
Daily Current Affairs in Telugu 11-03-2022
భారత్ లోనే మొదటి సారిగా హైదరబాద్ లో మహిళా యాజమాన్యంలో ఇండస్త్రియల్ పార్క్ ఏర్పాటు :

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగ వంద శాతం మహిళ యాజమాన్యంలోని ఇండస్ట్రియల్ పార్కు తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రారంభించబడింది. ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం భాగస్వామ్యంతో (FICCI) లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) ద్వారా ప్రచారం చేయబడింది కాగా దీనిని పటాన్‌చెరు లోని పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్ యొక్క అంచనా పెట్టుబడి వ్యయం రూ. 250 కోట్ల రూపాయలు ఉండగా. ప్రారంభంలో దీనిని 16 విభిన్న గ్రీన్ కేటగిరీ పారిశ్రామిక విభాగంలో 25 మహిళల యాజమాన్యంలోని మరియు నిర్వహించబడే యూనిట్లను కలిగి ఉంది
- తెలంగాణా రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర ఐటి శాఖా మంత్రి :కే.తారక రామారావు
క్విక్ రివ్యు :
ఏమిటి:భారత్ లోనే మొదటి సారిగా హైదరబాద్ లో మహిళా యాజమాన్యంలో ఇండస్త్రియల్ పార్క్ ఏర్పాటు
ఎవరు: తెలంగాణా ప్రభుత్వం
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు : మార్చ్ 11
భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త చైర్మన్ గా దేవశిష్ పాండా నియామకం :

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) నూతన చైర్మన్ గా ఆర్ధిక సేవల మాజీ కార్యదర్శి అయిన దేవాశిష్ పాండాను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉండేందుకు మంత్రివర్గ నియామకాల సంఘం అనుమతినిచ్చింది. ఈయన 1987 బ్యాచ్ లో ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. అంతే కాకుండా కేంద్ర ఆర్థిక సేవల విభాగానికి రెండేళ్లపాటు కార్యదర్శిగా పనిచేసి చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త చైర్మన్ గా దేవశిష్ పాండా నియామకం
ఎవరు: దేవశిష్ పాండా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : మార్చ్ 11
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న ప్రజాగాయకుడు కవి గోరేటి వెంకన్న :

ప్రజాగాయకుడు, కవి, రచయిత, సాహితీ వేత్త, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మార్చ్ 11 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అకాడమీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆయన రాసిన వల్లం కితాళం కవితా సంపుటికి ఈ పురస్కారం దక్కింది. వల్లంకి తాళం గేయగాడతకు నెలవైన కవితల సంపుటి అని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రశంసించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న ప్రజాగాయకుడు కవి గోరేటి వెంకన్న
ఎవరు: కవి గోరేటి వెంకన్న
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు : మార్చ్ 11
రష్యా పైన వాణిజ్య పరమైన నిషేధం ను ప్రకటించిన అమెరికా దేశం :

ఉక్రెయిన్ పైన సైనిక దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తున్న అమెరికామార్చ్ 11న మళ్లీ కొరడా ఝళిపించింది. రష్యా వాణిజ్య స్థాయిను తగ్గించాలను నిర్ణయించింది. ఆ దేశానికి వాణిజ్య పరంగా ఇస్తున్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ ఎన్) హోదాను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రష్యా సముద్ర ఉత్పత్తులు, మద్యం, వజ్రాలపై నిషేధం విధించింది. “పుతిన్ ను ఎదుర్కొవడానికి స్వేచ్ఛా విషయంలో ఐరోపా సమాఖ్య(ఈయూ), జి-7 దేశాల కూటమితో చర్చించి నిర్ణయం తీసు కోనున్నట్లు తెలిపింది. అంతేకాదు రష్యా సముద్ర ఉత్పత్తులు, మద్యం, వజ్రాలపై నిషేదం విధించింది. “పుతిన్ ను ఎదుర్కొవడానికి స్వేచ్చా ప్రపంచం ముందుకు వస్తోంది అని అమెరికా అధ్యక్షుడు డైరెస్ తెలిపారు. అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేస్తే రష్యా దిగుమతులపై మరిన్ని సురకాలు విధించే వెసులుబాటు అమెరికాకు కలుగుతుంది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే అవకాశం ఉంది.
- రష్యా దేశ రాజధాని :మాస్కో
- రష్యా దేశ కరెన్సీ :రూబెల్
- రష్యా దేశ అద్యక్షుడు : వ్లాదిమిర్ పుతిన్
క్విక్ రివ్యు :
ఏమిటి: రష్యా పైన వాణిజ్య పరమైన నిషేధం ను ప్రకటించిన అమెరికా దేశం
ఎవరు: అమెరికా దేశం
ఎక్కడ: రష్యా పైన
ఎప్పుడు : మార్చ్ 11
ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ కోచ్ గా మలింగ నియామకం :

ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తరపున సత్తా చాటిన శ్రీలంక మాజీ స్టార్ పేసర్ మలింగ లీగ్ లో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. మార్చి 26న ఆరంభం కాబోతున్న ఈసారి సీజన్ లో అతడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా సేవలందించనున్నాడు. మలింగ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరించనున్నాడని ప్యాడీ ఆప్షన్ను టీమ్ క్యాటలిస్ట్ గా నియమించామని మార్చ్ 11న రాజస్థాన్ రాయల్స్ తెలిపింది. “మళ్లీ ఐపీఎల్ కు రాబోతుండడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్ కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఆసక్తికరమైన బౌలింగ్ దళం ఉన్న రాజస్థా న్ తో పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా” అని మలింగ చెప్పాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ప్యాడీ ఆప్షన్ 2013-15 సీజన్లలో రాజస్థా న్కు ప్రధాన కోచ్ గా పనిచేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ప్యాడీ ఆప్షన్ 2013-15 సీజన్లలో రాజస్థాన్ నకు ప్రధాన కోచ్ గా పని చేశాడు. అతడు కోచ్ గా ఉన్న సమయంలో రాజ స్థాన్, 2013, 15 సీజన్లలో టాప్-4లో నిలిచింది. 2013లో చాంపియన్స్ లీగ్ కు కూడా అర్హత సాధించింది. గత సీజన్ లో మాదిరే శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రాజస్థాన్కు ప్రధాన కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ కోచ్ గా మలింగ నియామకం
ఎవరు: మలింగ
ఎక్కడ: రాజస్తాన్
ఎప్పుడు : మార్చ్ 11
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |