Daily Current Affairs in Telugu 24 May-2022
డబ్ల్యు హెచ్ వో కి సంస్థ డైరెక్టర్ గా మల్లి తిరిగి ఎన్నికైన టేద్రోస్ అథనోమ్ :

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో) డైరెక్టర్ జనరల్ పదవికి టెడ్రోస్ అథనోమ్ వరుసగా రెండోసారి ఎన్ని కయ్యారు. ఆయన నియామకానికి ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. కరోనా పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పదవికి ఇతరులెవరూ పోటీపడలేదు. దీనితో టెడ్రోస్ మరో ఐదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.
- WHO పూర్తి రూపం :వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
- WHO స్థాపన : 1948 ఏప్రిల్ 07
- WHO ప్రధాన కార్యాలయం : జెనివా (స్విట్జర్ ల్యాండ్ )
- WHO డైరెక్టర్ జనరల్ : టేద్రోస్ అథనోమ్
క్విక్ రివ్యు :
ఏమిటి: డబ్ల్యు హెచ్ వో కి సంస్థ డైరెక్టర్ గా మల్లి తిరిగి ఎన్నికైన టేద్రోస్ అథనోమ్
ఎవరు: టేద్రోస్ అథనోమ్
ఎక్కడ: జెనివా
ఎప్పుడు :మే 24
డబ్ల్యు.హెచ్ వో కీలక కమిటి చైర్మన్ గా రాజేష్ భూషణ్ నియమాకం :

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేక్ భూషణ్ గారు డబ్ల్యూహెచ్ఎకు చెందిన కీలమైన కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. 194 దేశాలు సభ్యులుగా ఉన్న డబ్ల్యూహెచో 75వ సమావేశాలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ నెల 22న ప్రారంభమయ్యాయి 28 వరకు కొనసాగుతాయి. ఆరోగ్య రంగానికి సంబంధించిన సవాళ్లను ప్రతి ఏడాది వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్ఎ) సమీక్షిస్తుంటుంది. రెండు కమిటీ (ఏబి)ల ద్వారా డబ్ల్యూహెచ్.వో పనిచేస్తుంటుంది. వీటిలో రెండో కమిటీ చైర్పర్సన్ గా రాజేశ్ భూషణ్ గారు నియమకం అయ్యారని డబ్ల్యూహెచ్ ఒక ప్రకటనలో తెలిపారు. భూషణ్ నేతృత్వంలోని కమిటీ(బి) ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబందంచిన పరిపాలన, ఆర్ధిక వ్యవహారాలను చర్చించి వాటి సమీక్షలకు సంబంధించిన సమాచారం ప్రకటిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డబ్ల్యు.హెచ్ వో కీలక కమిటి చైర్మన్ గా రాజేష్ భూషణ్ నియమాకం :
ఎవరు: రాజేష్ భూషణ్
ఎప్పుడు :మే 24
అంతర్జాతియ పర్యాటక సూచిలో 46 వ స్థానం లో నిలిచిన భారత్ :
అంతర్జాతీయ ప్రయాణాలు, పర్యాటక సూచీలో 2019 నాటికి 46వ స్థానంలో ఉన్న భారత దేశం 2021 లో 54వ స్థానానికి పడిపోయింది. దక్షిణాసియాలో మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ భారతదేశమే అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రయాణాలు, పర్యాటకరంగ అభివృద్ధిపై ప్రపంచ ఆర్థిక వేదిక 117 దేశాల్లో ద్వై వార్షిక అధ్యయనం జరుపుతోంది 2021లో ఈ దేశాలన్నింటిలోకీ జపాన్ దే అగ్రస్థానంగా ఉంది. ఈ జాబితాలో 10 అగ్రగామి దేశాలుగా జపాన్ తోపాటు అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ దేశాలు నిలిచాయి. ఇవన్నీ సంపన్న దేశాలు కావడం గమనార్హం కరోనా మహమ్మారి వల్ల కుదేలైనవి ప్రయాణాలు, పర్యాటక రంగం టీకాల కార్యక్రమం వేగం పుంజుకోవడంతో నెమ్మదిగా కోలుకొంటున్నట్లు అధ్యయనం తేల్చింది. స్వదేశంలోనే విహార యాత్రలు, ప్రకృతి ఆధారిత పర్యాటకం పెరగడమూజరిగింది. కరోన తీవ్రత తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా ప్రయాణాలు స్థిరమైన వసతులు కల్పించడం లో పలు దేశాలు కృష్టి చేయాలనీ ప్రపంచ ఆర్థికవేత్తలు నివేదించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతియ పర్యాటక సూచిలో 46 వ స్థానం లో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు :మే 24
ఇండో ఫసిఫిక్ జిల్లాల్లో పరస్పర సహకార ఒప్పందంపై జరిగిన క్వాడ్ సమవేశం :

ఇండో-పసిఫిక్ జలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా సభ్యదేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకుగాను కొత్తగా ‘ఇండో-పసిఫిక్ నౌకాదళరంగ అవగాహన (ఐపీఎండీఏ)’ కార్యక్రమానికి క్వాడ్ శ్రీకారం చుట్టింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలను పరిరక్షించేందుకు ఇది దోహదపడనుంది. ఇది ఇండో-పసిఫిక్ దేశాలతో సంప్రదింపులు జరుపతూ ముందుకెళ్లేందుకు, హిందూ మహాసముద్రం, ఆగ్నేయాసియా, పసిఫిక్ దీవుల్లోని ప్రాంతీయ సమాచార సమీకరణ కేంద్రాలతో సమన్వయం చేసుకునేందుకు ఏపీఎండీఏ ఉపయోగపడుతుందని క్యాడ్ టీ సంయుక్త ప్రకట నలో పేర్కొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విపత్తులను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకుగాను ‘మానవతా సహాయం, విపత్తు సహాయ చర్యలపై క్వాడ్ భాగస్వామ్యం (హెచ్ఎడీఆర్) ఏర్పాటును కూడా తాజాగా ప్రకటించారు.
- క్వాడ్ పూర్తి రూపం :క్వడ్రిలేటరల్ సెక్రటరి డైలాగ్
- క్వాడ్ స్థాపన ; 2007
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండో ఫసిఫిక్ జిల్లాల్లో పరస్పర సహకార ఒప్పందంపై జరిగిన క్వాడ్ సమవేశం
ఎవరు: క్వాడ్ సమవేశం
ఎప్పుడు :మే 24
అత్యున్నత సేవ మెడల్ అబ్దుల్లా ఫోటో తొలగ్స్తూ నిర్ణయం తీసుకున్న జమ్మూ కాశ్మీర్ :

అత్యున్నత పోలీస్ సేవా మెడల్ విషయంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ సేవలకు గాను పోలీసులకు అందించే పోలీస్ సేవా మెడల్ పై ఉన్న షేక్ అబ్దుల్లా ఫొటోను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. షేక్ అబ్దుల్లా ఫొటోకి బదులు దేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని చెక్కనున్నారు. కాశ్మీరు సింహంగా చెప్పబడే షేక్ మొహమ్మద్ అబ్దుల్లా జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ, , ముఖ్య మంత్రి గా ఉండేవారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అత్యున్నత సేవ మెడల్ అబ్దుల్లా ఫోటో తొలగ్స్తూ నిర్ణయం తీసుకున్న జమ్మూ కాశ్మీర్
ఎవరు: జమ్మూ కాశ్మీర్
ఎక్కడ: జమ్మూ కాశ్మీర్
ఎప్పుడు :మే 24
మంకి పాక్స్ బాదితులకు 21 రోజులు క్వారంటైన్ విధింపు ప్రకటించిన మొదటి దేశం బెల్జియం :

మంకీపాక్స్ అనేది వైరల్ జూనోటిక్ సంబంధిత వ్యాధి మరియు దాని లక్షణాలలో కొన్ని ప్రత్యేకమైన ఎగుడుదిగుడు దద్దుర్లు, జ్వరం, కండరాలు నొప్పి మరియు తలనొప్పి వస్తాయి. .మే 22వ తేదీ నాటికి WHO 12 వేర్వేరు దేశాల నుండి 100 మంకిపాక్స్ కేసులను నమోదు చేసింది.కాగ దీనిలో ఈ మంకీ పాక్స్ కేసు బాధితులకు ఇరవైఒక రోజులపాటు క్వారంటైన్ విదింపు ప్రకటిస్తూ బెల్జియం దేశం నిర్ణయం తీసుకుంది.
- బెల్జియం దేశ రాజధాని :బ్రసెల్స్
- బెల్జియం దేశ కరెన్సీ: యూరో
- బెల్జియం ప్రధానమంత్రి: అలెగ్జాండర్ డి క్రూ.
క్విక్ రివ్యు :
ఏమిటి: మంకి పాక్స్ బాదితులకు 21 రోజులు క్వారంటైన్ విధింపు ప్రకటించిన మొదటి దేశం బెల్జియం
ఎవరు: బెల్జియం
ఎప్పుడు :మే 24
పేటిఎఎం యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయిన విజయ్ శేఖర్ :

ఫిన్లెక్ దిగ్గజం పే.టి.ఎం యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా, విజయ్ శేఖర్ శర్మ గారిని 5 సంవత్సరాల కాలానికి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEOగా తిరిగి నియమించింది. డిసెంబర్ 19, 2022 నుండి డిసెంబర్ 18, 2027 వరకు అమల్లోకి వచ్చే ఈ ఐదేళ్ల పదవీకాలానికి విజయ్ శేఖర్ శర్మ నియామకాన్ని తమ బోర్డు ఆమోదించిందని కంపెనీ తెలిపింది. కాగా పేటియం ప్రధాన కార్యాలయం: నోయిడా, ఉత్తర ప్రదేశ్ లో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పేటిఎఎం యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయిన విజయ్ శేఖర్
ఎవరు: విజయ్ శేఖర్
ఎప్పుడు :మే 24
ఆస్ట్రేలియా దేశ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ గా నియమితుడైన వెటోరి :

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ వెటోరి ఆస్ట్రేలియా క్రికెట్ బట్టు అసిస్టెంట్ కోచ్గా నియమితుడయ్యాడు. ఆటగాడిగా కోచ్ గా వెటోరికి అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం ఉంది. ముఖ్యంగా అన్ని ఫార్మాట్లు ఆడటం, తదనంతరం కోచ్ గ, మెంటార్ గా వ్యవహరించిన వెటోరి యొక్క వ్యూహరచన, కోచింగ్ వ్యవహార శైలి అద్భుతం. అందుకే అతన్ని మా సహాయ సిబ్బందిలో భాగస్వామిని చేశాం అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
- న్యూజిల్యాండ్ దేశ రాజధాని :వెల్లింగ్టన్
- న్యుజిల్య్లాండ్ దేశప్రధాని : జేసిండా ఆర్డెం
- న్యూజిల్యాండ్ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ : కెన్ విలియంసన్
- న్యూజిల్యాండ్ దేశ ప్రధాన కోచ్ :గ్యారీ రేమాండ్ స్టీద్
- ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ :ప్యాట్ కమ్మిన్స్
- ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ :అండ్రూ మెక్ డోనాల్డ్
క్విక్ రివ్యు :
ఏమిటి: న్యూజిలాండ్ దేశ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ గా నియమితుడైన వెటోరి
ఎవరు: వెటోరి
ఎక్కడ: న్యూజిల్యాండ్
ఎప్పుడు :మే 24
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |