
Daily Current Affairs in Telugu 22-03-2022
ప్రపంచం లోకెల్లా అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ :
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతను వేదిక ఒకటి కళ్లకుకట్టింది. ప్రపంచంలోని 100 అత్యంత కలుషిత నగరాల్లో 63 భారత్ తోనే ఉన్నట్లు తేల్చింది. మరోవైపు, ప్రపంచం లోకెల్లా అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ వరుసగా నాలుగోసారి నిలిచింది. స్విట్జర్లాండ్ చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ ‘ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021’ పేరుతో మార్చ్ 22న విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పలు చేదు విషయాలను వెలుగులోకి తెచ్చింది. అందులోని వివరాల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను గత ఏడాది భారత్ లో ఏ ఒక్క నగరము. అందుకోలేకపోయింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో చివాడీ (రాజ స్థాన్) తొలి స్థానంలో నిలవగా గజియాబాద్ (ఉత్తర్ ప్రదేశ్) 3వ దిల్లీ 1వ స్థానంలో ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచం లోకెల్లా అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ
ఎవరు: రాజధానిగా ఢిల్లీ
ఎప్పుడు: మార్చ్ 22
మతమార్పిడిని నిరోధించే బిల్లుకు ఆమోదం తెలిపిన హరియాణా రాష్ట్రం :
ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనలు, వాకౌట్ మధ్య.. నిర్బంధ మతమార్పిడిని నిరోధించే బిల్లుకు హరియాణా రాష్ట్రం అసెంబ్లీలో మార్చ్ 22న ఆమోదం తెలిపింది. ఈమేరకు ఈనెల 4న ‘చట్టవ్యతిరేక మతమార్పిడి నిరోధక బిల్లు. 2022 ను భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. నిర్బంధంగాను, ప్రలోభాలకు గురిచేయడం, ఒత్తిడి తేవడం ద్వారా లేదా మోసపూరిత విధానాల్లో మత మార్పిడికి పాల్పడితే వివిధ రకాల జైలు శిక్షలు, జరిమానాలను విధిస్తారు. కాగా ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించి వాకౌట్ చేయడంతో వారు సభలో లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మతమార్పిడిని నిరోధించే బిల్లుకు ఆమోదం తెలిపిన హరియాణా రాష్ట్రం
ఎవరు: హరియాణా రాష్ట్రం
ఎప్పుడు: మార్చ్ 22
ప్రపంచంలో అధిక బిలియనీర్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో3 వ స్థానంలో భారత్ :
భారత్లో, బిలియనీర్ల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూ పోతున్నది. 2021లో దేశంలో 215 మంది బిలియనీర్లు ఉండగా.కొత్తగా 58 మంది ఈ జాబితాలో చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2022 వివరాల ప్రకారం. అమెరికా టాప్ లో ఉండగా చైనా రెండో స్థానంలో కొనసాగుతున్నది. భారత్ సంతతికి చెందిన బిలియనీర్లు మొత్తం 249కు చేరుకుంది. అయితే నగరాల వారీగా చూసుకుంటే. ముంబై టాప్ లో ఉంది. ఒక ఆర్ధిక రాజధాని నుంచే 72 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో 51 మంది బిలియనీర్లతో ఢిల్లీ రెండో స్థానంలో, బెంగళూరు 28 మందిలో మూడో స్థానంలో నిలిచాయి. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 3381 మంది బిలియనీర్లు ఉండగా.. అందులో 153 మంది కొత్తగా వచ్చినవారే కావడం గమనార్హం
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలో అధిక బిలియనీర్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో3 వ స్థానంలో భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: మార్చ్ 22
బెల్ సంస్థ డైరెక్టర్ గా ఉపిందర్ సింగ్ మాధుర్ నియామకం :

ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ సంస్థ అయిన బెల్ మార్చ్ 22న ఉపిందర్ సింగ్ మాదుర్ ను డైరెక్టర్ (పవర్)గా నియమించింది. దీనికి ముందు, మాథారు BHEL యొక్క పవర్ సెక్టార్ తూర్పు ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బెల్ సంస్థ డైరెక్టర్ గా ఉపిందర్ సింగ్ మాధుర్ నియామకం
ఎవరు: ఉపిందర్ సింగ్ మాధుర్
ఎప్పుడు: మార్చ్ 22
ప్రపంచ నీటి దినోత్సవంగా మార్చ్ 22:
మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం 2022ని జరుపుకుంటారు. మంచినీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి 1993 నుండి ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని ప్రారంభించింది. ప్రపంచ నీటి దినోత్సవం యొక్క ప్రధాన దృష్టి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2030 నాటికి అందరికీ నీరు మరియు పారిశుధ్యాన్ని అందించాలనేది దీని యొక్క లక్ష్యంగా ఉంది .
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ మంచి నీటి దినోత్సవంగా మార్చ్ 22:
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: మార్చ్ 22
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |