Daily Current Affairs in Telugu 01 October – 2022
మానవ పరిణామ క్రమంపై చేసిన పరిశోదనకు గాను నోబెల్ అవార్డు పొందిన స్వాంటే ఫాబో :
మానవ పరిణామ క్రమంపై స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త స్వాంటె పాబో(67) చేసిన పరిశోధనకు వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. పాబో చేసిన పరిశోధనలతో మానవ రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాబో తండ్రి సును బెర్జ్మ్ 1982లో వైద్యరంగంలో నోబెల్ పురస్కారాన్ని పొందారు. తండ్రి, కుమారులకు ఒకే రంగంలో ఈ అవార్డులు దక్కడం విశేషం. తండ్రి కుమారుడు కుమార్తె నోబెల్ను సాధించడం ఇది ఎనిమిదోసారి.
క్విక్ రివ్యు:
ఏమిటి : మానవ పరిణామ క్రమంపై చేసిన పరిశోదనకు గాను నోబెల్ అవార్డు పొందిన స్వాంటే ఫాబో
ఎవరు : స్వాంటే ఫాబో
ఎప్పుడు : అక్టోబర్ 1
లైట్ కంబాట్ వెహికల్ ప్రచండ ను వాయు సేనలోకి ప్రవేశ పెట్టిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ :
రాజస్థాన్ లోని జోద్ పూర్లో జరిగిన వేడుకలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు, త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి ఈ హెలికాప్టర్లను లాంచనంగా వాయు. సేనలో ప్రవేశపెట్టారు. ఈ లోహవిహంగానికి ‘ప్రచండ్ అని రాజ్ నాథ్ సింగ్ పేరు పెట్టారు. ఇందులో ఆయన గగనవిహారం కూడా చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ పోరాట హెలికాప్టర్లలో ఒకటని ఆయన పేర్కొన్నారు. ఇది శత్రువుపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదని తెలిపారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో భారత వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భద్రతకు తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లకు 10 ఫిరంగులతో వందన సమర్పణ చేశాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి : లైట్ కంబాట్ వెహికల్ ప్రచండ ను వాయు సేనలోకి ప్రవేశ పెట్టిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్
ఎవరు : కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్
ఎక్కడ : రాజస్థాన్
ఎప్పుడు : అక్టోబర్ 1
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులైన సుజోయ్ లాల్ తాసన్ :
సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులు సుజోయ్ లాల్ థాసన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు.సుజోయ్ లాల్ థా సేన్ మధ్యప్రదేశ్ కేడర్ కుచెందిన 1988 బ్యాచ్ అధికారి మరియు ప్రస్తుతం సరిహద్దు రక్షణ దళం సశాస్త్ర సీమా బల్ (SSB) డైరెక్టర్ జనరల్ (DG)గా పని చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి కుల్దీప్ సింగ్ (1986 బ్యాచ్) పదవీ విరమణ చేయడంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) DG పోస్ట్ శుక్రవారం ఖాళీ
క్విక్ రివ్యు:
ఏమిటి : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులైన సుజోయ్ లాల్ తాసన్
ఎవరు : సుజోయ్ లాల్ తాసన్
ఎప్పుడు : అక్టోబర్ 1
ఇంటెలిజెన్స్ బ్యూరోలో డైరెక్టర్ జనరల్ గా నియమితులైన అనీష్ దయాళ్ :
ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మణిపూర్ కేడర్ కు చెందిన 1988 బ్యాచ్ అధికారి అనిష్ దయాల్ సింగ్, ఐటీబీపీ డీజీగా నియమితులయ్యారు.ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ( ITBP ) అనేది చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్ తో సరిహద్దుకోసం భారతదేశం యొక్క ప్రాథమిక సరిహద్దు గస్తీ సంస్థ. 1962 నాటి చైనా-ఇండియన్ యుద్ధం త1962లో సాపించబడిన ఏడు కేంద్ర సాయుద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) అనేది చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్ తో సరిహద్దుకోసం భారతదేశం యొక్క ప్రాథమిక సరిహద్దు గస్తీ సంస్థ . 1962 నాటి చైనా-ఇండియన్ యుద్ధం తర్వాత 1962లో స్థాపించబడిన ఏడు కేంద్ర సాయుధ … పోలీసు బలగాలలో ఇది ఒకటి.
క్విక్ రివ్యు:
ఏమిటి : ఇంటెలిజెన్స్ బ్యూరోలో డైరెక్టర్ జనరల్ గా నియమితులైన అనీష్ దయాళ్
ఎవరు : అనీష్ దయాళ్
ఎప్పుడు : అక్టోబర్ 1
“ఆపరేషన్ గరుడ” ను ప్రారంభించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ :
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అక్రమ మాదకద్రవ్యాల నెట్ వర్క్ కు వ్యతిరేకంగా బహుళ దశల “ఆపరేషన్ గరుడ” ను ప్రారంభించింది, 127 కొత్త కేసులు నమోదు చేసింది, 175 మందిని అరెస్టు చేసింది మరియు భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై క్రిమినల్ ఇంటెలిజెన్స్ యొక్క వేగవంతమైన మార్పిడి మరియు ఇంటర్ పోల్ద్వరా అంతర్జాతీయ అధికార పరిధిలో సమన్వయంతో కూడిన చట్టాన్ని అమలు చేయడం ద్వారా అంతర్జాతీయ అనుసంధానాలతో డ్రగ్ నెట్ వర్క్ లనుతగ్గించడం మరియు విచ్ఛిన్నం చేయడం ఈ ఆపరేషన్ లక్ష్యం
క్విక్ రివ్యు:
ఏమిటి : ఆపరేషన్ గరుడ” ను ప్రారంభించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
ఎవరు : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
ఎప్పుడు : అక్టోబర్ 1
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |