
Daily Current Affairs in Telugu 16 May-2022
దేశంలో మొట్టమొదటి గార్టెక్స్ టెక్స్ ప్రాసెస్ ఇండియా ను ప్రారంబించిన కేంద్ర సహాయ మంత్రి దర్శన జర్దోష్ :

గార్టెక్స్ టెక్స్ ప్రాసెస్ ఇండియా లోనే మొట్టమొదటి ముంబై ఎడిషన్‌ను కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ గారు ప్రారంభించారు. ఇది మెస్సే ఫ్రాంక్ఫర్ట్ ఇండియా మరియు MEX ఎగ్జిబిషన్స్ లు సంయుక్తంగా నిర్వహించింది, 120 మంది ఎగ్జిబిటర్ల నుండి వినూత్నమైన మరియు పోటీ ధరల ఉత్పత్తుల ప్రదర్శన ద్వారా భారతీయ వస్త్ర మరియు వస్త్ర పరిశ్రమలో సాంకేతిక పురోగతిని వేగవంతం చేయడం ఈ వాణిజ్య ప్రదర్శన లక్ష్యం. మూడు రోజుల ప్రదర్శన, అతను జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నందున టెక్స్టైల్ మరియు గార్మెంట్ తయారీ యంత్రాలు, డెనిమ్, ట్రిమ్మింగ్లు మరియు స్క్రీన్ ప్రింటింగ్ వర్టికల్స్‌లో ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు.
- మహారాష్ట్ర రాజధాని :ముంబై
- మహారాష్ట్ర సిఎం :ఉద్దావ్ థాక్రే
- మహారాష్ట్ర గవర్నర్ ; భగత్ సింగ్ కోశ్యారి
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలో మొట్టమొదటి గార్టెక్స్ టెక్స్ ప్రాసెస్ ఇండియా ను ప్రారంబించిన కేంద్ర సహాయ మంత్రి దర్శన జర్దోష్
ఎవరు : కేంద్ర జౌళి శాఖా సహాయ మంత్రి దర్శన జర్దోష్
ఎక్కడ: ముంబై
ఎప్పుడు : మే 16
రాయల్ గోల్డ్ మెడల్ 2022ను ను గెలుచుకున్న ప్రముఖ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి :

ప్రముఖ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషికి రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ (RIBA) ద్వారా ఆర్కిటెక్చర్‌కు సంబంధించి ప్రపంచంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన రాయల్ గోల్డ్ మెడల్ 2022ను అందుకున్నారు. అతను భారతదేశం నుండి రాయల్ గోల్డ్ మెడల్ మరియు ప్రిట్జ్ కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ రెండింటినీ పొందిన ఏకైక వ్యక్తి గా నిలిచారు, దీనిని తరచుగా ఆర్కిటెక్చర్ నోబెల్ బహుమతిగా సూచిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : రాయల్ గోల్డ్ మెడల్ 2022ను ను గెలుచుకున్న ప్రముఖ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి
ఎవరు : బాలకృష్ణ దోషి
ఎప్పుడు : మే 16
నాటో కూటమిలో చేరనున్నట్లు ప్రకటించిన స్వీడన్ దేశ ప్రదాని మగ్ధలిన అండర్సన్ :

నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ దేశ ప్రధాని మగ్దలీనా అండర్సన్ మే 16న ప్రకటించారు. తద్వారా 200 ఏళ్లుగా అనుసరిస్త్ను తటస్థ వైఖరికి స్వీడన్ ముగింపు పలుకుతోంది. ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ విధానంలో చరిత్రాత్మక మార్పుగా మగ్దలీనా అభివర్ణించారు. నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్ కు అవసరమన్నారు. నాటోలో చేరికపై సైన్యం ఫిన్లాండ్ లో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నిర్ణయా నికి స్వీడన్ దేశ పార్లమెంట్ కిగెస్ లో భారీ మద్దతు లబించింది. 8 పార్టీల్లో కేవలం రెండు మాత్రమేసానుకూలత చూపాయి.. మిగతావి దీన్ని వ్యతిరేకించాయి. రెండు దేశాల్లో కూడా నాటో చేరికపై ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వీడన్ దేశ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది.
- NATO పూర్తి రూపం :నార్త్ అట్లాంటిక్ ట్రిటి ఆర్గనైజేషన్
- నాటో కూటమి స్థాపన :1949 ఏప్రిల్ 04
- నాటో కూటమి యొక్క సభ్య దేశాల సంఖ్య : 30 దేశాలు
- నాటో ప్రధాన కార్యాలయం :బ్రసెల్స్
క్విక్ రివ్యు :
ఏమిటి : నాటో కూటమిలో చేరనున్నట్లు ప్రకటించిన స్వీడన్ దేశ ప్రదాని మగ్ధలిన అండర్సన్
ఎవరు : స్వీడన్ దేశ ప్రదాని మగ్ధలిన అండర్సన్
ఎప్పుడు : మే 16
ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎలిస బెత్ బోర్న్ నియామకం :

ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా ఎలిస బెత్ బోర్న్ (81) మే 16న నియమితులయ్యారు. ఫ్రాన్స్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళ జోర్న్ కావడం విశేషం. అధ్యక్షునిగా ఇమాన్యుయల్ మెక్రాన్ ఇటీవల రెండోసారి ఎన్నికైన నేపథ్యంలో ప్రధాని జీన్ కాసెర్చ్ తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన మెక్రాన్, ఆయన స్థానంలో బోర్నను ప్రధానిగా నియమించారు. 2017లో మెట్రా నీకు చెందిన ‘ఎన్ మారో” పార్టీ తీర్థం పుచ్చుకున్న బోర్న్ 2018 రవాణాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి కార్మికశాఖ మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. జూన్ లో పార్లమెంటరీ ఎన్నికలు ఉన్నంతలో నే ప్రధాని మార్పు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. 1901-1982 లో ఎడిత్ డ్రెస్సున్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పనిచేశారు.
- ఫ్రాన్స్ దేశ రాజధాని : ప్యారిస్
- ఫ్రాన్స్ దేశ కరెన్సీ : యూరో
- ఫ్రాన్స్ దేశ అద్యక్షుడు : ఇమ్మాన్యుయేల్ మక్రోన్
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎలిస బెత్ బోర్న్ నియామకం
ఎవరు : ఎలిస బెత్ బోర్న్
ఎక్కడ: ఫ్రాన్స్
ఎప్పుడు : మే 16
యూనిసెఫ్ సుహృద్భావ రాయబారిగా ఇరవై సంవత్సరం కొనసాగనున్న క్రికెటర్ సచిన్ :

భారత దేశ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ యూనిసెఫ్ సుహృద్భావ రాయబారిగా రికార్డుస్థాయిలో 20వ సంవత్సరం కూడా కొనసాగనున్నారు. ఈ హోదాలో ఆయన గత రెండు దశాబ్దాలుగా పేదపిల్లల సంక్షేమానికి అవిరళ కృషి చేస్తున్నారు. “ఇంతకాలం యూనిసెప్ తో తో కలిసి పనిచేయడం గొప్ప విషయం మా బృందం చేసిన ప్రభావవంమైన కార్యక్రమాలకు సంబంధించి ఎన్నో మధుర మైన జ్ఞాపకాలు ఇందులో ఉన్నాయి. పిల్లల కలలకు రెక్కలిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. మా తదుపరి దశ బాగస్వామ్యం కోసం ఎదురుచూస్తు.న్నాను” అని సచిన్ టెండూల్కర్ మే 16న ట్వీట్ చేశారు.
- యునిసెఫ్ పూర్తి రూపం : యునైటెడ్ నేషన్స్ ఇంటర్ నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జన్సీ ఫండ్
- యునిసెఫ్ స్థాపన : 1946 డిసెంబర్ 11
- యునిసెఫ్ ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
- యునిసెఫ్ యొక్క అద్యక్షుడు :తోరే హ్యాట్ ట్రేమ్
క్విక్ రివ్యు :
ఏమిటి : యూనిసెఫ్ సుహృద్భావ రాయబారిగా ఇరవై సంవత్సరం కొనసాగనున్న క్రికెటర్ సచిన్
ఎవరు : క్రికెటర్ సచిన్ తెందుల్కర్
ఎప్పుడు : మే 16
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |