Daily Current Affairs in Telugu 13-April-2022
ప్రతిష్టాత్మక రెయిక్ జావిక్ ఓపెన్ చెస్ టైటిల్ ను గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద :

భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక రెయిక్ జావిక్ ఓపెన్ చెస్ టైటిల్ ను గెలుచుకున్నాడు. ఇతను 9 రౌండ్ల నుంచి 7,5 పాయింట్ ల తో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. చివరి రౌండ్ లో అతడు సహచర ఆటగాడు అయిన గుకేష్ పైన విజయం సాధించాడు. ప్రజ్ఞానంద ఒక్క గేమ్ లోనూ ఓడిపోలేదు. అభిమన్యు మిశ్రా (7 పాయింట్లు) తో ఐదో స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక రెయిక్ జావిక్ ఓపెన్ చెస్ టైటిల్ ను గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద
ఎవరు : భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఐరాస ఆర్ధిక సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు ఎన్నికైన భారత్ :

అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐరాస లో మన దేశం కీలక విజయాలను నమోదు చేసింది. యుఎన్.ఆర్ధిక సామజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్ ఎన్నిక అయింది.ఐక్యరాజ్య సమితి కి ప్రస్తుతం ఉన్న ఆరు కీలక విభాగాల్లో ఆర్ధిక సామాజిక మండలి ఒకటి. ఐరాస సర్వ ప్రతినిధి సభ నుంఛి ఎన్నికైన 54 దేశాల ప్రతినిధులు ఈ మండలిలో సభ్యులు గా ఉంటారు. దీనికి సంబందించిన సామాజిక అబివృద్ది కమిషన్ ఎంజివోస్ కమిటీ కమిషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ మెంట్ ఆర్ధిక సామజిక సాంస్కృతిక హక్కుల కమిటీలలో భారత్ కు ప్రాతినిత్యం లబించింది. ఆర్ధిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటి మన దేశం రాయబారి ప్రీతీశరన్ వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. విజయానికి సహకరించిన సభ్య దేశాలు అన్నింటికీ ఐరాస లో భారత్ శాశ్వత మిషన్ కృతజ్ఞతలు తెలిపింది.
- ఐక్యరాజ్య సమితి స్థాపన :అక్టోబర్ 24 1945
- ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
- ఐక్యరాజ్య సమితి సెక్రటరి జనరల్ : అంటోనియో గుటేరాస్
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐరాస ఆర్ధిక సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు ఎన్నికైన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఆస్ట్రేలియా కోచ్ గా ఆండ్రూ మెక్ డోనాల్డ్ నియామకం :

ఆస్ట్రేలియా దేశ క్రికెట్ కు ప్రధాన కోచ్ గా అండ్రూ మెక్ డోనాల్డ్ నియమితుడయ్యారు. అయన నాలుగేళ్ళ కాలానికి గాను అతనికి బాద్యతలు అప్పగించారు.ఫిబ్రవరిలో జస్టిస్ లంగూర్ స్వల్పకాలానికి కాంట్రాక్ట్ పునరుద్దరణ కు తిరస్కరించినప్పటి నుంచి మెక్ డోనాల్డ్ తాత్కాలిక కోచ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన మాజీ టెస్టు ఆల్ రౌండర్ అయిన అతడికి ఐపిఎల్ ఇంగ్లీష్ కౌంటి క్రికెట్ లో ప్రధాన కోచ్ గా పని చేసిన అనుభవం ఉంది. లాంగర్ హయాంలో మెక్ డోనాల్డ్ సీనియర్ సహాయ కోచ్ గా కూడా ఉన్నాడు
- ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ :ప్యాట్ కమ్మిన్స్
- ఆస్ట్రేలియా దేశ రాజధాని : కాన్ బెర్రా
- ఆస్ట్రేలియా దేశ కరెన్సీ : ఆస్త్రేలియన్ డాలర్
- ఆస్ట్రేలియా దేశ ప్రధాని :స్కార్ మొరిసన్
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆస్ట్రేలియా కోచ్ గా ఆండ్రూ మెక్ డోనాల్డ్ నియామకం
ఎవరు : మెక్ డోనాల్డ్
ఎక్కడ : ఆస్ట్రేలియా
ఎప్పుడు : ఏప్రిల్ 13
ప్రధాన మంత్రి ఎక్సలేన్సి అవార్డు -2019 కి ఎంపికైన కేసముద్రం వ్యవసాయ మార్కెట్ :

మహబూబ్ నగర్ జిల్లా లోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ప్రతిస్తాత్మక ప్రధాన మంత్రి ఎక్సలెన్సి అవార్డు -2019 కి ఎంపికైంది. ఈ నెల 20,21 తేదిలలో నిర్వహించనున్న పౌరసేవల దినోత్సవాన్ని హాజరై అవార్డును స్వీకరించాలని జిల్లా కలెక్టర్ కు శశాంక కు ఏప్రిల్ 13 న భారత ప్రభుత్వం డిప్యూటి కార్యదర్శి ప్రిస్క మాత్యు సమాచారం పంపించారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈనౌమ్) విభాగంలో ఈ పురస్కారం కి ఎంపికైన కేసముద్రం మార్కెట్ కు ట్రోఫీ రూ,10 లక్షల ప్రోత్సాహాన్ని అందజేయనున్నారు. ఈ మొత్తాన్ని ప్రజా సంక్షేమం కోసం నిర్వహించే ప్రాజెక్ట్ లు లేదా కార్యక్రమాలలో వినియోగిస్తారు. కేసముద్రం మార్కెట్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లబించడం పట్ల మార్కెటింగ్ అధికారులు రైతులు స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రధాన మంత్రి ఎక్సలేన్సి అవార్డు -2019 కి ఎంపికైన కేసముద్రం వ్యవసాయ మార్కెట్
ఎవరు : కేసముద్రం వ్యవసాయ మార్కెట్
ఎక్కడ : మహబూబ్ నగర్
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఈవై ఎంటర్ ప్రేన్యూర్ ఆఫ్ ది ఇయర్ ఇండియా అవార్డు గెలుచుకున్న ఫాల్గుని నాయర్ :

EY ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ ఇండియా అవార్డ్స్ యొక్క 23వ ఎడిషన్‌లో ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ఫల్గుణి నాయర్ గారు 2021 సంవత్సరానికి గాను EY ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంపికయ్యారు.. ఈమె సౌందర్య వస్తు సరఫర సంస్థ అయిన నైకా ఈ కామర్స్ వ్యవస్థాపకురాలు మరియు చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ సియివో . నాయర్ ఇపుడు జూన్ 09 2022 న మొనాకో లో జరిగే టువంటి ఈవై వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ లో భారత దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తారు. లైఫ్ టైం అచీవ్ మెంట్ ను లారెన్స్ అండ్ టూబ్రో గ్రూప్ యొక్క చైర్మన్ ఐన ఎ.ఎం నాయర్ కు అందించారు. ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ ప్రోగ్రామ్ కోసం తొమ్మిది కేటగిరి లలో విజేతలను ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఈవై ఎంటర్ ప్రేన్యూర్ ఆఫ్ ది ఇయర్ ఇండియా అవార్డు గెలుచుకున్న ఫాల్గుని నాయర్
ఎవరు : ఫాల్గుని నాయర్
ఎప్పుడు : ఏప్రిల్ 13
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |