
Daily Current Affairs in Telugu 27&28 May-2022
ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్న రచయిత్రి గీతాంజలి శ్రీ :

ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ గారు రచించిన హిందీ నవల ‘టూంబ్ ఆఫ్ శాండ్’కు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. దీంతో అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి హిందీ నవలగా చరిత్రకెక్కింది. గీతాంజిలి శ్రీ.. 2018లో ‘రెట్ సమాధి’ పేరుతో హిందీలో నవల రాశారు. దీనిని అమెరికాకు చెందిన అనువాదకురాలు డైసీ రాక్వెల్ ‘టూంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో ఇంగ్లిష్ లోకి అనువదించారు. రా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నవల 2022గాను అంత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నవల 2022గాను అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ను సొంతం చేసుకున్నది. లండన్ లో జరిగిన వేడుకల్లో అనువాదకురాలు డైసీ రాక్వెల్ తో కలిసి 50 వేల పౌండ్ల (సుమారు రూ.49.4 లక్షలు) నగదు బహుమతిని పంచుకున్నారు. కాగా, ఇప్పటికే ఈ పుస్తకం. ఇంగ్లీష్ సైన్ అవార్డు‘ కూడా దక్కించుకున్నది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్న రచయిత్రి గీతాంజలి శ్రీ
ఎవరు: గీతాంజలి శ్రీ
ఎప్పుడు: మే 27
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డు గెలుచుకున్న నవాజుద్దిన్ సిద్దికి :

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన ఫ్రెంచ్ రివేరా ఫిల్మ్ ఫెస్టివల్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డుతో సత్కరించబడ్డారు. రెండుసార్లు ఎమ్మీ విజేత అమెరికన్ నటుడు-నిర్మాత, విన్సెంట్ డి పాల్ నవాజుద్దీన్కు ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డును అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డు గెలుచుకున్న నవాజుద్దిన్ సిద్దికి
ఎవరు: నవాజుద్దిన్ సిద్దికి
ఎక్కడ: కేన్స్ ఫెస్టివల్ లో
ఎప్పుడు:మే 27
మొట్టమొదటి పారిశ్రామిక బయోటెక్ పార్క్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ :

జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలో ఉత్తర భారతదేశంలోని మొట్టమొదటి పారిశ్రామిక బయోటెక్ పారకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఇది కొత్త ఆలోచనలకు కేంద్రంగా పని చేస్తుంది.బయోటెక్ పార్క్ కొత్త ఆలోచనలకు కేంద్రంగా పనిచేస్తుందని, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ప్రగతిశీల రైతులు, శాస్త్రవేత్తలు, మేధావులు మరియు విద్యార్థులకు జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ నుండి మాత్రమే కాకుండా సమీపంలోని విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి బలమైన చేసుందని తెంద్ర సింగ్ చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మొట్టమొదటి పారిశ్రామిక బయోటెక్ పార్క్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఎవరు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఎక్కడ: జమ్మూ కాశ్మీర్
ఎప్పుడు: మే 27
12వ అంతర్జాతీయ క్రీడలలలో స్వర్ణ పథకం గెలుచుకున్న శ్రీ శంకర్ :

గ్రీస్ లో జరుగుతున్న 12వ అంతర్జాతీయ క్రీడలలలో భారత లాంగ్ జంప్ స్టార్ మురళీ శ్రీ శంకర్ స్వర్ణ పథకం ను కైవసం చేసుకున్నాడు. “ఈ ఈవెంట్. అతడు 8.31 మీటర్ల దూరం మాకి అగ్రస్థానంలో నిలి చాడు. తన జాతీయ రికారు (8.36 మీ) కన్నా ఇది తక్కువే. ఇదే పోటీల్లో మోంటోలర్ (స్వీడన్, 8.27 మీ) రజతం గెలవగా, జులెస్ (ఫ్రాన్స్ 8.17 మీ) కాంస్యం సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 12వ అంతర్జాతీయ క్రీడలలలో స్వర్ణ పథకం గెలుచుకున్న శ్రీ శంకర్
ఎవరు: శ్రీ శంకర్
ఎక్కడ: గ్రీస్ లో
ఎప్పుడు: మే 28
జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి ని ప్రయోగించిన రష్యా దేశం :

ఉ కేయిన్ దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో రష్యా తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. ధ్వనివేగం కన్నా 9 రెట్లు (గంటకు 11వేల కిలోమీటర్లు) వేగంగాదూసుకెళ్లే శక్తిమంతమైన జిర్కాన్ హైపర్సెనిక్ క్రూజ్ క్షిపజీని తాజాగా పరీక్షించింది. బాలిస్టిక్ తరగతికి చెందని క్షిపణుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా పరిజ్ఞానంలో తన ఆదిప త్యాన్ని మరోసారి రష్యా చాటింది.చేరంట్స్ సముద్రంలో అడ్మిరల్ గోర్బవ్ యుద్ధనౌక నుంచి జిరాన్ను రష్యా ప్రయోగించింది. ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలోని వైట్ సీలో ఉంచిన లక్ష్యాన్ని అత్యంత కచ్చిత త్వంతో చేదించింది.
- రష్యా దేశ రాజధాని : మాస్కో
- రష్యా దేశ కరెన్సీ :రూబెల్
- రష్యా దేశ అద్యక్షుడు : వాదిమిర్ పుతిన్
- రష్యా దేశ ప్రధాన మంత్రి :మిఖైల్ మిశుస్తిన్
క్విక్ రివ్యు :
ఏమిటి: జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి ని ప్రయోగించిన రష్యా దేశం
ఎవరు: రష్యా
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: మే 28
మహిళల టీ20 చాలెంజ్ ను మరోసారి గెలుచుకున్న సూపర్ నోవాస్ జట్టు :

సూపర్ నోవాస్ అదరగొట్టింది. మహిళల టీ20 చాలెంట్ను మరోసారి గెలుచుకుంది. నాలుగు పర్యాయాల్లో మూడోసారి విజేతగా నిలిచి ఆధిపత్యం ప్రదర్శించింది. శనివారం ఏరపక్షంగా సాగుతుందనుకున్న ఫైనల్ వొల్వార్డ్ (65) నాటౌట్, 10 బంతుల్లో 5-1, 3-6) అద్భుత పోరాటంతో రసవత్తరంగా మారింది. ముగింపు ఉత్కంఠ రేపింది. చివరికి విజేత సూపర్ నోవానే అయినా సిటీ ప్రతిఘటన కూడా అభిమానులను ఆకట్టుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వం లోని సూపర్ నోవాస్ నాలుగు పరుగుల తేడాతో నెగ్గి టైటిల్ ను చేజిక్కించుకుంది. డాటిన్ (62, 11 బంతుల్లో 14, 1.6), హర్శకతో ఔర్ (1), 29 బంతుల్లో 1-1, 3-40) వెలరేగడంతో మొదట సూపర్ నివాస్ 7 వికెట్లకు 165 పరుగులు సాధించింది. దీప్తి శర్మ (2/20), గ్రాడ్ (22), సిమ్రాన్ (2/30) బంతితో రాణించాదు. వొల్వార్డ్ అదరగొట్టినా వికెట్లకు 161 పరుగులే చేయగలిగింది. నిజానికి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని ఎవరూ అనుకోలేదు. వేదనలో ఏలాసిటీ 11 ఓవర్లలో 15 పరుగులు అలరువిల్లు కోల్పోవడంతో సూపర్ నోవా కు తేలికే అనిపించింది. కానీ పట్టుదలగా నిలిచిన వాట్వార్ క్రమంగా పెంచి స్కోరు బోర్డును నడిపించింది.ఇలా నాలుగు సార్లు జరిగిన ఈ మహిళల టి 20 టోర్నీ లో సూపర్ నోవా జట్టు గెలవడం ఇది మూడో సారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల టీ20 చాలెంజ్ ను మరోసారి గెలుచుకున్న సూపర్ నోవాస్ జట్టు
ఎవరు: సూపర్ నోవాస్ జట్టు
ఎప్పుడు: మే 28
అఖిల భారత పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్ లను కైవసం చేసుకున్న దక్షిణ మద్య రైల్వే :

రైల్వే 67వ వారోత్సవాల్లో ఇతర జోన్ల కంటే అధికంగా దక్షిణ మధ్య రైల్వే ఐదు ‘అఖిల భారత పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్ లను కైవసం చేసుకుంది. రైల్వే భద్రత, సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ, సివిల్ ఇంజినీరింగ్, స్టోర్స్, సివిల్ ఇంజినీ రింగ్(కన్స్ట్రక్షన్) విభాగాల్లో గతేడాది ఉత్తమ పనితీరుకు ఈ గుర్తింపు లభించింది. భువనేశ్వర్ లో జరిగిన కార్యక్ర మంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఉత్సవాల్లో ద.మ. రైల్వే జీఎం (ఇన్ఛార్జి) అరుణ్ కుమార్ జైన్ పాటు జోన్ లోని సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు ఈ పురస్కారాలను అందుకున్నారు. వ్యక్తిగత విభాగంలో – ఆరోగ్య పలువురు ఉద్యోగులు అవార్డులు స్వీకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అఖిల భారత పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్ లను కైవసం చేసుకున్న దక్షిణ మద్య రైల్వే
ఎవరు: దక్షిణ మద్య రైల్వే
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: మే 28
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |