Daily Current Affairs in Telugu 12&13-03-2022
గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించిన ప్రమోద్ సావంత్ :

గోవాలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించేందుకు గాను ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు మార్చ్ 12 న తన రాజీనామా లేఖను గవర్నరు అందజేశారు. కొత్త సర్కారు కొలువుదీరే వరకూ తాత్కాలిక సీఎంగా కొనసాగాలని గవర్నర్ పి.ఎస్.శ్రీధరన్ పిళై ఆయనను కోరారు. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో తాజా ఎన్నికల్లో భాజపా పార్టీ 20 స్థానాలను గెలుచుకుని పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కన్నా ఒక్క స్థానం తగ్గింది. దీంతో ముగ్గురు స్వతంత్రులు, ఎంజీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేం, మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సిద్ధమవుతోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించిన ప్రమోద్ సావంత్
ఎవరు: ప్రమోద్ సావంత్
ఎక్కడ: గోవా
ఎప్పుడు: మార్చ్ 12
సుష్మా స్వరాజ్ అవార్డ్ ను ప్రకటించిన హర్యానా రాష్ట్ర మనోహర్ లాల్ ఖట్టార్:

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర బడ్జెట్ను ప్రకటిస్తూ మహిళలకు వారి గణనీయమైన విజయాలకు లేదా వారు చేసిన కృషికి గాను ‘సుష్మాస్వరాజ్’ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు తో పటు సుష్మా స్వరాజ్ ప్రశంసా పత్రంతోపాటు రూ.5 లక్షల అవార్డును అందజేస్తారు. సుప్రీంకోర్టు న్యాయవాది మరియు భారతీయ రాజకీయవేత్త. ఆమె భారతీయ జనతా పార్టీ సీనియర్ సభ్యురాలు, మొదటిసారికేంద్రం లో గెలిచిన నరేంద్ర మోడీ ప్రభుత్వం (2014)(2019) సమయంలో భారత విదేశాంగ మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. అంటే కాక ఇందిరా గాంధీ గారి తర్వాతఆ స్థానం పొందిన మహిళ ఆమె కావడం విశేషం .
క్విక్ రివ్యు :
ఏమిటి: సుష్మా స్వరాజ్ అవార్డ్ ను ప్రకటించిన హర్యానా రాష్ట్ర మనోహర్ లాల్ ఖట్టార్:
ఎవరు: మనోహర్ లాల్ ఖట్టార్
ఎక్కడ: హర్యానా
ఎప్పుడు: మార్చ్ 12
స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్ 21 నివేదికలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము :

నుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మార్చి 8న ‘స్కోచ్’ సంస్థ విడుదల చేసిన “స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్ 21 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలన సంస్కరణలు, అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, సమగ్రాభివృద్ధికి తీసుకున్న చర్యలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ‘స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ 20 నివేదికలోనూ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సర్వేలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వాటిని స్టార్ రాష్ట్రాలుగా గుర్తించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్ 21 నివేదికలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము
ఎవరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము
ఎప్పుడు: మార్చ్ 1
స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ 21 నివేదికలో ఆరో స్థానంలో నిలిచినా తెలంగాణా రాష్ట్రము :

ఇటీవల ప్రకటించిన స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ 21 నివేదికలో మొదటి స్థానం లో ఆంధ్రప్రదేశ్ నిలవగా రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో మహారాష్ట్ర నిలవగా తెలంగాణ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (7), మధ్యప్రదేశ్ (8), అస్సాం (9), హిమాచల్ ప్రదేశ్ (10), బిహార్ (11), హరియ (12) రాష్ట్రాలు వరుసలో ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ 21 నివేదికలో ఆరో స్థానంలో నిలిచినా తెలంగాణా రాష్ట్రము :
ఎవరు: తెలంగాణా రాష్ట్రము
ఎప్పుడు: మార్చ్ 13
రైల్ వైర్ సాథి కియోస్క్ పేరు కో ఈ కొత్త సేవలను ప్రారంబించిన భారతీయ రైల్వే :

భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఒక మంచి శుభవార్త తెలిపింది. రైల్వే ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో పాన్, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా రైల్ వైర్ సాథి కియోస్క్ పేరు కో ఈ కొత్త సేవలను అందించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట వారణాసి, ప్రయాగ్రరాజ్ సిటీ రైల్వే స్టేషన్ లో కామన్ సర్వీస్ సెంటర్లను జనవరిలో రైల్వేశాఖ ప్రారంభించింది. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులు రైల్ వైర్ సాథి కియోస్క్ కేంద్రాల వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్, ఓటరు కార్డు, మొబైల్ రీచార్జ్, రైలు, విమాన, బస్సు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్రాలలో ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధించి పనులకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు అని తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: రైల్ వైర్ సాథి కియోస్క్ పేరు కో ఈ కొత్త సేవలను ప్రారంబించిన భారతీయ రైల్వే :
ఎవరు: భారతీయ రైల్వే
ఎప్పుడు: మార్చ్ 13
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |