
Daily Current Affairs in Telugu 29 September -2022
అంతర్జాతీయ మ్యాచ్ లో రికార్డ్ సృష్టించిన టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ :

అంతర్జాతీయ మ్యాచ్ లో ఆదరగొడుతున్న టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఇప్పటికే 732 పరుగులు ‘సాధించిన సూర్య 2018లో శిఖర్ ధావన్ (689 పరుగులు) నమోదు చేసిన రికార్డును అధిగమించాడు. కెరీర్ లో 32 టీ20 మ్యాచ్ లాడిన సూర్య మొత్తం 976 పరుగులు రాబట్టాడు. మరో 24 చేస్తే 1000 పరుగుల క్లబ్ లో చేరతాడు. ఈ ఏడాది సూర్య 180.29 స్ట్రైక్ రేటుతో ఆడటం విశేషం. అతని కెరీర్ స్ట్రాక్ట్ (173.35) కంటే ఇది ఎక్కువ. ఇప్పటికే అతను 57 సిక్సర్లు, 88 బౌండరీలు బాదాడు. ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా సూర్య సొంతమైంది. సూర్య 45 సెక్సర్లతో మహ్మద్ రిజ్వాన్ ను అధిగమించాడు,
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ మ్యాచ్ లో రికార్డ్ సృష్టించిన టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ :
ఎవరు : సూర్య కుమార్ యాదవ్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
లతా మంగేష్కర్ స్కృతి పురస్కారాన్నిగెలుచుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్ :

గాయకుడు గజల్ శ్రీనివాస కు లతా మంగేష్కర్ స్కృతి పురస్కారాన్ని ప్రముఖ స్వచ్చంద సేవా సంస్థ ‘మై హోమ్ ఇండియా మహారాష్ట్ర వారు అందజేసారు. భారతరత్న లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మరాఠీ కళాకారుడు. ప్రశాంత్ దామే, బాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. లతా మంగేష్కర్ గారి పై ప్రముఖ కవులు రచించిన హిందీ. జర్దూ గజల్ లను శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా ఆలపించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లతా మంగేష్కర్ స్కృతి పురస్కారాన్నిగెలుచుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్
ఎవరు : గాయకుడు గజల్ శ్రీనివాస్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఉక్రెయిన్ ఉద్యమకారిణికి దక్కిన రైట్ లైవ్లీహుడ్ అవార్డు :

నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయంగా భావించే ‘ది రైట్ లైవ్లీహుడ్ అవార్డు ఉక్రెయిన్ దేశానికి చెందిన మానవహక్కుల కార్యకర్త వొలెక్సాండ్రా మాట్విచుక్ కు వరించింది. ఈమెతోపాటు మరో రెండు సంస్థలకు సెప్టెంబర్ 29న ఈ అవార్డును ప్రకటించారు. ‘ఇది మా పోరాటానికి గుర్తింపు’ అని ఈ సందర్భంగా మాట్విచుక్ వ్యాఖ్యానించారు.ఈ అవార్డు కింద రూ. 72 లక్షల నగదు (88,300 డాలర్లు) అందజేస్తారు. నవంబరు 30న స్టాక్ హోంలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉక్రెయిన్ ఉద్యమకారిణికి దక్కిన రైట్ లైవ్లీహుడ్ అవార్డు
ఎవరు : వొలెక్సాండ్రా మాట్విచుక్
ఎక్కడ : ఉక్రెయిన్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
36వ జాతీయ క్రీడలనుప్రారమింసిన ప్రదాని నరేంద్ర మోడి :

దేశంలోనే భారీ క్రీడా సంబరం షురూ అయింది. 36వ జాతీయ క్రీడలను సెప్టెంబర్ 29న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అధికారికంగా ప్రారంభించారు. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ క్రీడలు జరుగుతున్నాయి. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 7 వేలకు పైగా అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో, పోటీపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 21 క్రీడాంశాల్లో మొత్తం 156 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. తెలంగాణ నుంచి 27 క్రీడాంశాల్లో 233 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. ఈ క్రీడల్లో ఇప్పటికే తెలంగాణ రెండు రజతాలు, ఓ కాంస్యం సాధించింది. టీటీ ‘మహిళల సింగిల్స్ ఆకుల శ్రీజ, మిక్స్ డబుల్స్ లో శ్రీజ స్నేహిత్ రజతాలు గెలిచారు. మహిళల టీమ్ విభాగంలో కాంస్యం దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 36వ జాతీయ క్రీడలనుప్రారమింసిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు : ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ :
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ప్రపంచంలోనే అతిపెద్ద పవన-సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంబించిన అదానీ గ్రీన్ కమీషన్ :

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) 29 సెప్టెంబర్ 2022న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పవన-సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో 600 మెగావాట్ల సోలార్ మరియు 150 మెగావాట్ల విండ్ ప్లాంట్లు ఉన్నాయి దీనితో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇప్పుడు మొత్తం కార్యాచరణ ఉత్పత్తి సామర్థ్యం 6.7 GW. మే 2022లో, జైసల్మేర్‌లో 390 మెగావాట్ల సామర్థ్యంతో భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ పవర్ ప్లాంట్‌ను AGEL ప్రారంభించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్ద పవన-సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంబించిన అదానీ గ్రీన్ కమీషన్
ఎవరు : అదానీ గ్రీన్ కమీషన్
ఎక్కడ : రాజస్తాన్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో నలభై స్థానంలో నిలిచిన భారత్ :

జెనీవాకు చెందిన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో భారత్ ఆరు స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకుంది. టర్కీ మరియు భారతదేశం మొదటిసారిగా టాప్ 40లోకి ప్రవేశించాయి, వరుసగా 37వ మరియు 40వ స్థానాల్లో నిలిచాయి,స్విట్జర్లాండ్ వరుసగా 12వ సంవత్సరం యొక్క ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. ఈ సూచిక 2007 సంవత్సరం లో ప్రారంభించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో నలభై స్థానంలో నిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |