Daily Current Affairs in Telugu 30 December- 2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 30 December- 2022

దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగను నిర్మిస్తున్న  పశ్చిమబెంగాల్ :

దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం పశ్చిమబెంగాల్లో సిద్ధమవుతోంది. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలుమార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మిస్తున్నారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు ప్రయాణికులకు వింత అనుభూతిని అందించనుంది. సొరంగ అంతర్గత అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొ లత 6.1 మీటర్లు. లండన్-ప్యారిస్ కారిడార్ లోని యూరోస్టార్ సర్వీసు మాదిరిగా రూపుదిద్దుకొంటున్న ఈ సొరంగమార్గం నదీగర్భానికి 13 మీటర్ల దిగువన, భూమట్టానికి 33 మీటర్ల దిగువన ఉంటుంది. వచ్చే ఏడాది డిసెంబరు కల్లా దీన్ని ప్రారంభిస్తారు. ‘ఈస్ట్ వెస్ట్ కారిడార్కు ఈ సొరంగ నిర్మాణం చాలా కీలకం. చుట్టూ ఉన్న నివాసప్రాంతాలు, కొన్ని సాంకేతిక సమస్యల దృష్ట్యా ఈ నిర్మాణం మాకున్న ఏకైక ప్రత్యామ్నాయం అని కోలగా మె 5. కార్పొరేషన్ జీఎం (సివిల్) శైలేష్ కుమార్ తెలిపారు.

క్విక్  రివ్యు

ఏమిటి : దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగను నిర్మిస్తున్న  పశ్చిమబెంగాల్

ఎవరు : పశ్చిమబెంగాల్ ప్రభుత్వం

ఎక్కడ : శ్చిమబెంగాల్

ఎప్పుడు : డిసెంబర్ 30

సీఆర్పీఎఫ్ సరిహద్దు భద్రతా దళం డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్న లాల్ థావోసేన్ :

సీఆర్పీఎఫ్ డీజీ సుజోయ్ లాల్ థావోసేన్ సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు  డిసెంబర్ 30 ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డీజీగా ఉన్న పంకజ్ కుమార్ సింగ్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఐపీఎస్ బ్యాచ్- 1988 రాజస్థాన్ క్యాడర్ కు  చెందిన పంకజ్ గత ఆగస్టు 31న బాధ్యతలు స్వీకరించారు. సుజోయ్, పంకజ్ మధ్యప్రదేశ్ క్యాడర్ నుంచే బ్యాచ్మేట్లు. పంకజ్ తండ్రి. ప్రకాశ్ సింగ్ సైతం బీఎస్ఎఫ్ డీజీగా పని చేయడం గమనార్హం.

క్విక్  రివ్యు

ఏమిటి : సీఆర్పీఎఫ్ సరిహద్దు భద్రతా దళం డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్న లాల్ థావోసేన్

ఎవరు : లాల్ థావోసేన్

ఎప్పుడు : డిసెంబర్ 30

2022లో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మందిలో మొదటి స్థానంలో నిలిచిన బిల్ గేట్స్ :

సేవా కార్యక్రమాలకు 2022లో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మంది వ్యక్తులు లేదా సంస్థల జాబితాలో బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. ‘ద క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీ’ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ 10మంది ఇచ్చిన విరాళాల మొత్తం 9.3 బిలియన్ డాలర్లు. ఇందులో బిల్ గేట్స్ ఒక్కరే 5 బిలియన్ డాలర్లను బిల్ అండ్ మిలిండా గేట్స్ కు విరాళమిచ్చారు. ఆయన ప్రధానంగా ప్రపంచ ఆరోగ్యం, యూఎస్ విద్యాభివృద్ధి మొదలైన వాటికి దన్నుగా నిలిచారు. ఆమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ తల్లి. అతడి సవతి తండ్రి అయిన జాకీ బెజోస్, మైక్ బెజోస్ లు . 7105 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈ మొత్తాన్ని వార్డు క్యాన్సర్ ఔషదాల పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ కోసం కేటయించారు 474.3 మిలియన్ డాలర్ లను దానం చేసి వారెన్ బఫెట్ తర్వాతి స్థానంలో ఉన్నారు.

క్విక్  రివ్యు

ఏమిటి : 2022లో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మందిలో మొదటి స్థానంలో నిలిచిన బిల్ గేట్స్

ఎవరు : బిల్ గేట్స్

ఎప్పుడు : డిసెంబర్ 30

వార్టన్-క్యూఎస్ రీమాజిన్ ఎడ్యుకేషన్ అవార్డులను గెలుచుకున్న ఐఐటి మద్రాస్ :

అమెరికా లోని ఫిలడెల్ఫియాలోని వార్టన్ క్యాంపస్‌లో ఇటీవల ముగిసిన వేడుకలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటి మద్రాస్) వార్టన్-క్యూఎస్ రీమాజిన్ ఎడ్యుకేషన్ అవార్డులను గెలుచుకుంది. డేటా సైన్స్ మరియు అప్లికేషన్స్‌లో దాని BS ఉత్తమ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ కేటగిరీలో రజతం అందించబడింది. కాగా IIT మద్రాస్‌చే నిర్వహించబడుతున్న IITలు మరియు IIScల సంయుక్త చొరవతో నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్ హాన్స్ డ్ లెర్నింగ్ (NPTEL) జీవితకాల అభ్యాస విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి గారు ఈ అవార్డును గెలుచుకోవడంపై తన ఆలోచనను పంచుకుంటూ, “విద్యార్థులకు వారి స్థానంతో సంబంధం లేకుండా అధిక నాణ్యతకలిగిన విద్యను అందించడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో మా BS ప్రోగ్రామ్ మరియు NPTEL ఉదాహరణలు. మా విద్యార్థులకు అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి మరియు ఆవిష్కరణలను కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

క్విక్  రివ్యు

ఏమిటి : వార్టన్-క్యూఎస్ రీమాజిన్ ఎడ్యుకేషన్ అవార్డులను గెలుచుకున్న ఐఐటి మద్రాస్

ఎవరు : ఐఐటి మద్రాస్

ఎప్పుడు : డిసెంబర్ 30

‘ఈ సృష్టి “ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను ప్రారంబించిన మయాంకేశ్వర్ శరణ్ సింగ్ :

ఉత్తరప్రదేశ్  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మరియు వైద్య విద్య శాఖ సహాయ మంత్రి మయాంకేశ్వర్ శరణ్ సింగ్ 22 రాష్ట్ర వైద్య కళాశాలల్లో ‘ఈ సృష్టి “  అనే ఒక హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS)ని ప్రారంభించారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సిడిఎసి) సహకారంతో రాష్ట్ర వైద్య విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

క్విక్  రివ్యు

ఏమిటి : ఈ సృష్టి “ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను ప్రారంబించిన మయాంకేశ్వర్ శరణ్ సింగ్

ఎవరు : మయాంకేశ్వర్ శరణ్ సింగ్

ఎప్పుడు : డిసెంబర్ 30

ఎన్.ఎల్.సి తాత్కాలిక సిఎం డి గా కలసాని మోహన్ రెడ్డి నియామకం :

ఎన్.ఎల్.సి ఇండియా తాత్కాలిక చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి గా తెలంగాణకు చెందిన కలసాని మోహన్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ సంస్థలో ప్లానింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు.జనవరి 01 న బాద్యతలు స్వీకరిస్తారు.పూర్తి స్థాయి సిఎండిని నియమించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.ఈ మేరకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణా ఆంద్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా ఎన్.ఎస్.సి కీలక భూమిక పోషిస్తుంది.

క్విక్  రివ్యు

ఏమిటి : ఎన్.ఎల్.సి తాత్కాలిక సిఎం డి గా కలసాని మోహన్ రెడ్డి నియామకం

ఎవరు : కలసాని మోహన్ రెడ్డి

ఎప్పుడు : డిసెంబర్ 30

ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ షిప్ లో రజతం గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణి కోనేరు హంపి :

భారత అగ్ర శ్రేణి చెస్ క్రీడాకారిణి తెలుగమ్మాయి కోనేరు హంపి మరోసారి ప్రపంచ వేదికపైన మెరిసింది.ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ షిప్ లో రజతం గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది.తొలి రోజు 09రౌండ్ల తర్వాత 44 వ స్థానం లో ఉన్న ఆమె రెండో రోజు అద్బుత ప్రదర్శనతో అనూహ్యంగా పతక పోటీ లోకి వచ్చింది.17రౌండ్ లలో 12.5 పాయింట్ లతో రెండో స్థానం సాధించింది

క్విక్  రివ్యు

ఏమిటి : ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ షిప్ లో రజతం గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణి కోనేరు హంపి :

ఎవరు : కోనేరు హంపి

ఎప్పుడు : డిసెంబర్ 30

Download Manavidya app

Daily current affairs in Telugu Pdf November - 202
Daily current affairs in Telugu 01-11-2022
>Daily current affairs in Telugu 02-11-2022
Daily current affairs in Telugu 03-11-2022
Daily current affairs in Telugu 04-11-2022</strong>
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 06-11-2022</strong>
Daily current affairs in Telugu 07-11-2022
Daily current affairs in Telugu 08-11-2022
>Daily current affairs in Telugu 09-11-2022
Daily current affairs in Telugu 10-11-2022
Daily current affairs in Telugu 11-11-2022
Daily current affairs in Telugu Pdf October 2022
Daily current affairs in Telugu Pdf Octobe r01 - 2022
Daily current affairs in Telugu Pdf October 02 - 2022
Daily current affairs in Telugu Pdf October03 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October04 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October05 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October 6 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October07 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October08 - 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf October09 - 2022
Daily current affairs in Telugu Pdf October 10 - 2022
Daily current affairs in Telugu Pdf October 11 - 2022
Daily current affairs in Telugu Pdf October 12 - 2022
Daily current affairs in Telugu Pdf October 13 - 2022
Daily current affairs in Telugu Pdf October 14 - 2022
Daily current affairs in Telugu Pdf October 15 - 2022
Daily current affairs in Telugu Pdf October 16 - 2022
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *