Daily Current Affairs in Telugu 12 May-2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 12 May-2022

RRB Group d Mock test

ఇంగ్లాండ్ టెస్టుజట్టు కోచ్ గ మెక్ కలమ్ నియామకం :

న్యూజిలాండ్  క్రికెట్ జట్టు మాజీ స్టార్ ఓపెనర్ బ్రెండన్ మెక్కలమ్ ఇంగ్లాండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ గా నియమితుడయ్యాడు. 40 ఏళ్ల మెక్కలమ్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్  కోచ్ గా వ్యవహరిస్తున్నారు. 2019లో ఆటకు వీడ్కోలు చెప్పిన అతడు టెస్టుల్లో కివీస్ బలమైన జట్టుగా ఎదగడంలో తెర వెనుక పాత్ర పోషించాడు. బ్రెండన్  మెక్కల్లం దిశా నిర్దేశం లోనే కివీస్ జట్టు గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు  బ్రెండన్ కోచ్ గా ఎంపిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రూట్ రాజీనామా చేయడంతో కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎంపి కైన సంగతి తెలిసిందే. జూన్ 2న న్యూజిలాండ్ తో  ఆరంభమయ్యే టెస్ట్ ఇంగ్లాండ్ కోచ్ గా మెక్కలమ్ తొలి టెస్టు కావడం విశేషం. గత 17 టెస్టుల్లో ఇంగ్లాండ్ కేవలం ఒక్క మ్యాచ్లోనే గెలిచింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: ఇంగ్లాండ్ టెస్టుజట్టు కోచ్ గ మెక్ కలమ్ నియామకం

ఎవరు : మెక్ కలమ్

ఎక్కడ : ఇంగ్లాండ్ జట్టు

ఎప్పడు  మే 12

ఎయిర్ ఇండియా సియివో ,ఎండి గా క్యాంప్ బెల్ విల్సన్ :

ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ సియివో మేనేజింగ్ డైరెక్టర్ ఎండి గా క్యాంప్ బెల్ విల్సన్ నియమితులయ్యారు.ఆయన నియామకానికి ఎయిర్ ఇండియా బోర్డు అనుమతి ఇచ్చింది.ఈ నియామకానికి నియంత్రణ సంబంధింత అనుమతులు పొందాల్సి ఉందని కంపెని తెలిపింది.సింగపూర్ ఎయిర్ లైన్స్ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ స్కూట్ ఎయిర్ సియివో విల్సన్ పని చేస్తున్నారు.ఆయనకు విమాన యాన సంస్థల్లో 26 ఏళ్ల అనుభవం ఉంది.సింగపూర్ ఎయిర్ లైన్స్ తో కలిసి టాటా గ్రూప్ సంయుక్తంగా విస్తారా విమానయాన సంస్థను దేశీయంగా నిర్వహిస్తున్న సంగతి విదితమే ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో ఎయిర్ ఇండియా ను తీర్చిదిద్దింది. విసి తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నా అని టాటా సన్స్ ,ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్.చంద్ర శేఖర్ పేర్కొన్నారు.

  • ఎయిర్ ఇండియా స్థాపన : 1932
  • ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం : డిల్లి
  • ఎయిర్ ఇండియా స్థాపకుడు :జే.ఆర్.డి టాటా

క్విక్ రివ్యూ :

ఏమిటి: ఎయిర్ ఇండియా సియివో ,ఎండి గా క్యాంప్ బెల్ విల్సన్

ఎవరు : క్యాంప్ బెల్ విల్సన్

ఎప్పడు  మే 12

 కేరళ లో నమోదు అయిన టమోటా ప్లూ వైరస్ కేసులు :

కేరళా లో టమాట ప్లూ అనే కొత్త రకం వైరస్ కలకలం రేపుతుంది.దీని కారణ౦గా అనేక మంది చిన్నారులు తీవ్ర మైన జ్వరం ఇతర లక్షణాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.ప్రధానంగా ఐదేళ్ళ లోపు పిల్లలు ఈ వైరస్ బారినపడుతున్నారు.ఇప్పటి వరకు 80 మంది పైగా చిన్నారులకు టమాటా ప్లూ సోకింది.ఈ కేసులన్నీ ఒక్క కొల్లం జిల్లాలోనే నమోదు అయ్యాయి. టమాట ఫీవర్ గా పిలిచే ఈ వైరస్ అత్యంత అరుదైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు.దీని కారణంగా చర్మం పై చాలా చోట్ల ఎర్రటి బొబ్బలు వస్తాయి. అవి టమాట ఆకారంలో ఉండడం తో దీనికి ఆ పేరు పెట్టారు. దీంతో పాటు తీవ్రమైన జ్వరం ఒళ్ళు నొప్పులు ,బాల హీనత ,డిహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి.కొందరు పిల్లలో జలుబు దగ్గు కడుపు నొప్పి వాంతులు విరేచనాలు చేతులు మోకాళ్ళు పిరుదుల రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  • కేరళ రాష్ట్ర రాజధాని : తిరువంత పురం
  • కేరళ రాష్ట్ర సిఎం : పినరయి విజయన్
  • కేరళ రాష్ట్ర గవర్నర్ : ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

క్విక్ రివ్యూ :

ఏమిటి: కేరళ లో నమోదు అయిన టమోటా ప్లూ వైరస్ కేసులు

ఎవరు : చిన్న పిల్లలకు

ఎక్కడ : కేరళ రాష్ట్రము

ఎప్పడు  మే 12

డెఫింపిక్స్ లో  భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేర్చిన దీక్ష దాగర్ :

డెఫింపిక్స్ భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. గోల్ఫ్ దీక్ష దాగర్ పసిడి పతకం గెలుచు కుంది. మే 12 న జరిగిన ఫైనల్లో దీక్ష దాగర్. ఆషిన్ గ్రేస్ (అమెరికా)పై విజయం సాదించింది. కెరీర్లో ఈ భారత గోల్ఫరు కు ఇది రెండో డెఫ్టింపిక్స్ పతకం. 2017లో టర్కీలో జరిగిన క్రీడల్లో గోల్ఫ్ ను తొలిసారి ప్రవేశపెట్టగా 17 ఏళ్ల వయసులో దీక్ష దాగర్ రజతం. నెగ్గింది. అప్పుడు ఫైనల్లో శైలిన్ (అమెరికా) చేతిలో ఓడింది. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ లోనూ దీక్ష చివరి నిమిషంలో అర్హత సాధించింది. ఓలింపిక్స్ డెఫ్ లింపిక్స్ ఆడిన తొలి గోల్ఫ్ క్రీడాకారిణిగా దీర్ఘ ఘనత సాధించింది. 2019లో ప్రొఫెషనల్ గా మారిన దీక్ష. గతేడాది దక్షిణాఫ్రికా మహిళల ఓపెన్ లో విజేతగా నిలి చింది. మహిళల ప్రా సర్క్యూట్ లో పలుమార్లు టైటిల్ నెగ్గింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: డెఫింపిక్స్ లో  భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేర్చిన దీక్ష దాగర్

ఎవరు : దీక్ష దాగర్

ఎప్పడు  మే 12

కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియామకం :

కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ గారు  నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఈసీలో కమిషనర్ గా ఉన్నారు. సీఈసీగా ఈ నెల 15న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈసీలోని కమిషనర్లలో అత్యంత సీనియర్ ను సీఈసీగా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  గారు నియమించారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన వెలువరించింది. కాబోయే సీఈసీకి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందనలు తెలిపారు. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా ఉంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు 2024లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఆయన నేతృత్వంలోనే పూర్తికానున్నాయి. 1960 ఫిబ్రవరి 19న జన్మించిన ఆయన బీఎస్సీ ఎలీల్బీ, పీజీడీఎం, ఎంఏ (పబ్లిక్ పాలసీ) చేశారు. బిహార్/ఝార్ఖండ్ క్యాసర్ ఐఏఎస్ అధికారి (1981 బ్యాచ్) అయిన.  2020 ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. 2020 సెప్టెంబరు ఒకటో తేదీన ఎన్నికల కమిషనర్ కావడానికి ముందు ప్రభుత్వరంగ సంస్థల ఎంపిక మండలి’ (పీఈఎస్బీ) చైర్పర్సన్ గా సేవలందించారు.

  • ఎలెక్షన్ కమిషన్ స్థాపన  25 జనవరి 1950
  • ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం : డిల్లి
  • ఎలక్షన్ కమిషన్ ప్రథమ కమిషనర్ :   సుకుమార్ సేన్
  • ఎలక్షన్ కమిషన్ గుర్తించి రాజ్యాంగం లో తెలిపే ఆర్టికల్ :324 k

క్విక్ రివ్యూ :

ఏమిటి:    కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియామకం

ఎవరు : గా రాజీవ్ కుమార్

ఎక్కడ : డిల్లి

ఎప్పడు  మే 12

భారత శ్రమల సమాఖ్య  అధ్యక్షు డిగా  బాద్యతలు చేపట్టిన సంజీవ్ బజాజ్ :

భారత శ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షు డిగా బజాజ్ పిన్సీర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ మే 12నగురువారం బాధ్యతలు స్వీకరించారు. 2022-23 సంవత్సరానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న టాటా స్టీల్ సీ ఎండీ టీవీ నరేంద్రన్ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. తదు పది సీఐల అధ్యక్ష అభ్యర్థిగా హీరో మోటోకార్స్ చైర్మన్, సేఈఓ పవన్ ముంజాల్ ఉంటారు. సీఐఐ ఉపాధ్యక్షుడిగా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూ షన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేశ్ పగ్గాలు చేపట్టారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: భారత శ్రమల సమాఖ్య  అధ్యక్షు డిగా  బాద్యతలు చేపట్టిన సంజీవ్ బజాజ్

ఎవరు : సంజీవ్ బజాజ్

ఎప్పడు  మే 12

Daily current affairs in Telugu April -2022
Daily current affairs in Telugu 01-04 -2022
Daily current affairs in Telugu 02-04 -2022
Daily current affairs in Telugu 03-04 -2022
Daily current affairs in Telugu 04-04 -2022
Daily current affairs in Telugu 05-04 -2022
Daily current affairs in Telugu 6-04 -2022
Daily current affairs in Telugu 07-04 -2022
Daily current affairs in Telugu 08-04-2022
Daily current affairs in Telugu 09-04-2022</strong>
Daily current affairs in Telugu 10-04-2022
Daily current affairs in Telugu 11-04-2022
Daily current affairs in Telugu 12-04-2022
Daily current affairs in Telugu 13-04-2022
Daily current affairs in Telugu 14-04-2022
>Daily current affairs in Telugu 15-04-2022</strong>
Daily current affairs in Telugu 16-04-2022
Daily current affairs in Telugu 17-04-2022
Daily current affairs in Telugu 18-04-2022
Daily current affairs in Telugu 19-04-2022
Daily current affairs in Telugu 20-04-2022
Daily current affairs in Telugu 21-04-2022
Daily current affairs in Telugu 22-04-2022

,

Daily current affairs in Telugu February -2022
Daily current affairs in Telugu 01-02-2022
Daily current affairs in Telugu 02-02-2022
Daily current affairs in Telugu 03-02-2022
Daily current affairs in Telugu 04-02-2022

Download Manavidya app

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *