Daily Current Affairs in Telugu 26&27-03-2022
తొలి సారి స్విస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న భారత శట్లర్ పివి సింధు :

ఇంగ్లాండ్ లో నిరాశ పరిచిన భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు స్విస్ ఓపెన్ లో సత్తా చాటింది. మహిళల సింగిల్స్ ఆమె విజేతగా నిలిచింది. మార్చ్ 27 న తుదిపోరులో రెండో సీడ్: సింధు 21-16, 21-0 తేడాతో నాలుగో సీడ్ బుసానన్ (థాయ్లాండ్)పై గెలిచింది. 49 నిమిషాలోనే మ్యాచ్ ముగించిన ఆమె ప్రత్యర్థిపై విజయాలతో రికార్డును 16-1కు పెంచుకుంది. తొలి గేమ్ ఆరంభంలోనే 3-0తో సిందు దూకుడు ప్రద ర్శించింది. కానీ ర్యాలీలతో పాయింట్లు సాధించిన ప్రత్యర్ధి 7-7తో స్కోరు సమం చేసింది. విరామ సమయానికి 119తో నిలిచిన సింధుకు బుసానన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. నెటు దూరంగా సిందును ఆడిస్తూ కోర్టు నలుమూలలా ప్రత్యర్థి షాట్లు ఆడింది. కానీ బలమైన స్మాష్ తో అదరోగోట్టగా సిందు 10-15తో ఆధిక్యాన్ని కొనసాగించింది. ఆ తర్వాత చకచక పాయింట్లు సాధించి తొలి గేమ్ సొంతం చేసుకుంది. ఇక రెండో ‘గేమిలో సింధు మరింత చెలరేగింది. ర్యాలీలను పాయింట్లుగా మారుస్తూ 11-2తో పెత్తనం చలాయించింది. ప్రత్యర్ధికి ఎలాంటి అవకాశం ఇవ్వ కుండా గేమ్ తో పాటు మ్యాచ్ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోనీ, టోర్నీలో సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిపించే గత స్వీప్ ఓపెన్ ఫైనల్స్ ఆమె కవోలినా మారిన్ చేతిలో ఓడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలి సారి స్విస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న భారత షట్లర్ పివి సింధు
ఎవరు: భారత శట్లర్ పివి సింధు
ఎప్పుడు: మార్చ్ 26
ఉత్తరాఖండ్ శాసనసభకు తొలి మహిళా స్పీకర్ గా రీతు కందూరి ఎన్నిక :

ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభకు ఐదవ స్పీకర్ మరియు తోలి మహిళా స్పీకర్ గా రీతూ కందూరి ఎన్నికయ్యారు. మార్చి 10న పదవీకాలం ముగిసిన బీజేపీకి చెందిన ప్రేమచంద్ అగర్వాల్ తర్వాత ఆమె విజయం సాధించారు. 2017లో యమకేశ్వర్ నియోజకవర్గం నుంచి ఆమె తన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు, ఆమె నోయిడాలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చాలా సంవత్సరాలు బోధించారు.
- ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని :డెహ్రాడూన్
- ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ : గుర్మీత్ సింగ్
- ఉత్తరాఖండ్ రాష్ట్ర సిఎం : పుష్కర్ సింగ్ దామి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరాఖండ్ శాసనసభకు తొలి మహిళా స్పీకర్ గా రీతు కందూరి ఎన్నిక
ఎవరు: రీతు కందూరి
ఎప్పుడు: మార్చ్ 26
రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారుగా వినోద్ జి.ఖండారే నియామకం :

లెఫ్టినెంట్ జనరల్ వినొద్ జీ. ఖండారె రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జి. ఖండారే (రిటైర్డ్) రక్షణ కార్యదర్శికి రక్షణ విధానానికి సంబంధించిన వ్యవహారాలపై వ్యూహాత్మక ఇన్పు ట్లు మరియు సలహాలు ఇస్తారు. లెఫ్టినెంట్ జనరల్ ఖండారే 2018 జనవరి చివరి నాటికి ఆర్మీ నుండి పదవీ విరమణ పొందారు. అప్పటి నుండి అక్టోబర్ 2021 వరకు అతను ప్రధాన మంత్రి కార్యాలయం క్రింద ఉన్న జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్(NSCS)లో సైనిక సలహాదారుగా పనిచేశాడు. మంత్రి కార్యాలయం క్రింద ఉన్న జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ నవంబర్ 2015 నుండి జనవరి 2018 వరకు, అతను డైరెక్టర్ జనరల్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు ఇంటెలిజెన్స్ గాను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ గా పనిచేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారుగా వినోద్ జి.ఖండారే నియామకం
ఎవరు: వినోద్ జి.ఖండారే
ఎప్పుడు: మార్చ్ 26
జెట్ సెట్ గో కు ఏవియేషన్ కు వింగ్స్ ఇండియా 2022 అవార్డు :

ప్రైవేట్ జెట్ విమాన సంస్థ అయిన ప్రైవేట్ జెట్ సెట్ గో ఏవియేషన్ కు వింగ్స్ ఇండియా 2022 అవార్డు లబించింది.ఈ అవార్డును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా జెట్ సెట్ గో ఏవియేషనల్ సియివో కనికా టేక్రియాల్ గారు స్వీకరించారు.పౌర విమానయాన సేవల్లో క్రియశీలత్మకమైన పాత్ర పోషిస్తున్న సంస్థలు కంపెని లను గుర్తించి ఈ అవార్డులు బహుకరించారు.వింగ్స్ ఆఫ్ ఇండియా 2022 సదస్సులో జెట్ సెట్ గో ఏవియేషన్ పాల్గొని తన లెగసి 600 వీటి ఎస్ ఎఫ్ యు హాకర్ ఎక్స్ పి 800 వీటి పిఓపి విమానాలను ప్రదర్శిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జెట్ సెట్ గో కు ఏవియేషన్ కు వింగ్స్ ఇండియా 2022 అవార్డు
ఎవరు: సియివో కనికా టేక్రియాల్
ఎప్పుడు: మార్చ్ 27
‘ఉపాధి బడ్జెట్’ అనే పేరుతో ఎనిమిదవ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన డిల్లి :

ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా మార్చ్ 26న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిదో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతేకాక ఆయన 2002-23 ఏడాదికిగానూ రూ.75,800 కోట్ల బడ్జెట్ ను సమర్పించారు. 2014-15లో రూ.30,940 కోట్లుగా ఉన్న బడ్జెట్ కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. ఈ ఏడాది బడ్జెట్ ను ‘ఉపాధి బడ్జెట్’గా సిసోడియాగారు అభివర్ణించారు. ఈ బడ్జెట్ సమావేశానికి పంజాబ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా కూడా హాజరవ్వడం విశేషం. ఢిల్లీ పౌరులకు ఓటర్ ఐడీ కార్డులతో అనుసంధానిస్తూ హెల్త్ కార్డులు అందచేస్తామని తెలిపారు. ఈ పధానికి రూ 160 కోట్లు కేటాయించామని చెప్పారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున టూరిజం రంగాన్ని ప్రోత్సహించేలా ఫెస్టివల్ ను ఆయన నిర్వహిస్తామని వెల్లడించారు.
- డిల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి : అరవింద్ కేజ్రివాల్
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘ఉపాధి బడ్జెట్’ అనే పేరుతో ఎనిమిదవ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన డిల్లి
ఎవరు: డిల్లి
ఎప్పుడు: మార్చ్ 27
బ్యాడ్మింటన్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా పి.అంకమ్మ చౌదరి ఎన్నిక :

బ్యాడ్మింటన్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) జాయింట్ సెక్ర టరీగా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ పి.అంకమ్మచౌదరి ఎన్నికయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్వ సభ్య సమావేశం అసోంలోని గౌహతిలో ఈ నెల 25వ తేదీన జరిగింది. ఈ సమావేశం అనంతరం జరిగిన బీఏఐ ఎన్నికల్లో అంకమ్మచౌదరిని సభ్యులు అసోసియేషన్ సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అంకమ్మచౌదరి గతం లో శాప్, చైర్మన్ గానూ పని చేశారు. 40 ఏళ్లపాటు బ్యాడ్మింగా ఓన్ అభివృద్ధికి కృషి చేశారు. విజయవాడ లో పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించారు.
- బ్యాడ్మింటన్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా స్థాపన : 1934
- బ్యాడ్మింటన్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా ప్రదాన కార్యాలయం :న్యుడిల్లి
- బ్యాడ్మింటన్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా అద్యక్షుడు : హిమంత బిశ్వ శర్మ
- బ్యాడ్మింటన్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు : పుల్లెల గోపీచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్యాడ్మింటన్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా పి.అంకమ్మ చౌదరి ఎన్నిక
ఎవరు: పి.అంకమ్మ చౌదరి
ఎప్పుడు: మార్చ్ 27
ఫార్ములా వన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేతగా నిలిచిన చార్లెస్ లేక్లేర్క్ :

మొనాకో దేశానికి చెందిన చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారి) బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఫార్ములా వన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2022టైటిల్ విజేతగా నిలిచాడు. 2019 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత ఇది అతనికి మొదటి విజయం. అతని తర్వాత కార్లోస్ సైన్జ్ జూనియర్ (ఫెరారీ-స్పెయిన్) రెండవ స్థానంలో నిలిచాడు ఇది 2022లో జరిగిన మొదటి ఫార్ములా వన్ రేస్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ పద్దెనిమిదవ ఎడిషన్.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫార్ములా వన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేతగా నిలిచిన చార్లెస్ లేక్లేర్క్
ఎవరు: చార్లెస్ లేక్లేర్క్
ఎప్పుడు: మార్చ్ 27
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |