
Daily Current Affairs in Telugu 23 May-2022
100 మీటర్ల హర్డిల్స్ లో జాతీయ రికార్డు బద్దలు కొట్టిన తెలుగు అథ్లెట్ జ్యొతి :

ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి మరోసారి జాతీయ రికార్డు బద్దలు కొట్టింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెండు వారాల వ్యవధిలో రెండోసారి జాతీయ రికార్డు నమోదు చేసింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ లో 22 ఏళ్ల జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ను 13.11 సెకన్లలో ముగించి జాతీయ రికార్డు సాధించింది. ఈనెల 10న సైప్రస్ అంతర్జాతీయ మీట్ లో జ్యోతి 13.23 సెకన్ల టైమింగ్ తో.. 2002లో అనురాధ బిశ్వాల్ పేరిట నమోదైన జాతీయ రికార్డు (13,38 సెకన్లు)ను తిరిగరాసిన సంగతి తెలిసిందే. భువనేశ్వర్లోని రిలయన్స్ ఫౌండేషన్ ఒడిషా అథ్లెటిక్స్ హై పర్ఫార్మెన్స్ సెంటర్లో కోచ్ జేమ్స్ హిలియర్ ఆధ్వర్యంలో జ్యోతి శిక్షణ తీసుకుంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 100 మీటర్ల హర్డిల్స్ లో జాతీయ రికార్డు బద్దలు కొట్టిన తెలుగు అథ్లెట్ జ్యొతి
ఎవరు : జ్యోతి యర్రాజి
ఎప్పుడు : మే 23
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా నియామకం :

దేశ రాజధాని ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా గారు నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ మే 23న ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో గతవారం రాజీనామా చేసిన అనిల్ బైజల్ యొక్క స్థానంలో సక్సేనాను నియమించారు.
క్విక్ రివ్యు ;
ఏమిటి: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా నియామకం :
ఎవరు : వినయ్ కుమార్ సక్సేనా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : మే 23
ప్రతిష్ఠాత్మక జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు-2021కు ఎంపికైన శిబాని దాస్ :

ఒడిశా బ్రహ్మపురలోని ఎంకేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రి నర్సింగ్ అధికారిణి శిబాని దాస్ ప్రతిష్ఠాత్మక జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు-2021కు ఎంపికయ్యారు. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. జాజపుర్ జిల్లా కంటా బొణియా గ్రామంలో జన్మించారు. శిబాని 2007 నుంచి ఎంకే సీజీలో సేవలందిస్తున్నది అంతకుముందు కోల్కతాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేశారు. 25 ఏళ్లుగా రోగుల సేవకు అంకితమైన శిబాని కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో కూడా శీతలాపల్లి ఎంకేసేజీలోని కరోనా ప్రత్యేక ఆసుపత్రుల్లో బాధితులకు విశేష సేవలందించి ఈ అవార్డుకు ఎంపిక అయింది.
క్విక్ రివ్యు ;
ఏమిటి: ప్రతిష్ఠాత్మక జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు-2021కు ఎంపికైన శిబాని దాస్
ఎవరు : శిబాని దాస్
ఎప్పుడు : మే 23
టైమ్ మ్యాగ జైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావశీల జాబితాలో చోటు దక్కించుకున్న గౌతం ఆదాని :

ప్రఖ్యాత టైమ్ మ్యాగ జైన్ విడుదల చేసిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల మొదటి 100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రా మికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నంది లు చోటు దక్కించుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఈ జాబితా విడుదల చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెస్స్కి రష్యా అధినేత పుతిన్ చైనా అధినేత జిన్ పింగ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, టెన్నిస్ క్రీడాకారుడు రపేల్ నాదల్, ఆపిల్ కంపెని సీఈఓ టీమ్ కుర్ ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా వి తదితరులకు చోటు లభించింది.
క్విక్ రివ్యు ;
ఏమిటి: టైమ్ మ్యాగ జైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావశీల జాబితాలో చోటు దక్కించుకున్న గౌతం ఆదాని
ఎవరు : గౌతం ఆదాని
ఎప్పుడు :మే 23
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా సలీల్ పరేఖ్ నియామకం :

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ గా సలీల్ పరేఖ్ మరోసారి నియమితులయ్యారు. ఆయన మరో ఐదేండ్ల పాటు పదవిలో కొనసాగేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. పరేఖ్ 2018 జనవరి నుంచి ఇన్ఫోసిస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐఐటీ బాంబే నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పరేఖకు ఐటీ రంగంలో దాదాపు 30 ఏండ్ల అనుభవం ఉంది.
క్విక్ రివ్యు ;
ఏమిటి: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా సలీల్ పరేఖ్ నియామకం :
ఎవరు : సలీల్ పరేఖ్
ఎప్పుడు : మే 23
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గా మే 22 :

జీవవైవిధ్యం అనేది భూమిపై జీవుల వైవిధ్యం మరియు వాటి వైవిధ్యాన్ని సూచించే ఒక విస్తృత పదబంధం. జీవావరణ ప్రపంచం యొక్క సమతౌల్యం మనుగడకు అవసరమని ఇది స్వయం-స్పష్టం. ప్రతి సంవత్సరం మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటారుఇది జీవవైవిధ్యం విలువను గుర్తు చేస్తుంది. ఈ రోజు యొక్క ఉద్దేశ్యం పర్యావరణం మరియు ఈ గ్రహం మీద నివసించే అన్ని జాతుల గురించి అవగాహన పెంచడం. ఇది ఇలాంటి ఆందోళనలు మరియు సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రజలను ప్రోత్సహిస్తుంది. “అన్ని జీవితాల కోసం భాగస్వామ్య భవిష్యత్తును నిర్మించడం” అనేది 2022 సంవత్సరానికి గాను అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క థీమ్.గా ఉంది .
క్విక్ రివ్యు ;
ఏమిటి: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గా మే 22
ఎప్పుడు : మే 22
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |