
Daily Current Affairs in Telugu 15-03-2022
ప్రతిష్టాత్మక చాంపియన్ షిప్ లో అరుదైన ఘనత సాధించిన భారత గోల్ఫర్ :

భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి ప్రైజ్ మనీ విషయంలో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక గోల్ఫ్ టోర్నీ ‘ప్లేయర్స్ చాంపియన్షిప్’లో అతను రన్నరప్ గా నిలిచాడు. ఒక్క షాట్ తేడాతో అతను విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోగ ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ స్మిత్ టైటిల్ సాధించాడు. రన్న రప్ గా నిలవడం ద్వారా లాహిరికి 2.18 మిలియన్ డాలర్లు (సుమారు రూ.16.66 కోట్లు) బహుమతిగా లభించాయి. భారత క్రీడల చరిత్రలో ఏ క్రీడాంశంలోనైనా వ్యక్తిగత విభాగంలో ఒక ఆటగాడు సాధించిన అత్యధిక బహుమతి మొత్తం ఇదే కావడం విశేషం. గతంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ విజేతగా నిలిచిన రెండు సందర్భాల్లో 168 మిలియన్ డాలర్లు. 11.53 మిలియన్ డాలర్లు చొప్పున అందుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక చాంపియన్ షిప్ లో అరుదైన ఘనత సాధించిన భారత గోల్ఫర్
ఎవరు: భారత గోల్ఫర్
ఎక్కడ: అనిర్బన్ లాహిరి
ఎప్పుడు : మార్చ్ 15
డిల్లి క్యాపిట ల్స్ జట్టు కు అసిస్టెంట్ కోచ్ గా ఎంపికైన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ :

మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించనున్నాడు. 41 ఏళ్ల వాట్సన్ కోచింగ్లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. ఢిల్లీ హెడ్ కోచ్ పాంటింగ్తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్లు ఆత్రే. అగార్కర్లతో కలిసి అతను పని చేస్తాడు. 2008 నుంచి 2020 వరకు రాజస్తాన్, బెంగళూరు, చెన్నై, జట్ల తరఫున వాట్సన్ మొత్తం 145 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డిల్లి క్యాపిట ల్స్ జట్టు కు అసిస్టెంట్ కోచ్ గా ఎంపికైన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ :
ఎవరు: షేన్ వాట్సన్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : మార్చ్ 15
పంజాబ్ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది అన్మోల్ రతన్ సింగ్ నియామకం :

పంజాబ్ కొత్త అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది అన్మోల్ రతన్ సింగ్ సిద్ధూ నియమితులయ్యారు. సీనియర్ న్యాయవాది దీపిందర్ సింగ్ పట్వాలియా తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కనీసం 5 సార్లు పనిచేసిన సీనియర్ అడ్వకేట్ సిద్ధూ పేరును పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులైన భగవంత్ మాన్ క్లియర్ చేశారు.
- పంజాబ్ రాష్ట్ర రాజధాని :చండీఘడ్
- పంజాబ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వా భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: పంజాబ్ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది అన్మోల్ రతన్ సింగ్ నియామకం
ఎవరు: అన్మోల్ రతన్ సింగ్
ఎక్కడ: పంజాబ్ రాష్ట్రం
ఎప్పుడు : మార్చ్ 15
మారిషస్ యొక్క స్టార్ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇండియన్ ఓషన్ అనే పురస్కారం గెలుచుకున్న సంజీవ నరసింహ :

మారిషస్ ప్రభుత్వం తెలుగు భాషా యోదుడు సంజీవ నరసింహ అప్పదుకు ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ ఇండియన్ ఓషన్ అనే పురస్కారాన్ని ప్రకటించినది.ప్రతి సంవత్సరం మారిషస్ స్వాతంత్ర్య దినోత్సవం సందరబంగా మార్చ్ 12 న తొమ్మిది మంది ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. మారిషన్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ చేతుల మీదుగా సంజీవ నరసింహ ఈ అవార్డును అందుకోనున్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన విశేష కృషి చేశారు. ఈ పురస్కారం భారత దేశంలోని ‘పద్మ’ పురస్కారాలతో పోల్చదగినది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలలో సామాజిక పురోగతికి కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డులను అందజేస్తారు. కాగా మారిషెస్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్, ఇది ఒక ద్వీప దేశం. ఆఫ్రికా ఖండతీర ఆగ్నేయ తీరప్రాంతంలో 2000 కి.మీ దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మారిషస్ యొక్క స్టార్ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇండియన్ ఓషన్ అనే పురస్కారం గెలుచుకున్న సంజీవ నరసింహ
ఎవరు: మారిషన్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్
ఎక్కడ:మారిషస్
ఎప్పుడు : మార్చ్ 15
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మార్చ్ 15 :

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని మార్చిలో జరుపుకుంటారు వినియోగదారుల హక్కులు మరియు అవసరాల గురించి ప్రపంచవ్యాప్త అవగాహనను పెంచడానికి మరియు మార్కెట్ దుర్వినియోగాల నుండి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను రక్షించడానికి ప్రతి సంవత్సరం 15. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2022 యొక్క థీమ్ “ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్”. ఈ రోజు వినియోగదారుల శక్తిని మరియు ప్రతి ఒక్కరికీ న్యాయమైన, సురక్షితమైన మరియు స్థిరమైన మార్కెట్ స్థలం కోసం వారి హక్కులను హైలైట్ చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మార్చ్ 15 :
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : మార్చ్ 15
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |