
Daily Current Affairs in Telugu 21-03-2022
ఐక్యరాజ్య సమితి ఏర్పాటుచేసిన, ఉన్నతస్థాయి సలహామండలికి ఎంపికైన భారతీయ మహిళ :

భారతీయ ఆర్థికవేత్త ‘జయతీ ఘోష్ కు అరుదైన గౌరవం దక్కింది. సమర్థవంతమైన బహుపాక్షికతపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటుచేసిన, ఉన్నతస్థాయి సలహామండలికి ఆమెను ఎంపికచేసినట్టు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. లిబియా మాజీ అధ్యక్షుడు, నోబెల్ గ్రహీత ‘ఎల్లెన్ జాన్సన్’ సర్టిఫ్, స్వీడన్ మాజీ ప్రధాని స్టీఫన్ లోఫ్వెన్ సహా మొత్తం 12 మంది అంతర్జాతీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు ఈ సలహామండలిలో ఉన్నారు. ప్రపంచం ఆందోళన చెందుతున్న కీలక సమస్యలను పాలనాపరంగా ఎలా పరిష్కరించాలో వీరు పరిశోధించి 2023లో నివేదిక ఇస్తారు. కాగా జయతీ ఘోష్ ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్ అమైర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆర్థిక, సామాజిక వ్యవహారాలపై ఐరాస ఏర్పాటుచేసిన మరో ఉన్నతస్థాయి సలహ మండలిలోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐక్యరాజ్య సమితి ఏర్పాటుచేసిన, ఉన్నతస్థాయి సలహామండలికి ఎంపికైన భారతీయ మహిళ
ఎవరు: ‘జయతీ ఘోష్
ఎప్పుడు : మార్చ్ 21
ఐడబ్ల్యూఎన్ యొక్క దక్షిణ ప్రాంత చైర్మన్ గా శోభా దీక్షిత్ నియామకం :

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అనుబంధ సంస్థ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ (ఐడబ్ల్యూఎన్) దక్షిణ ప్రాంత చైర్మన్ గా ఆల్స్టా ఇండియా డైరెక్టర్ శోభా దీక్షిత్ బాధ్యతలు స్వీకరించారు. 2022-23 సంవ త్సరానికి ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో తెలంగాణ ఐడబ్లూ ఎన్ కు చైర్మన్ గా రెండేళ్లపాటు ఆమె పనిచేశారు. దక్షిణ ప్రాంత డిప్యూటీ చైర్మన్ గా విశాఖపట్నంలోని ఇండియా బీపీఓ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ముక్కవిల్లి ఎంపికయ్యారు. గతంలో ఐడబ్ల్యూ ఎన్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి చైర్మన్ గా కూడా ఆమె వ్యవహరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐడబ్ల్యూఎన్ యొక్క దక్షిణ ప్రాంత చైర్మన్ గా శోభా దీక్షిత్ నియామకం :
ఎవరు: శోభా దీక్షిత్
ఎప్పుడు : మార్చ్ 21
ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన పుష్కర్ సింగ్ దామి :

పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ రాష్ట్ర౦ యొక్క ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఉత్తరాఖండ్ శాసనసభా పక్ష నేతగా పుష్కర్ సింగ్ ధామిని ఎన్నుకున్నట్లు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తెలిపారు ఉత్తరాఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు పరిశీలకులుగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను బీజేపీ నియమించింది. ముఖ్యంగా, ఇటీవల ముగిసిన ఉత్తరాఖండ్ ఎన్నికల 2022 కోసం బిజెపి విజయవంతమైన ప్రచారానికి నాయకత్వం వహించిన ధామి, ఖతామీ అసెంబ్లీ స్థానం నుండి ఓడిపోయారు. కాని 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ 47 స్థానాలు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది,
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన పుష్కర్ సింగ్ దామి :
ఎవరు: పుష్కర్ సింగ్ దామి
ఎక్కడ: ఉత్తరాఖండ్
ఎప్పుడు : మార్చ్ 21
స్పోర్ట్స్ ఐకాన్ అవార్డ్ కు ఎంపిక ఐన భారత క్రికెటర్ సురేష్ రైనా :

టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు సురేష్ రైనాను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ‘స్పోర్ట్స్ ఐకాన్’ అవార్డుకు రైనా ఎంపికయ్యాడు.ఈ అవార్డుకు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, జమైకా స్ప్రింటర్ పోవెల్, డచ్ ఫుట్బాల్ ఆటగాడు ఎడ్గర్ డెవిడ్స్ సహా 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీ పడ్డారు. ఈ అవార్డును బంగ్లాదేశ్ క్రీడామంత్రి జహీర్ హసన్ రసెల్ రైనాకు అవార్డును అందజేశారు.ఈ కార్యక్రమంలో సౌదీ,మాల్దీవుల క్రీడా మంత్రులు పాల్గొన్నారు. ఐపీఎలో చైన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగుసార్లు కప్పు గెలవడంలో సురేశ్ రేవా కీలక పాత్ర పోపించారు. టి20లో 8వేల పరుగులు సాధించిన క్రీడాకారుడిగా ఇతను నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్పోర్ట్స్ ఐకాన్ అవార్డ్ కు ఎంపిక ఐన భారత క్రికెటర్ సురేష్ రైనా
ఎవరు: సురేష్ రైనా
ఎప్పుడు : మార్చ్ 21
ఇండియన్వెల్స్ టోర్నీ విజేతగా నిలిచిన అమెరికన్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ :

ఏటీపీ మాస్టర్స్ 100 టోర్నీ ఇండియన్వెల్స్ టోర్నీలో అమెరికా దేశానికి చెందిన యువ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ విజేతగా నిలిచాడు. మార్చ్ 21న 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అతను 6-3, 7-6(7/5)తో స్పెయిన్ కి చెందిన దిగ్గజ అతగాడు రాఫెల్ నాదల్ పైన సంచలన విజయం సాధించాడు. 2001 (ఆండ్రీ ఆగస్సీ) తర్వాత సొంతగడ్డపై ఈ టైటిల్ గెలిచిన తొలి అమెరికా దేశానికి చెందిన ఆటగాడిగా ఫ్రిట్జ్ నిలవ గా 2022లో 20 వరుస విజయాల నాదల్ జోరుకు బ్రేక్ పడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్వెల్స్ టోర్నీ విజేతగా నిలిచిన అమెరికన్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్
ఎవరు: రేలర్ ఫ్రిట్జ్
ఎప్పుడు : మార్చ్ 21
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |