
Daily Current Affairs in Telugu 13 May-2022
దేశంలోని మొట్టమొదటి “అమృత్ సరోవర్”ను ప్రారంబించిన ముఫ్తార్ అబ్బాస్ :
దేశంలోని మొట్టమొదటి “అమృత్ సరోవర్”ను కేంద్ర మంత్రి ముఫ్తార్ అబ్బాస్ నఖ్వీ మరియు ఉత్తరప్రదేశ్ జిల్ శక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రాంపూర్‌లోని పట్వాయ్ లో ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాకు 75 చెరువులు (అమృత్ సరోవర్) ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోని మొట్టమొదటి “అమృత్ సరోవర్”ను ప్రారంబించిన ముఫ్తార్ అబ్బాస్ :
ఎవరు: ముఫ్తార్ అబ్బాస్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : మే 13
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఛైర్పర్సన్ గా నిధి చిబ్బర్ నియామకం :
సీనియర్ ఐఏఎస్ అధికారిణి నిధి చిబ్బర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఛైర్పర్సన్ గా మే 12న కేంద్రం చేసిన ఉన్నత స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్ కేడరకు చెందిన 1994 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన చిబ్బర్ ప్రస్తుతం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్నారు. సెంట్రల్ బోర్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనేది భారతదేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల కోసం జాతీయ స్థాయి విద్యా మండలి. ఇది భారత ప్రభుత్వంచే నియంత్రించబడుతుంది మరియు నిర్వహించబడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఛైర్పర్సన్ గా నిధి చిబ్బర్ నియామకం
ఎవరు: నిధి చిబ్బర్
ఎప్పుడు : మే 13
ఏపి ప్రభుత్వ కార్యదర్శిగా సమీర్ శర్మ కు మరో ఆరు నెలల పొడగింపు :
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సమీర్ శర్మకు కేంద్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో మరో 6 నెలలు పొడిగింపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయనకు ఇది వరకు ఆరు నెలల పొడి గింపు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మరో ఆరు నెలలు ఇవ్వడం విశేషం. సీఎస్ సమీర్ శర్మకు ఇది వరకు ఇచ్చిన ఆరు నెలల పొడిగింపు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. మరో 6 నెలలు పొడిగింపు ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదికి ముఖ్యమంత్రి జగన్ ఏప్రిల్ 12న లేఖ రాశారు. దీంతో సమీర్ శర్మకు 2022 నవంబరు 30 వరకు పొడిగింపునిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏపి ప్రభుత్వ కార్యదర్శిగా సమీర్ శర్మ కు మరో ఆరు నెలల పొడగింపు
ఎవరు: సమీర్ శర్మ
ఎక్కడ: ఏపి
ఎప్పుడు : : మే 13
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నియామకం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సీఈవో)గా 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న కె.విజయానంద్ స్థానంలో ఆయన్ని నియమిస్తూ భారత ఎన్నికల సంఘం. మే 12 నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘వివరించింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం ప్రత్యేకం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నియామకం
ఎవరు: ముఖేష్ కుమార్ మీనా
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు : మే 13
జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ లో స్వర్ణ పథకంను గెలుచుకున్న ఉమా మహేష్ ,ఇషా సింగ్ :
జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ యువ తెలుగు షూటర్లు ఉమామహేష్, ఇషా సింగ్ పసిడితో మెరిశారు. పురుషుల టీమ్ ఎయిర్ రైఫిల్ విభాగంలో మహేష్, మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో ఇషా స్వర్ణం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తీర్ధ మకీజా, రుద్రాంక్ష్ బాలా సాహెబ్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. మే13న ఫైనల్లో మహేష్ బృందం 16-8తో స్పెయిన్ (ఆడ్రియన్, ఒవిడో, జార్జ్)పై విజయం సాధించింది. విజయవాడకు చెందిన 17 ఏళ్ల ఇషా మహేష్ ఇటీవల ప్రపంచకప్ క్వాలిఫికేషన్ టోర్నీలో 628 పాయింట్లతో కాంస్యం గెలిచాడు. ట్రయిల్-2 టోర్నీలో జూనియర్ యూత్ విభాగాల్లో అతడు స్వర్ణాలతో మెరిశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ లో స్వర్ణ పథకం ను గెలుచుకున్న ఉమా మహేష్ ,ఇషా సింగ్
ఎవరు: ఉమా మహేష్ ,ఇషా సింగ్
ఎక్కడ: జర్మని
ఎప్పుడు : : మే 13
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు, అబుదాభీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ కన్నుమూత :
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు, అబుదాభీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ (73) మే 13న కన్నుమూశారు. ఆయన చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. యూఏఈ అధ్యక్ష వ్యవహారాలశాఖ ఈ విషయాన్ని వెల్లడిస్తూ 40 రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మే 13 నుంచి మూడు రోజులు మూసి ఉంటాయని తెలిపింది. షేక్ ఖలీఫా సోదరుడైన అబుదాబీ క్రౌన్. ప్రిన్స్ షేక్ మహమ్మద్ గాంధీ బిన్ జాయేద్ తదుపరి యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. అబుదాబీ పాలకుడు షేర్ ఖలీపా మృతి సందర్భంగా ఆయన గౌరవార్థం శనివారం ఒక్కరోజు సంతాప్ దీనంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. కాగా 1948లో జన్మించిన షేక్ ఖలీఫా యూఏఈకి లీ రెండో ప్రధానిగా 2004 నవంబర్ 3న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అబుదాబీ పాలకుడిగానూ కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆయన తండ్రి షేక్ జయేద్ బిన్ కాష్టా సుల్తాన్ అల్ నహ్యాన్ 1971 నుంచీ యూఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండేవారు
క్విక్ రివ్యు :
ఏమిటి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు, అబుదాభీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ కన్నుమూత
ఎవరు: షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్
ఎక్కడ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఎప్పుడు : మే 13
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |