేష్ ఫోగాట్, స్ప్రింటర్ ద్యుతి చంద్, షూటర్ మను బాకర్, భారత హాకి జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ లను ఈ పురస్కారానికి నామినేట్ చేసింది. క్రీడాబిమానులు ఓటింగ్ ఆదారంగా వీరిలోంచి హంపిని విజేతగా ఎంపిక చేసారు. 15ఏళ్ల లోనే పలు ఘనతలు సాధించిన ఈమె ప్రస్తుతం ర్యాపిడ్ విభాగం లో ఆమె ప్రపంచ చాంపియన్ గా ఉంది. గత ఏడాది తొలి బి.బిల్.సి ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ పురస్కారాన్ని కూడా తెలుగమ్మాయి అయిన పివి సింధు గెలుచుకుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి : స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన కోనేరు హంపి
ఎవరు : కోనేరు హంపి
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: మార్చి 08
ప్రపంచ టెన్నిస్ క్రీడలో అత్యధిక వారాలు నంబర్ వన్ స్థానం లో ఉండి రికార్డు సృష్టించిన నోవాక్ జకోవిచ్:
ప్రపంచ టెన్నిస్ లో నోవాక్ జకోవిచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్ లో అత్యధిక వారాలు నంబర్ వన్ స్థానం లో ఉండి ప్రపంచరిత్ర సృష్టించారు. పురుషుల సింగిల్స్ లో అత్యదిక వరాలు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిగా ఆల్ టైం రికార్డు నమోదు చేసారు. ఇప్పటివరకు అతను ర్యాంక్ లో అగ్రస్థానంలో 311 వరాలు గడిపాడు. గత వారమే ఫెదరర్ 310వారాల రికార్డును సమం చేసిన అతను తాజాగా చరిత్ర తిరగరాశాడు. కాగా జకోవిచ్ తన కెరీర్ లో అత్యుత్తమ సందర్బాలను బెల్ గ్రేడ్ లోని టౌన్ హాల్ లో ప్రదర్శించారు. ప్రస్తుతం 18 గ్రాండ్ స్లాం టైటిల్లతో ఫెదరర్,నాదల్ (చెరో 20) తర్వాతి స్థానంలో ఉన్న33 ఏళ్ల జకోవిచ్ వాళ్ళను చేరుకునే దిశగా సాగుతున్నాడు. నిరుడు ఫిబ్రవరి లో నాదల్ నుంచి తిరిగి నంబర్ వన్ ర్యాంకు ను లాగేసుకున్న ఆటను ఆరో సారి అగ్ర స్థానం లో ఏడాది ని ముగించి గతంలో ఈ ఫీట్ సాధించిన సంప్రాస్ రికార్డును సమం చేసాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి : ప్రపంచ టెన్నిస్ క్రీడలో అత్యధిక వారాలు నంబర్ వన్ స్థానం లో ఉండి రికార్డు సృష్టించిన నోవాక్ జకోవిచ్
ఎవరు : నోవాక్ జకోవిచ్
ఎప్పుడు: మార్చి 08
ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొదటి VP & COO నౌరీన్ హసన్ నియమకం:
ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చేత న్యూయార్క్ కు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొదటి వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఒఒ) గా భారత సంతతికి చెందిన నౌరీన్ హసన్ నియమితులయ్యారు. ఆమె తల్లిదండ్రులు భారతదేశం నుండి వలస వచ్చినవారు కావడం విశేషం. నౌరీన్ హసన్ వ్యూహం, డిజిటల్ పరివర్తన, సైబర్ సెక్యూరిటీ మరియు రెగ్యులేటరీ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం కలిగి ఆర్థిక సేవల పరిశ్రమలో 25 సంవత్సరాల అనుభవ౦ కలిగి ఉన్నారు. ఈ కొత్త పాత్రతో, హసన్ న్యూయార్క్ యొక్క రెండవ అత్యున్నత అధికారిగా మరియు ఒక ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ యొక్క ప్రత్యామ్నాయ ఓటింగ్ సభ్యురాలు గా కూడా ఉన్నారు. దీనికి ముందు, ఆమె మోర్గాన్ స్టాన్లీ వెల్త్ మేనేజ్‌మెంట్ (MSWM) కు చీఫ్ డిజిటల్ ఆఫీసర్ గా చేసారు. మార్చి 15, 2021 నుండి ఆమె నూతన బాద్యతలను చేపట్టనుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి : ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొదటి VP & COO నౌరీన్ హసన్ నియమకం
ఎవరు : నౌరీన్ హసన్
ఎక్కడ: న్యూయార్క్ లో
ఎప్పుడు: మార్చి 08
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8:
. ప్రతి సంవత్సరం ఈ మార్చి 8రోజును అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మహిళల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాల ప్రతీక జరుపుకుంటారు. ఈ రోజు మహిళల సమానత్వ౦ కోసం చేసే పోరాటం వేగవంతం చేసే చర్యకు పిలుపునిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది సాధించిన పురోగతిని ప్రతిబింబించే సమయం, మార్పు కోసం పిలుపునివ్వడం మరియు వారి దేశాలలో మరియు సమాజాల చరిత్రలో అసాధారణమైన పాత్ర పోషించిన సాధారణ మహిళల యొక్క ధైర్యం మరియు సంకల్ప చర్యలను చాటి చెప్పే సమయం.కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఈ సంవత్సరం థీమ్ “మహిళలనాయకత్వంలో COVID-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం”. COVID-19 మహమ్మారి నుండి మరింత సమానమైన భవిష్యత్తును మరియు పునరుద్ధరణను రూపొందించడంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు మరియు బాలికలు చేసిన అద్భుతమైన ప్రయత్నాలను గుర్తు చేస్తూ ఈ రోజును జరుపుకుంటున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8
ఎక్కడ: ప్రపంచవ్యాప్తంగా
ఎప్పుడు: మార్చి 08
ప్రఖ్యాత కన్నడ కవి లక్ష్మీనారాయణ భట్టా కన్నుమూత :
ప్రముఖ కన్నడ కవి, విమర్శకుడు, అనువాదకుడు ఎన్.ఎస్.లక్ష్మీనారాయణ భట్టా కన్నుమూశారు. కన్నడ సాహిత్య ప్రపంచంలో మంచి కవి విమర్శకుడిగా ప్రసిద్ది చెందిన ఆయన 1936 లో శివమోగ్గ జిల్లాలో జన్మించారు. ఆయన కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు మరియు కన్నడ రాజ్యోత్సవ అవార్డును అందుకున్నారు. అతని యొక్క ప్రసిద్ధ రచనలలో థాయే నిన్నా మడిలాలి వంటి ప్రత్యేక రచనలు ఉన్నాయి. విలియం షేక్స్పియర్ యొక్క 50 ప్రసిద్ధ రచనలు , టిఎస్ ఇలియట్ యొక్క కవిత్వం మరియు ప్రసిద్ధ కవి విలియం బట్లర్ యేట్స్ (చిన్నడా హక్కి) యొక్క రచనలు కన్నడలోకి అనువదించాడు. అతను అనేక ఇతర ప్రముఖ ఆంగ్ల సాహిత్య రచనలను కన్నడలోకి అనువదించాడు. కన్నడ సాహిత్య విభాగంలో పనిచేస్తూ బెంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు మరియు సాధువు-కవి శిశునాలా, షరీఫ్ వంటి రచనలు ప్రాచుర్యం పొందినందున ఆయనకు గౌరవం ఉంది.
క్విక్ రివ్యు:
ఏమిటి : ప్రఖ్యాత కన్నడ కవి లక్ష్మీనారాయణ భట్టా కన్నుమూత
ఎవరు : లక్ష్మీనారాయణ భట్టా
ఎక్కడ: కర్ణాటక
ఎప్పుడు: మార్చి 08
ఐటి ఎఫ్ పురుషుల టోర్నీ లో డబుల్స్ టైటిల్ గెలుచుకున్న భారత క్రీడాకారులు :
ఇంట నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటిఎఫ్ ) పురుషుల టోర్నీ డబుల్స్ విభాగం లో భారత్ కు చెందిన క్రీడాకారులు అయిన సాకేత్ మైనేని, యుకి బాంబ్రి ల ద్వయం విజేతగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర౦ లోని లక్నో లో మార్చి 6 వ తేదిన జరిగిన ఫైనల్లో సాకేత్,యుకి బాంబ్రి జంట 6-2,6-3 తో కాజా వినాయక్ శర్మ విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడి పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ భారత డేవిస్ కప్ జట్టు సబ్యుడు అయిన సాకేత్ మైనేని తన కెరీర్ లో ఈ టైటిల్ తో 20 డబుల్స్ టైటిల్ కావడం విశేషం. కాగా న్యుడిల్లి లో జరిగిన ఇంట నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటిఎఫ్ మహిళ ల జోడి సౌజన్య –ప్రార్థన తొంబారే రన్నరప్ గా నిలిచారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : ఐటి ఎఫ్ పురుషుల టోర్నీ లో డబుల్స్ టైటిల్ గెలుచుకున్న భారత క్రీడాకారులు :
ఎవరు : సాకేత్ మైనేని యుకి బాంబ్రి
ఎక్కడ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రా౦ లో లక్నో
ఎప్పుడు: మార్చి 08
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |