
Daily Current Affairs in Telugu 21 -April-2022
ఆసియా క్రీడలకు ఎంపికై రికార్డ్ సృష్టించిన బ్యాడ్మింటన్ టీనేజ్ సంచలనం ఉన్నతి హుడా :

బ్యాడ్మింటన్ టీనేజ్ సంచలనం ఉన్నతి హుడా ఈ ఏడాది ఆసియా క్రీడలకు ఎంపికైంది. 14ఏళ్ల ఈ రోహితక్ కు చెందిన ఈ బాలిక, ఆసియా క్రీడల బృందంలో అత్యంత పిన్న వయస్సు కలిగిన భారత షట్లర్ గా నిలిచింది. ఆసియా, కామన్వెల్త్ క్రీడలు, థామస్ అండ్ ఉబర్ కప్‌లో పాల్గొనే పట్లర్ల ఎంపిక కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆరు రోజులుగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ యొక్క ప్రదర్శన ఆధారంగా పైన పేర్కొన్న మూడు టోర్నీలకు ఏప్రిల్ 21న జట్లను ప్రకటించింది. సింగిల్స్ లో మూడో స్థానంలో నిలిచిన ఉన్నతి. ఆసియా క్రీడలతో పాటు ఉబర్ కప్‌నకు ఎంపికైంది. అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధుతో పాటు లక్ష్యసేన్ కిదాంబి శ్రీకాంత్ జట్లను నడిపించనున్నారు. మరోవైపు గాయత్రి పుల్లెల వ్రీసా జోడీ బ్రయల్స్ లో అగ్రస్థానంలో నిలిచి ఈ మూడు టోర్నీల్లో పోటీపడే జట్లలో చోటు దక్కించుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా క్రీడలకు ఎంపికై రికార్డ్ సృష్టించిన బ్యాడ్మింటన్ టీనేజ్ సంచలనం ఉన్నతి హుడా
ఎవరు : ఉన్నతి హుడా
ఎప్పుడు ; ఏప్రిల్ 21
విజ్డెన్ ప్రకటించిన 2022 గాను ఉత్తమ క్రికెటర్ లు ఎంపికైన రోహిత్ శర్మ ,బూమ్రా :

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ బుమ్రా 2022కి గాను విజ్డెన్ ప్రకటించిన ఈ ఏటి మేటి క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతేడాది ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని విజ్డెన్ అయిదుగురు క్రికెటర్లను ఈ అవార్డు కోసం ఎంపిక చేసింది. అందులో రోహిత్, బుమ్రాతో పాటు డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), ఇంగ్లాండ్ పేసర్ రాబిన్సన్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ వాన్ నీకెర్క్ ఉన్నారు. మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ప్రపంచంలోనే మేటి క్రికెటర్ ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్లీ లీ మేటి మహిళా క్రికెటర్, పాకిస్తాన్ వికెట్కేపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ మేటి టీ20 క్రికెటర్ గా నిలిచారు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో గొప్పగా రాణించిన బుమ్రా లార్డ్స్ టీమ్ ఇండియా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపల్ లో మ్యాచ్ గెలిపించే ప్రదర్శన చేశారు. ఓవల్ మ్యాచ్ ను గెలిపించే ప్రదర్శన చేశాడు. రోహిత్ నాలుగు టెస్టుల్లో 52.57 సగటుతో 368 పరుగులు చేశాడు. ఓవల్ లో సెంచరీతో విదేశాల్లో తొలి టెస్టు శతకం అందుకున్నాడు. ఈ అయిదు మ్యాచ్‌లో సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం విదితమే. అయిదో టెస్టు ఈ ఏడాది జులైలో జరగనుంది. మరోవైపు నిరుడు టెస్టుల్లో చెలరేగిన రూట్ 1,708 పరుగులు చేశాడు. ఓ క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2021లో 27 టీ20ల్లో రిజ్వాన్ 72 88 సగటుతో 1329 పరుగులు చేసి, పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఏడాదిలో వెయ్యి అంతర్జాతీయ పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్ చరిత్ర నమోదు చేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: విజ్డెన్ ప్రకటించిన 2022 గాను ఉత్తమ క్రికెటర్ లు ఎంపికైన రోహిత్ శర్మ ,బూమ్రా
ఎవరు : రోహిత్ శర్మ ,బూమ్రా
ఎప్పుడు ; ఏప్రిల్ 21
‘జాన్ ఎఫ్ కెన్నడీ’ పురస్కారానికి ఎంపికైన ఉక్రయిన్ దేశ అధ్యక్షుడు జేలేన్స్కి :

ప్రజాస్వామ్య పరిరక్షణకు గాను కృషి చేస్తున్నవారికి ఇచ్చే ‘జాన్ ఎఫ్ కెన్నడీ’ పురస్కారానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి ఎంపికయ్యారు. ఆయనతో సహా మొత్తం ఐదుగురిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు సంబంధిత ఫౌండేషన్ ప్రకటించింది. చావో రేవో అన్నట్లుగా దేశం కోసం ఆయన పోరాడుతున్నారని కొనియాడింది. మిగిలిన నలుగురు అమెరికాలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి దోహదపడ్డారని తెలిపింది. మే 22న వీటిని బోస్టన్‌లో ప్రధానం చేస్తారు.
- ఉక్రయిన్ దేశ రాజధాని :కీవ్
- ఉక్రయిన్ దేశ కరెన్సీ :ఉక్రయిన్ హ్రివ్నియ
- ఉక్రయిన్ దేశ అద్యక్షుడు : వోలోదిమిర్ జేలేస్కి
క్విక్ రివ్యు :
ఏమిటి: జాన్ ఎఫ్ కెన్నడీ’ పురస్కారానికి ఎంపికైన ఉక్రయిన్ దేశ అధ్యక్షుడు జేలేన్స్కి
ఎవరు : ఉక్రయిన్ దేశ అధ్యక్షుడు జేలేన్స్కి
ఎప్పుడు ; ఏప్రిల్ 21
కర్ణాటక- బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప నియామకం :

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిమ్హాన్స్ మరియు నీతి ఆయోగ్ సహ్యా కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ (కా-బీ) ని ప్రారంభించింది. కర్ణాటక- బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ (KaBHI) బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెటర్ రాబిన్ ఉతప్పను కర్ణాటక నియమించింది. బెంగుళూరు అర్బన్‌లోని జయనగర్ జనరల్ ఆసుపత్రి, కోలార్ లోని ఎస్ఎన్ఆర్ ఆసుపత్రి మరియు చిక్ బల్లాపూర్ లోని జిల్లా ఆసుపత్రి వంటి మూడు పైలట్ ఆసుపత్రులలో వైద్యుల శిక్షణ మరియు బ్రెయిన్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించబడ్డాయి.
- కర్ణాటక రాష్ట్ర రాజధాని : బెంగళూర్
- కర్ణాటక రాష్ట్ర సిఎం : బసవరాజ్ బొమ్మై
- కర్నాటక రాష్ట్ర గవర్నర్ : థావర్ చాంద్ గెహ్లాట్
క్విక్ రివ్యు :
ఏమిటి: కర్ణాటక- బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప నియామకం
ఎవరు : భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప
ఎక్కడ: కర్ణాటక
ఎప్పుడు ; ఏప్రిల్ 21
అస్సాం లో ఏర్పాటు చేయనున్న స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ను తయారు చేయగల పైలట్ ప్లాంట్ :

దేశంలోనే తొలిసారిగా క్లెయిమ్ చేయబడిన 99, 999 శాతం స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ను తయారు చేయగల పైలట్ ప్లాంట్ ను అస్సాం రాష్ట్రములోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) ఏప్రిల్ 21న ప్రారంభించింది.మూడు నెలల రికార్డు సమయంలో దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ-యాజమాన్య చమురు సంస్థ దీనిని ప్రారంభించింది. దీని కోసం దేశంలో మొదటి సారిగా గ్రీన్ హైడ్రోజన్ 100 kW Anion Exchange Membrate (AEM) ఎలక్ట్రోలైజర్ అనే టెక్నాలజీని ఉపయోగించారు.
- అస్సాం రాష్ట్ర రాజధాని : దిస్పూర్
- అస్సాం రాష్ట్ర సిఎం : హిమంత బిశ్వా శర్మ
క్విక్ రివ్యు :
ఏమిటి: అస్సాం లో ఏర్పాటు చేయనున్న స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ను తయారు చేయగల పైలట్ ప్లాంట్
ఎవరు : అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: అస్సాం
ఎప్పుడు ; ఏప్రిల్ 21
సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా ఏప్రిల్ 21 :

భారతదేశంలో ‘సివిల్ సర్వీసెస్ డే’ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 తేదిన సమాజానికి వారు చేసిన సేవ కు గనుసివిల్ సర్వెంట్లందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా జరుపుకుంటారు మరియు పౌర సేవకులు పౌరుల యొక్క ప్రయోజనాల కోసం తమను తాము పునరంకితం చేసుకోవడానికి మరియు వారి కట్టుబాట్లను పునరుద్ధరించుకుంటారు. ప్రజాసేవకు 1947లో డిల్లీలోని మెట్కాల్ఫ్ హౌస్‌లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ల ప్రొబేషనర్లను ఉద్దేశించి స్వతంత్ర భారత మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారు ప్రసంగించిన రోజు జ్ఞాపకార్థం ఏప్రిల్ 21వ తేదీని ఎంచుకున్నారు. తన చిరునామాలో, అతను సివిల్ సర్వెంట్లను ‘స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా’ అని పిలిచాడు.
క్విక్ రివ్యు :
ఎవరు : దేశ వ్యాప్తంగా
ఏమిటి: సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా ఏప్రిల్ 21
ఎప్పుడు ; ఏప్రిల్ 21
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |