
Daily Current Affairs in Telugu 14&15 May-2022
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా బాద్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్ :

భారత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ గారు బాధ్యతలు స్వీక రించారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్ లో ఆయన మే 15 న సీఈసీగా విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్న సుశీల్ చంద్ర గారు మే 14న పదవీ విరమణ చేశారు. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్ సేఈసీగా ఉంటారు. కాగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు 2021లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఆయన సారధ్యంలోనే జరగనున్నాయి
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా బాద్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్
ఎవరు: రాజీవ్ కుమార్
ఎక్కడ ; డిల్లి
ఎప్పడు: : మే 14
బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ టోర్నీల్లో ఒకటైన థామస్ కప్ ను గెలుచుకున్న భారత్ :

బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ టోర్నీల్లో ఒకటైన థామస్ కప్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా గెలవని భారత పురుషుల జట్టు.. ఏకంగా స్వర్ణంతో సత్తా చాటింది. ఆదివారం ఫైనల్లో భారత్ 3-0తో ఇండోనేసియాను మట్టికరిపించింది. 14 సార్లు విజేత ఇండోనేసియా భారత ఆటగాళ్ల పట్టుదల, పోరాటస్పూర్తి ముందు తలవంచింది. థామస్ కప్ లో 1979 నుంచి కనీసం సెమీస్ కూడా చేరని భారత. స్వర్ణంతో బోణీ కొట్టడం విశేషం. ప్రతిష్టాత్మక థామస్ కప్ లో భారత్ విజేతగా నిలిచింది. అత్యధికంగా 14 సార్లు చాంపియన్ గా నిలిచిన ఇండోనేసయాను ఫైనల్లో చిత్తు చిత్తుగా ఓడించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లఖించింది. థామస్ కప్ టైటిల్ సాధించిన ఆరో దేశంగా ఘనతను అందుకుంది. ఇండోనేసియా (14 సార్లు), చైనా (10), మలేసియా (5), డెన్మార్క్ (1),’ జపాన్ (1)ల సరసన భారత్ నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ టోర్నీల్లో ఒకటైన థామస్ కప్ ను గెలుచుకున్న భారత్
ఎవరు: భారత్
ఎప్పడు: మే 14
త్రిపుర ముఖ్య మంత్రిగా బాద్యతలు స్వీకరించిన మాణిక్ సాహా :

త్రిపుర రాష్ట్ర ముఖ్య మంత్రిగా మాణిక్ సాహా మే 15న బాధ్యతలు స్వీకరించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్.ఎన్ ఆర్య రాజ్ భవన్ లో ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లవ్ దేవ్ అనూహ్యంగా రాజీనామా చేయాల్సి రావడంతో భాజపా అధిష్టానం మాణిక్ సాహాను సీఎంగా ప్రకటించిన విషయం తెలిసిందే కాగా సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీప్లవ్ దేవ్ గారు కూడా హాజరయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: త్రిపుర ముఖ్య మంత్రిగా బాద్యతలు స్వీకరించిన మాణిక్ సాహా
ఎవరు: స్వీకరించిన మాణిక్ సాహా
ఎక్కడ ; త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం
ఎప్పడు: : మే 14
త్రిపుర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విప్లవ్ దేవ్ :

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ తన పదవికి మే 14న రాజీనామా చేశారు. తన రాజీనామాను త్రిపుర గవర్నర్ ఎస్.ఎస్. ఆర్యకు సమర్పించారు. బిప్లవ్ కుమార్ మే 13న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసిన తర్వాత రోజే నేడు రాజీనామా చేయడం విశేషం. మరో ఆరు నెలల్లో త్రిపుర రాష్ట్రము లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతటి కీలక పరిస్థితుల్లో సీఎం విప్లవ్ దేవ్ ను తప్పించి, బీజేపీ కొత్త రాజకీయ పరిణామానికి దారి తీసింది. కాగా బీజేపీ అధిష్టానం కొత్త సీఎంను ప్రకటించనుంది.
- త్రిపుర రాష్ట్ర రాజధాని :అగర్తల
క్విక్ రివ్యు :
ఏమిటి: త్రిపుర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విప్లవ్ దేవ్
ఎవరు: విప్లవ్ దేవ్
ఎక్కడ ; త్రిపుర
ఎప్పడు: మే 14
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఎన్నిక

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ మే 14న ప్రకటించింది. ఇంతకు ముందు అధ్యక్షుడిగా పని చేసిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) మే 14న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడు మొహమ్మద్ బిన్ జాయెద్ (61) దేశానికి మూడో అధ్యక్షుడిగా, ఆయన 2004 నుంచి అబుదాబి క్రౌన్ ప్రిన్స్ గా పని చేసిన ముహమూద్ అబుదాకి 77వ పాలకుడిగా పని చేయనున్నారు. వామ్ ప్రకటన ప్రకారం, అబుదాబిలోని అల్ ముఫ్ ప్యాలెస్ ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సమావేశమై యూఏఈ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది
- యుఎఈ రాజధాని :అబుదాబి
- :యు.ఎ.ఈ కరెన్సీ : దిర్హం
- యు.ఎ.ఈ ప్రధాని :మహమ్మద్ బిన్ రషీద్ అ;ల్మక్తోం
క్విక్ రివ్యు :
ఏమిటి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఎన్నిక
ఎవరు: అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
ఎక్కడ ; యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఎప్పడు : మే 14
ఫోర్బ్స్ యొక్క 2022 జాబితా ప్రకారం అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ లలో మొదటి స్థానంలో నిలిచిన లియోనెల్ మెస్సి :

ఫోర్బ్స్ యొక్క 2022 జాబితా ప్రకారం, గత సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న నలుగురు అథ్లెట్లలో ముగ్గురు సాకర్ ఆటగాళ్ళు. ఉన్నారు. ఈ జాబితాలో $130 మిలియన్ల ఆదాయంతో ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ అగ్రస్థానంలో ఉండగా, లెబ్రాన్ జేమ్స్ యొక్క లాస్ ఏంజెల్స్ లేకర్స్ $121.2 మిలియన్ ఆదాయంతో రెండవ స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో $115 మిలియన్లతో మూడవ స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫోర్బ్స్ యొక్క 2022 జాబితా ప్రకారం అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ లలో మొదటి స్థానంలో నిలిచిన లియోనెల్ మెస్సి
ఎవరు: లియోనెల్ మెస్సి
ఎప్పడు: మే 14
2022 టెంపుల్టన్ ప్రైజ్ గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంక్ విల్జెక్ :

నోబెల్ ప్రైజ్ గ్రహీత, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు రచయిత, మరియు నాలుగు విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్ గా ఉన్న ఫ్రాంక్ విల్జెక్కు 2022సంవత్సరానికి గాను టెంపుల్టన్ ప్రైజ్ లభించింది. బలమైన శక్తి యొక్క అసాధారణ లక్షణాలను వివరించడంలో 1973లో సాధించిన పురోగతికి అతను డేవిడ్ J. గ్రాస్ మరియు H. డేవిడ్ పొలిట్జర్లతో కలిసి భౌతిక శాస్త్రంలో 2004 నోబెల్ బహుమతిని అందుకున్నాడు. టెంపుల్టన్ బహుమతిని 1972లో దివంగత సర్ జాన్ టెంపుల్టన్ గారు స్థాపించారు.
- టెంపుల్టన్ ప్రైజ్ స్థాపన : 1972
- టెంపుల్టన్ ప్రైజ్ మొదటి సారి బహుకరించింది :1973
క్విక్ రివ్యు :
ఏమిటి: 2022 టెంపుల్టన్ ప్రైజ్ గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంక్ విల్జెక్
ఎవరు: ఫ్రాంక్ విల్జెక్
ఎప్పడు: మే 14
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కన్నుమూత :

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు రెండు సార్లు ప్రపంచకప్ (2003, 2007) గెలిచిన జట్టులో సభ్యుడు ఆండ్రూ సైమండ్స్(46) ఇక లేడు. మే 14 న రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ మృత్యువాత పడ్డాడు. క్వీన్స్ లాండ్‌లోని టౌన్సిలేలో తన నివాస ప్రాంతానికి సమీపంలో జరిగిన ప్రమాదంలో సైమండ్స్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి కారు ఆదుపు తప్పి పల్టీలు కొట్టింది. డ్రైవర్ సీట్లో ఉన్న. సైమండ్స్ తీవ్ర గాయాల పాలై ప్రాణాలు వదిలాడు. సైమండ్స్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండు నెలల్లో క్రికెట్ ఆస్ట్రేలియా ముగ్గురు ప్రముఖ ఆటగాళ్లను కోల్పోయింది. స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ను, మాజీ వికెట్ కీపర్ రోడ్నీ మార్ష్ ను ఈ ఏడాది. మార్చిలో కొన్ని రోజులలోనే కన్నుమూశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కన్నుమూత
ఎవరు: ఆండ్రూ సైమండ్స్
ఎక్కడ ; ఆస్ట్రేలియా
ఎప్పడు: మే 14
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |