Daily Current Affairs in Telugu 21&22 May-2022
బ్రిటన్ లో ఎంపికైన మేయర్ గా భారత సంతతి వ్యాపారి సునీల్ చోప్రా ;

బ్రిటన్‌లోని లండన్ బరో ఆఫ్ సౌద్ వార్క్ మేయర్ గా భారత సంతతికి చెందిన సునీల్ చోప్రా గారు రెండోసారి ఎన్నికయ్యారు. 2014-15 కాలంలో ఆయన ఈ పదవిలో ఉన్నారు. భారత సంతతి వ్యక్తి ఒకరు ఇక్కడ మేయర్ రెండవసారి ఎన్నిక కావడం అదే మొదటిసారి. అంతకు ముందు మూడుసార్లు డిప్యూటీ మేయర్ గా వ్యవహరించారు. ఢిల్లీలో జన్మించిన సునీల్ చోప్రా నాలుగు దశాబ్దాల కిందట లండన్ వచ్చారు. తొలుత రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించారు. తర్వాత పిల్లల దుస్తుల హోల్‌సేల్ వ్యాపారాన్ని నిర్వహించారు. ఇక్కడ నివసించే భారత సంతతి వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : బ్రిటన్ లో ఎంపికైన మేయర్ గా భారత సంతతి వ్యాపారి
ఎవరు: భారత సంతతి వ్యాపారి
ఎక్కడ; సునీల్ చోప్రా
ఎప్పుడు: మే 22
ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రము గా నిలిచిన ఎపి :

స్వల్పకాలిక ఆర్థిక అవస రాలు తీర్చుకోవడానికి గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ(ఎస్ డీఎఫ్), వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 305 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, 283 రోజులు వేస్ అండ్ మీన్స్ (డబ్ల్యూ ఎంఏ), 146 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించు కున్నట్లు ఇన్వెస్ట్ మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండియా లిమిటెడ్ (ఐసీ ఆర్ఎ) సంస్థ తాజాగా విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది. దేశంలో మరే రాష్ట్రమూ ఇన్న చేబదుళ్ళ సౌకర్యాన్ని ఉపయోగించులేదు. దీని తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉంది. మూడో స్థానంలో మణిఫర్ రాష్ట్రము నిలిచింది. ఈ సౌకర్యాలు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్లు ఆర్ధికవేత్తల అంచనా. గత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 17 రాష్ట్రాలు ఎస్ఓఎప్, 14 రాష్ట్రాలు వేస్ అండ్ మీన్స్. 9. రాష్ట్రాలు ఓవర్ క్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకున్నాయి. అస్సారి, బీహార్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తర్ ప్రదే మహారాష్ట్ర. పశ్చిమబెంగాలు కేవలం ఒక్కరోజు మాత్రమే ఎస్పీఎఫ్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి.. ఈ రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్న మిగిలిన వాటిల్లో అత్యధిక భాగం ఈశాన్య, హిమాలయ ప్రాంత రాష్ట్రాలే ఉన్నాయి. వాటిల్లో కొన్ని రాష్ట్రాలు ఎస్ఓఎప్, వేస్ అండ్ మీన్స్, ఓడీల్లో ఏదో ఒకటి లేదా రెండింటిని మాత్రమే వాడుకున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రము గా నిలిచిన ఎపి
ఎవరు: ఎపి
ఎప్పుడు: మే 22
ఘంటశాల జీవన సాఫల్య పురస్కారం అందుకున్న పండిట్ మిట్టా జనార్దన్ :

ప్రముఖ సితార్ విద్యాంసుడు పండిట్ మిట్టా జనార్దన్ ను ఘంటశాల జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించినట్లు రాష్టేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు గారు మే 21న ఓ ప్రకటనలో తెలిపారు. ఘంటశాల శతజయంతి అంతర్జాతీయ ఉత్సవాల సందర్భంగా జనార్ధన్ గారు చేసిన సేవల కుగాను ఈ పురస్కారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఘంటశాల జీవన సాఫల్య పురస్కారం అందుకున్న పండిట్ మిట్టా జనార్దన్
ఎవరు: పండిట్ మిట్టా జనార్దన్
ఎప్పుడు: మే 22
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్ ఎన్నిక :

తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా మళ్లీ కేటీఆర్ ఎన్నికయ్యారు. మే 22న జరిగిన సమావేశంలో సభ్యులు గత కార్యవర్గాన్నే తిరిగి ఎనుకున్నారు. కాగా ఈ సంఘం యొక్క కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్, ఉపాధ్యక్షుడిగా చాముండీశ్వరీనాథ్, సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉపేందర్ రావు, కోశాధికారిగా పాణి రావు కొనసా గనున్నారు. వీరి పదవీ కాలం నాలుగేళ్లుగా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్ ఎన్నిక
ఎవరు: తెలంగాణ
ఎక్కడ; తెలంగాణ
ఎప్పుడు: మే 22
ప్రపంచంలో తొలి కేసు మంకీపాక్స్ కేసులు నమోదైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం :

ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈ తరహా తొలి కేసు నమోదైంది. అంటే కాకుండా ఇటీవల ఇజ్రాయెల్ దేశంలో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి.ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తిలో మంకీ పాక్స్ ను గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరికొందరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటంతో వారికి పరీక్షలు నిర్వ హిస్తున్నట్లు పేర్కొంది. పశ్చిమాసియాలో మంకీపాక్స్ తొలి కేసు ఇదే కావడం గమనార్హం. మరోవైపు- స్విట్జర్లాండ్‌లోనూ ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఇప్పటికే బ్రిటన్, స్పెయిన్, పోర్చు గల్, ఇటలీ, అమెరికా, స్వీడన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం ఆస్ట్రేలియాల్లో మంకేపాక్స్ కేసులు బయటపడ్డాయి. పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు వెలుగుచూడటంపై అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ గారు ఆందోలన వ్యక్తం చేశారు. తమ దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి తీవ్రతపై ప్రస్తుతానికి స్పష్టత లేదని. అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మే 22 న దక్షిణ కొరియాలో పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలో తొలి కేసు మంకీపాక్స్ కేసులు నమోదైన ఇజ్రాయెల్ దేశం
ఎవరు: ఇజ్రాయెల్ దేశం
ఎప్పుడు: మే 22
బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ డైరెక్టర్ గా అలోక్ కుమార్ రాజీనామా :

వక్తిగత కారణాల వల్ల బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి అలోక్ కుమార్ వైష్ రాజీనామా చేసారు. అతని స్థానంలో కొత్త ఎండీగా అజయ్ కుమార్ శర్మను నియమించినట్లు బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ తెలిపింది. బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ భారతదేశంలో చక్కెర ఉత్పత్తిదారుగా ఉంది, ఆసియాలో నంబర్ 1 మరియు ప్రపంచంలోని 4వ స్థానంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ షుగర్ కంపెనీ ఇది.
క్విక్ రివ్యు :
ఏమిటి : బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ డైరెక్టర్ గా అలోక్ కుమార్ రాజీనామా
ఎవరు: అలోక్ కుమార్
ఎప్పుడు: మే 22
గ్రామ్ ఉన్నతి బోర్డు కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సునీల్ అరోరా నియామకం :

గ్రామ్ ఉన్నతి (అగ్రిటెక్ స్టార్టప్) తన బోర్డు కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మాజీ చీఫ్ ఎలక్షన్ సునీల్ అరోరా గారిని నియమించింది. అతను 36 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ సివిల్ సర్వెంట్ . అతను సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ మరియు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్రామ్ ఉన్నతి బోర్డు కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సునీల్ అరోరా నియామకం
ఎవరు : సునీల్ అరోరా
ఎప్పుడు: మే 20
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |