Daily Current Affairs in Telugu 10-03-2022
స్కోచ్ అవార్డులలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం నిలిచిన ఏపి పోలిస్ శాఖ :

పోలిస్ రక్షణ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలిస్ శాఖ దేశంలోనే మొదటి స్థానం లో నిలిచింది. స్కోచ్ జాతీయ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన 56 అవార్డులలో ఏపి పోలిస్ శాఖ 23అవార్డులని సొంతం చేసుకుంది. స్వర్ణం తో పాటు ఎనిమిది రజత పతకాలు కూడా సాధింధించింది. మహిలలకు పూర్తి స్థాయి డిజిటలైజ్ విధానంద్వారా క్లిష్టమైన కేసులను చెందించడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంవంటి విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఈ సందర్బంగా డిజిపి రాజేంద్ర నాద రెడ్డి పోలిస్ సిబ్బందిని అబినంధించారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బన్వర్ లాల్ పురోహిత్
క్విక్ రివ్యు :
ఏమిటి: స్కోచ్ అవార్డులలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం లో దక్కిన ఏపి పోలిస్
ఎవరు: ఏపి పోలిస్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు :మార్చ్ 10
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్ తదుపరి అద్యక్షుడిగా ఎన్నికైన టి.రాజా కుమార్ :

సింగపూర్ కు చెందిన టి రాజ కుమార్ రెండు సంవత్సరాలాకు గాను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్ FATF తదుపరి అద్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా ఈయన జులై 01 న 2022 నుంచి పదవి బాద్యతలు స్వీకరించనున్నారు .జర్మని దేశానికి కి చెందిన డాక్టర్ మార్కస్ ఫ్లేయర్ స్థానంలో మిస్టర్ కుమార్ గారుణ్ ఉంటారు.ప్రస్తుతం టి.రాజా కుమార్ 2015 నుంచి FATF సింగపూర్ ప్రతినిధి బృందానికి అధిపతిగా పని చేస్తున్నారు.ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్ ఇది మని లాండరింగ్ ను ఎదుర్కోవదానికి విధానాలను అబివృద్ది చేయడానికి జి-7 చొరవతో 1989 లో స్థాపించబడిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ .
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్ తదుపరి అద్యక్షుడిగా ఎన్నికైన టి.రాజా కుమార్
ఎవరు: టి.రాజా కుమార్
ఎప్పుడు:మార్చ్ 10
మాత్రు శక్తి ఉద్యమిత అనే ఒక పథకాన్ని ప్రారంబించిన హర్యానా రాష్ట్ర ప్రభుత్వం :

హర్యాన రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలకు మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో మాతృ శక్తి ఉద్యమిత అనే ఒక పతాకాన్ని ప్రకటించింది. పరివార్ పెహచాన్ పాత్ర PPP ద్రువికరించ బడిన డేటా ఆదారంగా కుటుంబ వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న మహిళలకు ఈ పథకం కింద రుణాలు అందించబడతాయి.హర్యానా ఉమెన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా మహిళలకు మూడేళ్ళ పాటు 7 %వడ్డీ రాయితీ లబిస్తుంది.
- హర్యాబ రాష్ట్ర రాజధాని :చండీఘర్
- హర్యానా రాష్ట్ర సిఎం: మనోహర్ లాల్ ఖట్టార్
- హర్యానా రాష్ట్ర గవర్నర్ :బండారు దత్తాత్రేయ
క్విక్ రివ్యు :
ఏమిటి: మాత్రు శక్తి ఉద్యమిత అనే ఒక పథకాన్ని ప్రారంబించిన హర్యానా రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు: హర్యానా రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: హర్యానా రాష్ట్ర౦
ఎప్పుడు : మార్చ్ 10
దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నుఏర్పాటు చేయనున్న తమిళనాడు రాష్ట్ర ప్రబుత్వం ;

భారత దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు 150.4 కోట్లతో గారు ప్రారంబించారు.తమిళనాడు రాష్ట్రము లోని తూత్తుకుడి సదరన్ పెట్రో కెమికల్స్ ఇండస్ట్రి కార్పోరేషన్ లిమిటెడ్ SPIC ఫ్యాక్టరి లో ఈ ఫ్లోటింగ్ ఫ్లాంట్ క్లీన్ ఎనర్జీ ని అంది౦చడానికి మరియు కార్బన్ పాదముద్రను తగ్గించడం దీని యొక్క లక్ష్యం.ఈ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ కు ఏడాదికి 42 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే సామర్త్యం ఉంది. సోలార్ పవర్ ప్లాంట్ గ్రీన్ ఎనర్జీ యాజమాన్యంలో ఉంది ఇది AM ఇంటర్ నేషనల్ యొక్క పూర్తి యాజమాన్యం లోని అనుబంధ సంస్థ గా ఉంది .
- తమిళనాడు రాష్ట్ర రాజధాని :చెన్నై
- తమిళనాడు రాష్ట్ర సిఎం; ఎంకే స్టాలిన్
క్విక్ రివ్యు :
ఏమిటి:దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నుఏర్పాటు చేయనున్న తమిళనాడు రాష్ట్ర ప్రబుత్వం
ఎవరు: తమిళనాడు రాష్ట్ర ప్రబుత్వం
ఎక్కడ: తమిళనాడు రాష్ట్ర౦
ఎప్పుడు :మార్చ్ 10
బుకర్ ప్రైజ్ పోటిలో చోటు దక్కించుకున్న తొలి హింది నవల ” టూ౦బ్ ఆఫ్ శాండ్ :

ప్రతిస్తాత్మకమైన అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ పోటీ కోసం ఎంపిక చేసిన 13 రచనలలో రచయిత్రి గీతాంజలి శ్రీ హింది నవల అనువాదం” టూ౦బ్ ఆఫ్ శాండ్” అనేది చోటు దక్కించుకుంది.మార్చ్ 10 న లండన్ లో ఈ జాబితాను ప్రకటించారు.సాహితీ పురస్కారాలలో ఎంతో విశిష్టమైనదిగా భావించే బుకర్ ప్రైజ్ కు పోటీ పడనున్న తొలి హింది కాల్పనిక రచన ఇదే కావడం విశేషం. గీతాంజలి శ్రీ రచన తొలుత రేట్ సమాధి పేరిట ప్రచురితమైనది. డైసి రాక్ వెల్ దీన్ని ఆంగ్లం లోకి అనువదించారు బుకర్ ప్రైజ్ కు ఎంపిక అయితే రూ.50 లక్షలు జిబిపి 50,000 నగదు బహుమానం అందజేస్తారు.దీన్ని రచయిత అనువాదకుడికి సమానంగా పంచుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి:బుకర్ ప్రైజ్ పోటిలో చోటు దక్కించుకున్న తొలి హింది నవల ” టూ౦బ్ ఆఫ్ శాండ్
ఎవరు: గీతాంజలి శ్రీ
ఎప్పుడు : మార్చ్ 10
2022 కి గాను ఇంటర్ నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ అవార్డుకు ఎంపిక ఐన రిజ్వానా హసన్ :

బంగ్లాదేశ్ దేశ పర్యవరణ న్యాయవాది రిజ్వనా హసన్ 2022 కు గాను ఇంటర్ నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ IWOC అవార్డుకు ఎంపికయ్యారు. అసాదారణ మైన ధైర్యాన్ని ప్రదర్శించినందు గాను మరియు యుఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ద్వారా అవార్డు తో సత్కరించబడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 12 మంది మహిలలో ఈమె ఒక్కరు. వారి కమ్యూనిటి లో మార్పు తీసుకురావడానికి నాయకత్వం వహించిన ప్రముఖ మహిళ ఈమె.వారి కమ్యూనిటి లలో మార్పు తీసుకురావడానికి గాను చేసిన కృషికి అసాదరమైన ధైర్యానికి శక్తికి మరియు నాయకత్వం కలిగిన మహిళలను గౌరవించేందుకు ఈ అవార్డును స్థాపించారు. IWOC కార్యక్రమం కింద ఇప్పటి వరకు 80 దేశాల నుంచి 170 మంది మహిళలను సత్కరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2022 కి గాను ఇంటర్ నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ అవార్డుకు ఎంపిక ఐన రిజ్వానా హసన్
ఎవరు: రిజ్వా నా హసన్
ఎక్కడ: బంగ్లాదేశ్
ఎప్పుడు :మార్చ్ 10
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |