
Daily Current Affairs in Telugu 09&10-April-2022
ఆస్ట్రేలియా గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచిన చార్లెస్ లేక లేర్క్ :

ఫార్ములావన్ తాజా సీజన్ లో ఫెరారీ జట్టు డ్రైవర్ గా ఉన్న చార్లెస్ లేక లేర్క్ రెండో టైటిల్ ను సాధించాడు.మెల్ బోర్న్ లో ఏప్రిల్ 10న జరిగిన సీజన్ మూడో రేసు ఆస్ట్రేలియా గ్రాండ్ ఫ్రీ లో లెక్ లెర్క్ (మొరాకో) విజేతగా నిలిచాడు. 58 ల్యాప్ ల రేసును పోల్ పొజిషన్ తో ప్రారంబించిన లెక్ లెర్క్ గంటా 27 నిమిషాలు 46,548 సెకన్ లలో ముగించి అగ్రస్థానం లో నిలిచాడు. ఫెరేజ్ (రెడ్ బుల్) రెండో స్థానంలో రసెల్ (మెర్సి డెజ్) మూడో స్థానం లో నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆస్ట్రేలియా గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచిన చార్లెస్ లేక లేర్క్
ఎవరు: చార్లెస్ లేక లేర్క్
ఎప్పుడు : ఏప్రిల్ 09
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికైన సీతారం ఏచూరి :

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరి మళ్లీ ఎన్నికయ్యారు. ఈ పదవిని ఆయన చేపట్టడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. 2015 ఏప్రిల్ 8న విశాఖపట్నంలో జరిగిన 21వ పార్టీ కాంగ్రెస్ లో తొలిసారి ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపికైన ఏచూరి. 2018 ఏప్రిల్ 22న హైదరాబాద్ లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ 10న కేరళలోని కన్నూరులో ముగి౦పు పైన కేంద్ర కమిటీ ఏచూరిని మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. 2005 నుంచి 2015 వరకు వరుసగా మూడుసార్లు ప్రకాశ్ కారాట్ సీపీఎం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించారు. అదే సంప్రదాయాన్ని ఏచూరి కొనసాగించారు. పుచ్చలపల్లి సుందరయ్య, ఈఎంఎస్ సంబూద్రిప్రసాద్, హరి కిషన్ సింగ్ సూర్తిత్, ప్రకాశ్ కారాట్ తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన 5వ వ్యక్తి సీతారాం ఏచూరి.
క్విక్ రివ్యు :
ఏమిటి: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికైన సీతారం ఏచూరి
ఎవరు: సీతారం ఏచూరి
ఎప్పుడు: ఏప్రిల్ 09
డబ్ల్యూఎస్ఎఫ్ ప్రపంచ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో రెండు టైటిళ్లు గెలిచిన దీపికా పల్లికల్ :

భారత స్క్వాష్ స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. క్రికెటర్ దినేశ్ కార్తీక్ ను పెళ్లి చేసుకుని కవల పిల్లలకు జన్మనివ్వడంతో దాదాపు మూడేళ్లు ఆటకు దూరంగా ఉన్న ఆమె ప్రసవం తర్వాత ఆరు నెలలకే డబ్ల్యూఎస్ఎఫ్ ప్రపంచ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో రెండు టైటిళ్లు గెలిచి అబ్బురపరిచింది. ఆమె మహిళల డబుల్స్ లో జోష్న చిన్నప్పతో, మిక్స్డ్ డబు ల్స్ సౌరభ్ ఘోష్ లలో కలిసి విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన మహిళల డబుల్స్ ఫైనల్లో దీపిక-జోష్న జోడీ 11-9, 4-11, 11-8తో సారా జేన్ పెర్రీ-అలి సన్వాటర్స్ (ఇంగ్లాండ్) జంటపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ తుది పోరులో దీపిక-సౌరభ్ ద్వయం 11-6, 11 రితో ఆడ్రియన్ వాలర్-అలిసన్ వాటర్స్ (ఇంగ్లాండ్) జోడీని ఓడించింది. 2018 అక్టోబరు తర్వాత దీపిక పాల్గొన్న పోటీ ఈవెంట్ ఇదే కావడం విశేషం. ప్రపంచ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ భారత్ కు స్వర్ణ పథకం దక్కడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: డబ్ల్యూఎస్ఎఫ్ ప్రపంచ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో రెండు టైటిళ్లు గెలిచిన దీపికా పల్లికల్
ఎవరు: దీపికా పల్లికల్
ఎప్పుడు : ఏప్రిల్ 09
‘పినాకకు అనే కొత్త వెర్షన్ ను విజయవంతంగా పరీక్షించిన భారత్ :

శత్రువుపై నిప్పులు కురిపించే బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థ ఐన ‘పినాకకు సంబంధించిన కొత్త వెర్షన్ ను భారత్ విజయవంతంగా పరీక్షిం చింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ లో ఇది జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఆయుధ వ్యవస్థను పినాక ఎంకే-1 (ఎన్హెన్స్డ్) రాకెట్ సిస్టమ్ (ఈపీఆర్ఎస్)గా పేర్కొంటున్నారు. మొత్తం మీద 24 రాకెట్లను పరీక్షించినట్లు అధికారులు వివరించారు. ఇవి గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు. ఈ రాకెట్ వ్యవస్థకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను జోడించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా వాటి పరిధి పెరిగి నట్లు వివరించారు. పినాక ఏరియా డినైల్ మునిషన్ (ఏడీఎం) రాకెట్ వ్యవస్థనూ పరీక్షించినట్లు తెలిపారు. ఈ రాకెట్ వ్యవస్థలను పుణెలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ ఈ రాకెట్ వ్యవస్థకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను జోడించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా వాటి పరిధి పెరిగినట్లు అని వివరించారు. పినాక ఏరియా డినైల్ మునిషన్ (ఏడీఎం) రాకెట్ వ్యవస్థనూ పరీక్షించినట్లు తెలిపారు. ఈ రాకెట్ వ్యవస్థలను పుణెలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఏఆర్డీఈ), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ (హెచ్ఎంఆర్ ఎల్) అభివృద్ధి చేశాయి. తాజా ప్రయోగాలను విజయ వంతంగా పూర్తిచేసిన శాస్త్రవేత్తలు, సైనిక బృందాలను డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి అభినందించారు
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘పినాకకు అనే కొత్త వెర్షన్ ను విజయవంతంగా పరీక్షించిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు : ఏప్రిల్ 10
షాహీన్-3 బాలిస్టిక్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించిన పాకిస్తాన్ :

షాహీన్-3 అనే బాలిస్టిక్ మిస్సైల్ ను పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. షాహీన్ వెషన్ వ్యవస్థలో ఉన్న అనేక అంశాలను పరీక్షించేందుకు ఈ టెస్ట్ చేపట్టినట్లు పాక్ మిలిటరీ పేర్కొన్నది. గత ఏడాది జనవరిలోనూ పాకిస్థాన్ షాహీన్ మిస్సైల్ ను పరీక్షించిన విషయ తెలిసిందే. షాహీన్-3 సర్వేస్ టు సర్నేస్ మిస్సెల్. దీని రేంజ్ 2750 కిలోమీటర్లు, అంటే ఈ క్షిపణి ఇండియాలోని అన్ని ప్రాంతాలను చేరుకోగలదు. అండమాన్, నికోబార్ దీవుల్ని కూడా ఈ క్షిపణి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ క్షిపణిలో ఘన ఇంధాన్ని వాడుతున్నారు. యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ వ్యవస్థను కూడా ఇది తప్పించుకోగలదు. 2015లో తొలిసారి పాకిస్థాన్ షాహీన్ మిస్సైల్ ను పరీక్షించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: షాహీన్-3 బాలిస్టిక్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించిన పాకిస్తాన్
ఎవరు : పాకిస్తాన్
ఎప్పుడు: ఏప్రిల్ 10
.2022 వరల్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న అంబర్ బ్రాకె :

స్థానిక ఫోటో జర్నలిస్ట్ ద్వారా క్యాప్చర్ చేయబడిన కమూప్ సమీపంలో ఉంచిన శిలువలపై అమ్మాయిల దుస్తులను కప్పి ఉంచిన ఒక ఫోటో ప్రపంచంలోనే అత్యున్నత గౌరవాన్ని గెలుచుకుంది అంబర్ బ్రాకెన్ రూపొందించిన ఫోటో 2022 సంవత్సరానికి గాను ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. బ్రిటిష్ కొలంబియాలో ని కంలూప్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ దుర్వినియోగం నిర్లక్ష్యం మరియు వ్యాధి కారణంగా మరణించిన రెండు వందల మంది కి పైగా పిల్లల యొక్క జ్ఞాపకార్ధం శిలువపైన వేసిన పిల్లల దుస్తుల ఫోటో లో ఈ దృశ్యం కనపడుతుంది అంబర్ బ్రాకెన్ కెనడియన్ ఫోటో జర్నలిస్ట్, ఆమె ఉత్తర అమెరికాలోని స్థానిక ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై నివేదిక అందించే దానికి ప్రసిద్ధి చెందింది. ఆమె సమకాలీన సమస్యల కోసం గాను ఆమె యొక్క కృషికి 2017లో వరల్డ్ ప్రెస్ ఫోటో మొదటి బహుమతిని గెలుచుకుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: . 2022 వరల్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న అంబర్ బ్రాకె
ఎవరు: అంబర్ బ్రాకె
ఎప్పుడు: ఏప్రిల్ 07
ప్రపంచ హోమియో పతి దినోత్సవం గా ఏప్రిల్ 10 :
హోమియోపతి మరియు వైద్య ప్రపంచంలో దాని యొక్క సహకారం గురించి అవగాహన కల్పించడానికి గాను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10 తేదిన న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2022 ప్రపంచ హోమియోపతి దినోత్సవం యొక్క థీమ్ ఆరోగ్యానికి ప్రజల ఎంపిక ఈ రోజు హోమియోపతి అని పిలువబడే ప్రత్యామ్నాయ వైద్య వ్యవస్థ యొక్క స్థాపకుడిగా పరిగణించబడే ఒక జర్మన్ వైద్యుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానెమాన్ గారి పుట్టిన రోజుని సూచిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ హోమియో పతి దినోత్సవం గా ఏప్రిల్ 10
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: ఏప్రిల్ 10
ఉక్రెయిన్లోని రష్యా సైన్యానికి నూతన సారధిగా కమాండర్ అలేగ్సాండర్ డివోర్ని కోఫ్ నియామకం :

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా సైన్యం ఘోరంగా విఫలమవడాన్ని అవమానంగా రష్యా అద్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. దాంతో ఉక్రెయిన్లోని తమ సైన్యానికి కొత్త సారథిగా రష్యా దక్షిణ మిలటరీ జిల్లా కమాండర్ అలెగ్జాండర్ డివోర్నికోవ్ ను నియమించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ విజయా నికి గుర్తుగా రష్యాలో ఏటా మే 9ని విక్టరీ డేగా జరు పుకుంటారు. ఆ నాటికి ఉక్రెయిన్ లో విజయాన్ని దేశ అద్యక్షుడు పుతిన్ కు కానుకగా ఇవ్వాలని అలెగ్జాండర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు.
- ఉక్రెయిన్ దేశ రాజధాని : కీవ్
- ఉక్రయిన్ దేశ కరెన్సీ :ఉక్రేనియన్ హ్రిన్వియ
- ఉక్రయిన్ దేశ ప్రెసిడెంట్ :వోలోదిమిర్ జేలేన్స్కి
- రష్యా దేశ అద్యక్షుడు :వ్లాదిమిర్ పుతిన్
- రష్యా దేశ రాజధాని :మాస్కో
- రష్యా దేశ కరెన్సీ : రష్యన్ రూబెల్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉక్రెయిన్లోని రష్యా సైన్యానికి నూతన సారధిగా కమాండర్ అలేగ్సాండర్ డివోర్ని కోఫ్ నియామకం:
ఎవరు: డివోర్ని కోఫ్
ఎక్కడ : ఉక్రయిన్ దేశం
ఎప్పుడు: ఏప్రిల్ 10
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |