
Daily Current Affairs in Telugu 20 -April-2022
రష్యా యొక్క అత్యంత ప్రాధాన్య దేశం‘ (ఎంఎస్ఎన్) హోదాను రద్దు చేస్తూ ప్రకటించిన జపాన్ :

తమతో వాణిజ్యం పరంగా రష్యాకు ఉన్న అత్యంత ప్రాధాన్య దేశం’ (ఎంఎస్ఎన్) హోదాను జపాన్ పార్లమెంటు ఏప్రిల్ 20న లాంఛనంగా రద్దు చేసింది. ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యా ప్రయత్నిస్తుండ దాన్ని నిరసిస్తూ విధిస్తున్న ఆంక్షల్లో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు ప్రకటించింది. రష్యాకు చెందిన ఎనిమిది మంది దౌత్య, వాణిజ్య అధికారుల్ని జపాన్ గత నెలలోనే బహిష్కరించింది. వారంతా ఏప్రిల్ 20న తమ దేశానికి బయల్దేరారు. తాజాగా ఎంఎఫెన్ రద్దుతో రష్యా నుంచి జపాన్ కు జరిగే దిగుమతుల ధరవరలపై ప్రభావం పడనుంది. విదేశీ మారకద్రవ్య చట్ట నిబంధనల్ని కూడా పార్లమెంటు సవరించింది. రష్యా చేస్తున్న దురాక్రమణ ప్రభావం తూర్పు ఆసియా పైనా పడవచ్చనే ఉద్దేశంతో దానిని నిలువరించేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రయత్నాలకు జపాన్ గట్టి మద్దతునిస్తోంది. రష్యాతో కొత్తగా పెట్టుబడుల్ని, వాణిజ్యాన్ని నిషేధించింది.
- రష్యా దేశ రాజధాని : మాస్కో
- రష్యా దేశ కరెన్సీ : రష్యా రూబెల్
- రష్యా దేశ అద్యక్షుడు : వ్లాదిమిర్ పుతిన్
- ఉక్రెయిన్ దేశ రాజధాని :కీవ్
- ఉక్రయిన్ దేశ అద్యక్షుడు : వోలోదిమిర్ జేలేస్కి
క్విక్ రివ్యు :
ఏమిటి: రష్యా యొక్క అత్యంత ప్రాధాన్య దేశం’ (ఎంఎస్ఎన్) హోదాను రద్దు చేస్తూ ప్రకటించిన జపాన్
ఎవరు: జపాన్
ఎప్పుడు: ఏప్రిల్ 20
కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహా దారుగా ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ నియామకం :

కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుగా ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ నియమితులయ్యారు. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న ప్రొఫెసర్ కె. విజయ రాఘవన్ గారి స్థానంలో సూద్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం 2018 నుంచి ప్రధానమంత్రి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సలహా మండలి సభ్యుడిగా ఉన్న సూదన్న ముఖ్య శాస్త్ర సలహాదారుగా నియమిస్తూ కేంద్ర నియామక వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకొంది. పంజాబ్ యూనివర్సిటీలో ఎంఎస్ పిజిక్స్ చేసిన ఆయన బెంగుళూరు పీహెచడి చేశారు. ఐఐఏసీసీలో ప్రొఫెసర్ గా, కల్పారు. ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా సేవలందించారు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భోపాల్ లో ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాలక మండళ్లకు చైర్మన్ గానూ ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహా దారుగా ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ నియామకం
ఎవరు: అజయ్ కుమార్ సూద్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: ఏప్రిల్ 20
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు కీరన్ పోలార్డ్ :

వెస్టిండీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతు న్నట్లు ఏప్రిల్ 20 న ప్రకటించాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఐసీఎల్ లాంటి లీగ్ మాత్రం అతడు ఆడతాడు. 2007లో అరంగేట్రం చేసిన పొలార్డ్ తన చివరి సిరీస్ ను ఇటీవల భారత్ లో ఆడాడు. “బాగా ఆలోచించి. అంతర్జాతీయ క్రికెట్ రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా. వెస్టిండీస్ కు ఆడాలని 10 ఏళ్ల వయసు నుంచే కల కన్నా. టీ20, వన్డే ఫార్మాట్లో 15 ఏళ్ల పాటు విండీస్ కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నా” అని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పొలార్డ్ పేర్కొన్నాడు. టీ20ల్లో భీకర బ్యాట్స్మన్ గా పేరున్నా. వెస్టిండీస్ తరఫున అతడి రికార్డు మాత్రం గొప్పగా లేదు. 34 ఏళ్ల పొలార్డ్ 123 వన్డేల్లో 26.01 సగటుతో 2708 పరుగులు చేశాడు. 55 వికెట్లు పడగొట్టాడు. 101 టీ20ల్లో 25.30 సగటుతో 1569 పరుగులు సాధించిన అతడు. 12 వికెట్లు చేజిక్కించుకున్నాడు. పొలార్డ్ ఐపీఎల్ లీగ్ లో ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు కీరన్ పోలార్డ్
ఎవరు: కీరన్ పోలార్డ్
ఎప్పుడు: ఏప్రిల్20
భారీ సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా దేశం :

రష్యా అమ్ములపొదిలో మరో శత్రుభీకర ఆయుధం చేరిందిఏళ్లుగా అభివృద్ధి చేస్తున్న భారీ సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఆ దేశం తొలిసారి ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఒకేసారి 16 అడు వార్ హెడ్లను అది మోసుకెళ్లగలదు. క్షిపణి పొడువు 36 మీటర్లు. వెడల్పు 3 మీటర్లు. బరువు 200 టన్నులు. గంటకు 25 వేల కిలోమీ టర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇందులోని ఒక్కో వారాడ్ను ఒక్కో లక్ష్యానికి గురిపెట్టొచ్చు. వాయవ్య రష్యాలోని పెసెట్స్ కాస్మాడ్రోమ్’ నుంచి ఈ ఆర్ఎస్ఎ-28 సర్మత్ క్షిపణిని బుధవారం ప్రయోగించారు. దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని (పసిఫిక్ మహాసము ద్రంలోని కమట్కాలో) అది విజయవంతంగా చేదించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘సర్కత్’ అత్యంత విలక్షణ, వ్యూహాత్మక ఆయుధమని, తమ దేశ సాయుధ బలగాల పోరాట సామర్థ్యాలను అది మరింత బలోపేతం చేస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అత్యాధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలను అది బోల్తా కొట్టించగల దని అన్నారు. ప్రపంచంలో మరేదీ ఈ క్షిపటికి సాటిరాదని సమీప భవిష్యత్తులో ఆలాంటిది పట్టుకు రాబోదనీ వ్యాఖ్యానించారు.
- రష్యా దేశ రాజధాని : మాస్కో
- రష్యా దేశ కరెన్సీ : రష్యా రూబెల్
- రష్యా దేశ అద్యక్షుడు : వ్లాదిమిర్ పుతిన్
క్విక్ రివ్యు :
ఏమిటి: భారీ సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా దేశం
ఎవరు: రష్యా దేశం
ఎప్పుడు: ఏప్రిల్ 19
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్ :

బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణిని భారత్ ఏప్రిల్ 20న ఒకేరోజు రెండు వేదికల నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆస్ట్రా నికి సంబంధించిన నౌకా విధ్వంసక వెర్షన్ ను నేవీ ప్రయోగించగా గగనతలం నుంచి గర్జించే బ్రహ్మోస్ ను వాయుసేన పరీక్షించింది. నౌకాదళ వెర్షను ఐఎన్ఎస్ ఢిల్లీ అనే యుద్ధ నౌక నుంచి ప్రయోగించినట్లు నేవీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఆధునిక మాడ్యులర్ లాంచరు ఉపయోగించినట్లు చెప్పారు. ఈ పరీక్ష సుదూర దాడి సామర్ధ్యాన్ని రుజువు చేసిందని వివరించారు. ప్రధాన యుద్ధ ఐఎన్ఎస్ నౌకల సమీకృత నెట్వర్క్ ఆధారిత ఆపరేషన్ సత్తాను తేటతెల్లం చేసినట్లు తెలిపారు. గగనతల వెర్షన్ ను సుబోయ్ 30 ఎంకేఐ యుద్ధవి మానం నుంచి ప్రయోగించినట్లు వాయుసేన తెలి యుద్ధ తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిర్వహించిన ఈ పరీక్షకు భారత నౌకాదళంతో సమన్వయం చేసుకుంటూ నిర్వహిం చామని పేర్కొంది. ఈ క్షిపణి.. అత్యంత కచ్చిత త్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని వివరించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: ఏప్రిల్ 20
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |