
Daily Current Affairs in Telugu 31 May-2022
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్లో స్వర్ణ పథకం గెలుచుకున్న మహిళా జట్టు :

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్లో భారత్ బోణీ చేసింది. ఇలవెనిల్ వలెరివన్, రమిత, శ్రేయ అగర్వాల్ తో కూడిన భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్. ఈవెంట్ ఫైనల్లో భారత్ 17-5తో డెన్మార్క్ విజయం సాధించింది. పోలెండ్దేశానికి చెందిన జట్టు కాంస్యం లభించింది. ఇలవెనిల్, రమిత, శ్రేయ సత్తాచాటడంతో 94.44 స్కోరుతో మొదటి దశ అర్హత రౌండ్ లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో దశలో ద్వితీయ స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించింది. పురుషుల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత్ కు నిరాశ ఎదురైంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో రుద్రాంక్ష్ పాటిల్, పార్ట్ మఖీజా, ధనుష్ శ్రీకాంత్ లతో కూడిన భారత జట్టు 10-16తో క్రొయేషియా చేతిలో ఓడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్లో స్వర్ణ పథకం గెలుచుకున్న మహిళా జట్టు
ఎవరు: మహిళా జట్టు
ఎక్కడ :బాకు (అజర్ బైజాన్ )
ఎప్పుడు : మే 31
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన గా పారాచూటి స్ట్ గాఆర్. లార్సన్ రికార్డ్ :

స్వీడన్ దేశానికి చెందిన 103 ఏళ్లవయసు గల ఆర్. లార్సన్ అనే వృద్ధురాలు మోటలలో (స్వీడన్ దేశంలోని ఒక ప్రాంతం) నిపుణుడి సహాయంతో పారాచూట్ జంప్ చేసి గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకునిప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పారాచూటి స్ట్ గా ధ్రువీకరణ పత్రం అందుకుంది.
- స్వీడన్ దేశ రాజధాని : స్టాక్ హోమ్
- స్వీడన్ దేశ కరెన్సీ :స్వీడిష్ క్రోన్
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన గా పారాచూటి స్ట్ గాఆర్. లార్సన్ రికార్డ్
ఎవరు: స్వీడన్
ఎప్పుడు : మే 31
భారత్ తో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించిన అమెరికా దేశం :

భారత అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా దేశం అవతరించింది. గతంలో ఇదే స్థానంలో చైనా దేశం ఉండేది. కాగా ప్రస్తుత గణాంకాల ప్రకారం.భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ 2021–22సంవత్సరంలో గాను 119.42 బిలియన్ డాల ర్లుగా నమోదైంది.
- అమెరికా దేశ రాజధాని :వాషింగ్టన్
- అమెరికా దేశ కరెన్సీ : యు.ఎస్ డాలర్
- అమెరికా దేశ అద్యక్షుడు :జో బైడెన్
- అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు :కమలా హ్యారిస్
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత్ తో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించిన అమెరికా దేశం
ఎవరు: అమెరికా దేశం
ఎప్పుడు : మే 31
సంగీత కళాకారులకు అందించిన మ్యూజిక్ ఆకాడమీ అవార్డులు :

సంగీత కళాకారులకు చెన్నైలోని మ్యూజిక్ ఆకాడమీ (మద్రాస్) ఆవార్డులు ప్రకటించింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించలేదు. గత నెల 22న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆ రెండేళ్లతోపాటు ప్రస్తుత సంవత్సరానికి కూడా విజేతలను ఎంపిక చేశామని ‘ద హిందూ’ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అకాడమీ అధ్యక్షుడు ఎన్ మురళి వెల్లడించారు.
సంగీత కళానిధి పురస్కారం: కర్ణాటక సంగీత కళాకారుడు నైవేలి ఆర్. సంతాన గోపాలన్ (2020), మృదంగ కళాకారుడు తిరువారూరు భక్తవత్సలం (2021), లాల్గుడి వయోలిన్ విద్వాంసులు జీజేఆర్ కృష్ణన్, విజయలక్ష్మి (2022)
సంగీత కళా ఆచార్య పురస్కారం, నాదస్వర కళాకారుడు కివలూరు. ఎనీ గణేశన్ (2020), గాత్ర కళాకారిణి డాక్టర్ రీతా రాజన్ (2021), వైణిక విద్యాంసురాలు ఆర్ఎఎస్ జయలస్త్రి (2022)
టిటికె పురస్కారం: గాత్ర విద్వాంసుడు తామరక్కాడ్ గోవిందన్ నంబూద్రి (2021)), మృదంగ విద్వాంసుడు, జలతరంగం కళాకారుడు నేమాని సోమయాజులు (204), కంజర కళాకారుడు ఏవీ ఆనంద్ (2022).
నృత్య కళానిధి పురస్కారం: భరతనాట్య కళాకారిణి ‘రమా వైద్యనాద్ (2020) భరతరాలు, కళాకారిణి నరకి నటరాజ్ (2౦21) నాట్య గురువు బరగ బ్రసెల్స్ (2022)
మ్యూజికాలజిస్ట్ పురస్కారానికి డాక్టర్ ప్రేమలత (2022)కు ఎంపిక య్యారు. డిసెంబరు 15న నిర్వహించే పరస్కారాల ప్రదానోత్సవంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కాగా డిసెంబరు 15 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు సంగీతోత్సవాలు3 నుంచి 8వ తేదీ వరకు నృత్యోత్సవాలు ఉంటాయని వారు ప్రకటించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: సంగీత కళాకారులకు అందించిన మ్యూజిక్ ఆకాడమీ అవార్డులు
ఎవరు: మ్యూజిక్ ఆకాడమీ అవార్డులు
ఎప్పుడు : మే 31
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ౦ గా మే 31 :

ప్రపంచవ్యాప్తంగా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ౦గా జరుపుకుంటారు. ఈ వార్షిక వేడుక పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాల గురించి మాత్రమే కాకుండా, పొగాకు కంపెనీల వ్యాపార పద్ధతులు, పొగాకు మహమ్మారిని ఎదుర్కోవడానికి WHO ఏమి చేస్తోంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ హక్కును పొందేందుకు ఏమి చేయవచ్చు. అనే దాని గురించి ప్రపంచ పౌరులలో అవగాహన పెంచడం లక్ష్యంగా అనే దాని గురించి ప్రపంచ పౌరులలో అవగాహన పెంచడం లక్ష్యంగా ఉన్నదీ.కాగా2022సంవత్సరానికి దీని థీమ్: పొగాకు మన పర్యావరణానికి ముప్పు, గా ఉంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ౦ గా మే 31
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : మే 31
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |