
Daily Current Affairs in Telugu 07-03-2022
భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్న మైక్రో సాఫ్ట్ సంస్థ :

సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో రూ. 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. భారతదేశంలో మైక్రోసాఫ్ట్ యొక్క అతిపెద్ద డేటా సెంటర్ రీజియన్ అయిన డేటా సెంటర్ పెట్టుబడిని తెలంగాణ ప్రభుత్వం మరియు మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా ప్రకటించాయి. హైదరాబాద్ లోని కొత్త డేటా సెంటర్ అడ్వాన్స్డ్ డేటా సెక్యూరిటీ మరియు క్లౌడ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఇది ఎంటర్ప్రైజెస్, స్టార్టప్‌లు, డెవలపర్లు, విద్య మరియు ప్రభుత్వ సంస్థలకు సహాయం చేస్తుంది. హైదరాబాద్ డేటా సెంటర్ రీజియన్ భారతదేశంలోని పూణె, ముంబై మరియు చెన్నై అంతటా ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న 3 ప్రాంతాల ప్రస్తుత నెట్ వర్క్ మరొక అదనంగా ఉండనుంది.
- మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపన :ఏప్రిల్ 04 1975
- మైక్రోసాఫ్ట్ సంస్థ సియివో : సత్య నాదెళ్ళ
- మైక్రో సాఫ్ట్ ప్రధాన కార్యాలయ౦ : యు.ఎస్ ,వాషింగ్టన్
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్న మైక్రో సాఫ్ట్ సంస్థ
ఎవరు : మైక్రో సాఫ్ట్ సంస్థ
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు : మార్చి 07
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లోమళ్ళి గ్రే లిస్టు లో నిలిచిన పాకిస్తాన్ :

గ్లోబల్ మనీలాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ గ ఉన్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF అదనపు ప్రమాణాల క్రింద కొన్ని లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ దేశం ఉగ్రవాద ఫైనాన్సింగ్ “గ్రే లిస్ట్”లో ఉంచింది. పాకిస్తాన్ జూన్ 2018 నుండి పారిస్ ఆధారిత ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) యొక్క గ్రే లిస్ట్ లో ఉంది, మనీలాండరింగ్ ను తనిఖీ చేయడంలో విఫలమై టెర్రర్ ఫైనాన్సింగికు దారితీసింది మరియు అక్టోబర్ 2019 నాటికి దాన్ని పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక ఇవ్వబడింది. FATF అనేది మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వ్యవస్థ మరియు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రతకు సంబంధించిన ఇతర సంబంధిత బెదిరింపులను ఎదుర్కోవడానికి 1989లో స్థాపించబడిన అంతర్ ప్రభుత్వ సంస్థ.
- పాకిస్తాన్ దేశ రాజధాని : ఇస్లామాబాద్
- పాకిస్తాన్ దేశ్ కరెన్సీ : పాకిస్తానీ రుపయ
- పాకిస్తాన్ దేశ అద్యక్షుడు : ఆరిఫ్ ఆల్వి
- పాకిస్తాన్ దేశ ప్రదాని : ఇమ్రాన్ ఖాన్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లోమళ్ళి గ్రే లిస్టు లో నిలిచిన పాకిస్తాన్
ఎవరు : పాకిస్తాన్
ఎప్పుడు : మార్చి 07
టెస్ట్ లలో అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్ గ నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ :

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన 435వ టెస్టు వికెట్ తీయడం ద్వారా మాజీ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ ఐన అనిల్ కుంబ్లే తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 434 టెస్టు వికెట్లతో కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక వికెట్ లు తీసిన తొమ్మిదో బౌలర్ కూడా అశ్విన్ నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అత్యధిక వికెట్లు “తీసిన భారత రెండో బౌలర్ గ నిలిచిన రవిచంద్రన్ అశ్విన్
ఎవరు : రవిచంద్రన్ అశ్విన్
ఎప్పుడు : మార్చి 07
ఐ.ఎస్.ఎస్.ఎఫ్ పపంచ కప్ లో మరో స్వర్ణ పథకం గెలుచుకున్న రిథం ,అనీష్ జోడి :

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో రిథమ్ సంగ్వాన్, అనీష్ భ్వల్అనే జంట స్వర్ణ పతకం గెలుచుకుంది. పసిడి పోరులో భారత జోడీ మరో రజతం 17-7తి థాయ్‌లాండ్ జోడీపై గెలిచింది. రెండో రౌండ్ క్వాలిఫికేషన్లో రెండో స్థానంలో నిలిచి సింగ్, అనీష్ ఫైనల్ కు అర్హత సాధించిన రిథమ్, అనీష్ ద్వయం టైటిల్ పోరులో పదుక చివిసా నార్వే రామ్ ఖాంహేంగ్ల పై పైచేయి సాధించింది ఇషా సింగ్, భవేశ్ షెకావత్ జంటకు అయిదో స్థానం దక్కింది. నంబర్ వన్ జట్టుగా భారత్ ప్రపంచకప్ ను ముగించింది. మొత్తం నాలుగు పసిడి పతకాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో పత కాల పట్టికలో అగ్రస్థానంలో రోజైన భారత్ కు మరో రజతం కూడా దక్కింది. పురుషుల డో 25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ లో గుర్ ప్రీత్ సింగ్, అనీష్ భన్వాలా, భవేశ్ షెకావత్ త్రయం 7-17తో జర్మనీ జట్టుతో చేతిలో ఓడిపోయింది. నార్వే మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో భారత్ తర్వాత రెండో స్థానంతో టోర్నీని ముగించింది. మొత్తంగా 60 దేశాల 5 నుంచి 500 పైగా షూటర్లు ప్రపంచకప్ లో పోటీపడ్డారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐ.ఎస్.ఎస్.ఎఫ్ పపంచ కప్ లో మరో స్వర్ణ పథకం గెలుచుకున్న రిథం ,అనీష్ జోడి
ఎవరు : రిథం ,అనీష్
ఎక్కడ: కైరో
ఎప్పుడు : మార్చి 07
పాకిస్తాన్ దేశ మాజీ అద్యక్షుడు రఫీక్ తరార్ కన్నుమూత :

1997 నుండి 2001 వరకు పాకిస్థాన్ దేశ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రముఖ పాకిస్థానీ రాజకీయ నాయకుడు మరియు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రఫీక్ తరార్ అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన వయసు 92ఏళ్లు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను నామినేట్ చేసిన తర్వాత 1997 మరియు 2001 మధ్య తరర్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ తో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆయన 1991 నుండి 1994 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పాకిస్తాన్ దేశ మాజీ అద్యక్షుడు రఫీక్ తరార్ కన్నుమూత
ఎవరు : రఫీక్ తరార్
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు : మార్చి 07
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |