Daily Current Affairs in Telugu 07-03-2021
డబ్ల్యుబిసి యూత్ చాంపియాన్ గా నిలిచిన భారత ప్లేయర్ లాల్రిన్ సంగ :
ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ డబ్ల్యుబి.సి ఆద్వర్యంలో జరిగిన యూత్ వరల్డ్ చాంపియన్ షిప్ లో భారత బాక్సర్ లల్రిన్ సంగ త్లౌ విజేతగా నిలిచాడు. భారత బాక్సింగ్ కౌన్సిల్ ఐ.బి.సి సాంకేతిక అధికారుల సమక్షంలో నిర్వహించిన సూపర్ పేదర్ పెయిట్ పై ఫైనల్లో లల్రిన్ సంగ 80-72,86-72,80-72తో ఎరిక్ ఖ్వార్మ్ (ఘానా) పై నెగ్గారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డబ్ల్యుబిసి యూత్ చాంపియాన్ గా నిలిచిన భారత ప్లేయర్ లాల్రిన్ సంగ
ఎవరు: లాల్రిన్ సంగ
ఎప్పుడు :మార్చి 07
అతి చిన్న వయసులో బ్రిటన్ ఐరోపా గణిత ఒలింపియాడ్ జట్టుకు ఎంపికైన భారత సంతతి అన్యా గోయల్ :
బ్రిటన్ లోని భారత సంతతికి చెందిన 13ఏళ్ల అన్య గోయెల్ అరుదైన ఘనత సాధించింది. ఏప్రిల్ లో జార్జియాలో జరిగే ఐరోపా మహిళ గణిత ఒలింపియాడ్ లో బ్రిటన్ తరపున పాల్గొనే నలుగురు సభ్యుల బృందంలో స్థానం సంపాదించింది. ఆ రికార్డును ఆన్య అధిగమించింది. ఐరోపా ఒలింపియాడ్ జట్టులో స్థానం సంపాదించాలంటే బ్రిటన్ మ్యాథమాటిక్స్ ట్రస్ట్ నిర్వహించే అనేక పరీక్షలో విజేతగా నిలవాలి. ఏటా ఆరు లక్షల మంది రాసే ఈ పరీక్షలలో అన్య టాప్-4 లో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అతి చిన్న వయసులో బ్రిటన్ ఐరోపా గణిత ఒలింపియాడ్ జట్టుకు ఎంపికైన భారత సంతతి అన్యా గోయల్
ఎవరు: భారత సంతతి అన్యా గోయల్
ఎక్కడ: బ్రిటన్
ఎప్పుడు : మర్చి 07
భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ దక్షిణాది చైర్మన్ గా సికె రంగనాధన్ నియమకం :
భారత పరిశ్రమల సమఖ్య సి.ఐ.ఐ దక్షిణాది చైర్మన్ గా సికె.రంగనాథన్ గారు నియమితులయ్యారు. 2021-22గాను నూతన కార్యవర్గాన్ని సి.ఐ.ఐ ప్రకటించింది. కెవిన్ కేట్ సిఎం.డి గా విధులు నిర్వహిస్తున్న రంగనాథన్ గడిచిన ఆర్ధిక సంవత్సరంలో సి.ఐ.ఐ డిప్యుటీ చైర్మన్ గా విధులు నిర్వహించారు. భారత బయోటెక్ కొఫౌండర్ సుచిత్రఎల్లా సి.ఐ.ఐ డిప్యుటీ చైర్మన్ గా ఎంపిక అయ్యారు. సి.ఐ.ఐ కీలక సబ్యులుగా కొనసాగుతున్న సుచిత్ర 2012-13 లో సి.ఐఐ ఏపి చైర్ పర్సన్ గా విధులు నిర్వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ దక్షిణాది చైర్మన్ గా సికె రంగనాధన్ నియమకం
ఎవరు: సికె రంగనాధన్
ఎప్పుడు : మర్చి 07
ప్రపంచం లోనే మొదటి సారిగా ట్రాన్స్ జెండర్ డెస్క్ ని ప్రారంబించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం :
ప్రపంచంలోనే మొదటి సారిగా ట్రాన్స్ జెండర్ డెస్క్ ని సైబరాబాద్ పోలిస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక రోజు అని తెలుపుతూ ప్రపంచంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్ డెస్క్ ను తీసుకువచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమం దేశంలో కమ్యునిటీ పట్ల మార్పునకు నాంది కాబోతుందని తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి 150 మందికి పైగా ట్రాన్స్‌పర్సన్‌లతో సంభాషిస్తూ, సైబరాబాద్ కమిషనర్ విసి సిజ్జనార్ మాట్లాడుతూ హైదరాబాద్ లింగమార్పిడి సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడం మరియు దాని పరిష్కారాలను అన్వేషించడం ఈ ఇంటర్‌ఫేస్ లక్ష్యంగా ఉంది
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచం లోనే మొదటి సారిగా ట్రాన్స్ జెండర్ డెస్క్ ని ప్రారంబించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: తెలంగాణ రాష్ట్ర౦
ఎప్పుడు :మర్చి 07
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |