
Daily Current Affairs in Telugu 19 May-2022
భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగ గా ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణా రాష్ట్రము :

జీవితమంతా దళితుల అబివృద్దికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది.ఈ నెల 22 న భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో వర్మ జయంతిని ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు సాదారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జరీ చేసింది.1906-33 మద్య కాలంలో హైదరబాద్ సంస్థానం లో 26దళిత పాతశాలలను భాగ్యరెడ్డి వర్మ గారు స్థాపించారు. బాలికల విద్య కోసం విశేష కృషి చేసారు. 1906లో ఇసామియా బజార్ లో బాలికల విద్య కోసం జగన్ మిత్ర మండలి ఏర్పాటు చేసారు. 1910 జగన్ మిత్ర మండలి కార్యాలయంలో మొదటిసారిగా ప్రాథమిక పాటశాల ను స్థాపించాడు. భాగ్య రెడ్డి వర్మ అలా ఏడు పాటశాలలు వరుసగా ఏర్పాటు చేసి 1992లో రెసిడెన్సి మెమోరియల్ దగ్గర మరో పాటశాలను 30 మంది ప్రారంబించారు. ఈవిదంగా మొత్తం మీద ఆది హిందు పాటశాల సంఖ్య 26 కు చేరింది. ఈ నెల 26 పాటశాలలో దాదాపు 2500 మంది విద్యార్థులు అబ్యసించేవారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగ గా ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణా రాష్ట్రము
ఎవరు: తెలంగాణా రాష్ట్రము
ఎక్కడ: తెలంగాణా రాష్ట్ర౦ లో
ఎప్పుడు: మే 19
బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశనికి అతిత్య ఇచ్చిన చైనా దేశం :

విడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాల మే 19న రోజు చైనా ఆతిత్యం ఇచ్చింది.ఈ సమావేశానికి చైన దేశ కౌన్సిలర్ మరియు విదేశాంగ మంత్రి వాంగ్ యి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంభందాలు మరియు సహకార మంత్రి నలేడి పందోర్ బ్రెజిల్ విదేశాంగ మంత్రి కార్లోస్ అల్బెర్టో ఫ్రాంకో ఫ్రాంకా మరియు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్ లు హయరయ్యారు.ఈ సమవేశం 14 వ బ్రిక్స్ సదస్సుకు రంగం సిద్దం చేసింది. జనవరి 2022 లో బ్రిక్స్ చైర్మన్ షిప్ ను భారతదేశం చైనా కు అప్పగించింది. బ్రిక్స్ అనేది ఐదు ప్రధాన అబ్రివ్రుద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థకు అనుసందానం చేయడానికి రూపొందించిన సంక్షిప్త నామం.బ్రెజిల్ రష్యా ఇండియా చైనా మరియు దక్షిణాఫ్రికా బ్రిక్స్ సభ్యులు ప్రాంతీయ వ్యవహార౦పైన గణనీయమైన ప్రభావం చూపుతుంది. కాగా 2009 నుంచి BRICS దేశాలు ఏటా అధికారిక శికరాగ్ర సమావేశాలలో సమావేశం అవుతున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశనికి అతిత్య ఇచ్చిన చైనా దేశం
ఎవరు: చైనా దేశంఎక్కడ:
ఎప్పుడు: మే 19
బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్ :

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ స్వర్ణం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఒక్కొక్కరిని మట్టి కరిపిస్తూ ఫైనల్ కు దూసుకొచ్చిన నిఖత్. మే 19న హోరాహోరీగా సాగిన 52 కేజీల విభాగం లో ఫైనల్లో 5-0తో జిడ్పాంగ్ జటామస్ (థాయ్ లాండ్)ను ఓడించింది. మెరుపు వేగంతో ప్రత్యర్థి పై విరుచుకుపడ్డ జరీన్ రింగ్లో విజయనాదం చేసింది. మేరీకోమ్ పోటి పడే విభాగంలోనే ఆడనం వల్ల ఒక స్థాయికి మించి ఎదగలేకపోయిన నిఖత్ ఇప్పుడు ఆ విభాగంలోనే స్వర్గం నెగ్గి ఈ దిగ్గజ క్రీడాకారిణికి సరైన వారసురాలిని తానే అని చాటింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
ఎవరు: నిఖత్ జరీన్
ఎప్పుడు: మే 19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాద్యతలు స్వీకరించిన ముకేష్ కుమార్ మీనా ;

ఏపి రాష్ట్ర ఎన్నికల అధి కారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు మే 19న మద్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఈవోగా కొనసాగిన కె.విజయానంద్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం విజయానంద్. మీనాను సత్కరించి అభినందించారు. ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని పరిచయం ‘ చేశారు. 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మీనా ప్రధాన ఎన్నికల అది కారిగా నియమితులవటం విశేషం
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాద్యతలు స్వీకరించిన ముకేష్ కుమార్ మీనా
ఎవరు: ముకేష్ కుమార్ మీనా
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: మే 19
సంచార పశు వైద్యశాలలను ప్రారంబించిన ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి :

సంచార పశు వైద్యశాలలను సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతలో రూ. 143 కోట్లతో 175 పశువుల అంబులెన్సులు కొనుగోలు చేశారు. రెండోదశలో రూ.135 కోట్ల వ్యయంతో త్వరలో మిగిలిన 165 పశువుల అంబులెన్స్ లను ఏర్పాటు టు చేయనున్నారు. పాడి రైతుల, గొర్రెల, మేకల పెంపకందార్ల గుమ్మం వద్ద. అనారోగ్యానికి గురైన పశువులకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రెండు ప్రస్తుతానికి ఒకటి) చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు వైద్యశాల’ (పశువుల అంబులెన్స్) వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి౦ది.కాగా ఈ వాహనంలో 20 రకాల పేడ సంబంధిత టెస్టులు, 15 రకాల బ్లడ్ టెస్టులు చేసే ల్యాబ్ ఉంటుంది. ఇక పశువులు అనారోగ్యానికి గురైతే 1962 టోల్ ఫ్రీ వెంబర్కు కాల్ చేయవచ్చు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సంచార పశు వైద్యశాలలను ప్రారంబించిన ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఎవరు: సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: మే 19
నాటో కూటమిలో చేరడానికి తమ దరఖాస్తు ల ను అందజేసిన స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు :

నాటో కూటమిలో చేరడానికి స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు తమ దరఖాస్తు లను మే 19 న అధికారికంగా నాటోకు అందజేశాయి. నాటో చీఫ్ జెన్స్ స్టోల్డెన్బర్గ్ ఇరు దేశాల రాయబారుల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ‘ఇది చరిత్రాత్మక పరిణామం’ అని అభివర్ణించారు. ‘ఈ రోజు చాలా మంచి రోజు. మన భద్రతకు సంబంధించి ఇది కీలక క్షణం అని దరఖాస్తులను స్వీకరిస్తూ వ్యాఖ్యానించారు. కాగా, నాటోలో ఏదైనా దేశం సభ్యత్వం పొందాలంటే ఇప్పటికే సభ్యులుగా ఉన్న 30 దేశాలు ఆమోదం తెలపాలి, అయితే, స్వీడన్, ఫిన్లాండ్ చేరికపై టర్కీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. టర్కీని ఒప్పిస్తే ఈ రెండు దేశాలు నాటోలో చేరే ప్రక్రియ ఐదారు నెలల్లో పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. కాగా ఫిన్లాండ్ సరిహద్దులకు అణ్వస్త్ర సామ ర్థ్యమున్న క్షిపణులను తరలిస్తున్నది.
క్విక్ రివ్యు :
ఏమిటి: నాటో కూటమిలో చేరడానికి తమ దరఖాస్తు ల ను అందజేసిన స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు
ఎవరు: స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు
ఎప్పుడు: మే 19
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |