
Daily Current Affairs in Telugu 17&18-03-2022
మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచిన పోలెండ్ దేశానికి చెందిన ముద్దుగుమ్మ కరోలినా బియలావ్స్కా :

ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలో పోలెండ్ దేశానికి చెందిన ముద్దుగుమ్మ కరోలినా బియలావ్స్కా (23) జయకేతనం ఎగురవేసింది .2021 ఏడాదికి గాను 96 దేశాల అందాల రాణులను ఓడించి ప్రపంచ సుందరి కిరీటం కైవసం చేసుకుంది.32 ఏళ్ల తర్వాత పోలెండ్ దేశానికి ఈ గౌరవాన్ని మరియు ఘనతను సాధించి పెట్టింది. ప్యుర్తోరికో రాజదాని సాన్ జ్వాన్ లో మార్చ్ 18 న రాత్రి నిర్వహించిన 70 వ మిస్ వరల్డ్ తుది పోటీల కార్యక్రమం లో ఆమెను విజేతగా ప్రకటించారు. భారతీయ అమెరికన్ యువతీ మిస్ అమెరికా దేశ శ్రీ సైని తొలి రన్నరప్ గా నిలిచింది. కోట్ దివార్ దేశానికి చెందిన సుందరి ఒలివియ యెస్ రెండో రన్నరప్ గా నిలిచింది. మిస్ ఇండియా విజేత తెలంగాణ యువతీ మానస వారణాసి కి నిరాశే మిగిలింది.ఆమె 13 వ స్థానానికి పరిమితం అయింది.
- పోలెండ్ దేశ రాజధాని :వార్సా
- పోలెండ్ దేశ కరెన్సీ :పాలిష్ జ్లోటి
- పోలెండ్ దేశ అద్యక్షుడు :అంద్రూజ్ డుదా
క్విక్ రివ్యు :
ఏమిటి: మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచిన పోలెండ్ దేశానికి చెందిన ముద్దుగుమ్మ కరోలినా బియలావ్స్ :
ఎవరు: కరోలినా బియలావ్స్
ఎక్కడ: పోలెండ్ దేశం
ఎప్పుడు : మార్చ్ 18
దేశంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పార్క్ బెంగళూర్ లో ప్రారంభం :

దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్ (ARTPARK) కర్ణాటకలోని బెంగళూరులో ప్రారంభించబడింది. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు లో ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని ఫౌండేషన్ ద్వారా దీనిని ప్రచారం చేయబడింది, దీని సీడ్ క్యాపిటల్ కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి రూ.230 కోట్లు సమకూరించాయి.
- కర్నాటక రాజదాని :బెంగళూర్
- కర్నాటక రాష్ట్ర సిఎం: బసవరాజ బొమ్మై
- కర్నాటక రాష్ట్ర గవర్నర్ : థావర్ చంద్ గెహ్లాట్
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పార్క్ బెంగళూర్ లో ప్రారంభం :
ఎవరు: బెంగళూర్
ఎక్కడ: బెంగళూర్
ఎప్పుడు : మార్చ్ 17
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వికాస్ రాజ్ నియామకం :

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సియివో గా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు మార్చ్ 18న కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ప్రమోద్ కుమార్ శర్మ గారు ఉత్తర్వులు జారీచేశారు. సీఈవోగా ఉన్న శశాంక్ గోయల్ గా కేంద్ర సర్వీసుల్లో కి డిప్యుటేషన్ పై వెళ్లడంతో ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీగా ఉన్నది. ఇంచార్జి సీఈవోగా అడిషనల్ సీఈవో బుద్ధప్రకాశ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేథప్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి సీఈవోగా వికాస్ రాజ్ ను నియమించింది
- తెలంగాణ రాష్ట్ర రాజధాని :హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్రసిఎం: కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిళ సై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వికాస్ రాజ్ నియామకం :
ఎవరు: తెలంగాణ రాష్ట్ర౦
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు : మార్చ్ 17
ప్రపంచంలోనే అత్యధిక సంతోషకర దేశంగా మొదటి స్థానం లో నిలిచిన ఫిన్ ల్యాండ్ :

ప్రపంచంలోనే అత్యంతకర సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని’ పురస్కరించుకుని ఐరాస మార్చ్ 18న ‘ప్రపంచ ఆనంద నివేదిక 2022 ను విడుదల చేసింది. మొత్తం 146 దేశాలతో ఈ జాబితా రూపొందించగా భారత్ 136వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే గతేడాది కంటే ఈసారి భారత్ భారత్ 136వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే గతేడాది కంటే ఈసారి భారత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకోవడం గమనార్హం. ఈ జాబితాలో ఫిన్లాండ్ ప్రథమ స్థానంలో నిలవడం వరుసగా ఇది ఐదోసారి విశేషం. దీని తర్వాత డెన్మార్ ఐస్ల్యాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ టాప్-5 స్థానాల్లో నిలిచాయి. అగ్రాజ్యం అమెరికా గతేడాదితో పోలిస్తే ఈ సారి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానం దక్కించుకుంది. ఇక నిరుడు 19 స్థానంలో నిలిచిన చైనా ఈ సారి ఏకంగా 72వ ర్యాంకు పడిపోయింది. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ అట్టడుగున ఉండగా లెబనాన్, రువాండాలో అల్ప సంతోషకర దేశాలుగా ఐరాస ప్రకటించింది.
- ఫిన్లాండ్ దేశ రాజధాని : హెల్సింకి
- ఫిన్లాండ్ దేశ కరెన్సీ : యూరో
- ఫిన్లాండ్ దేశ ప్రధాని :సన్నా మారిన్
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలోనే అత్యధిక సంతోషకర దేశంగా మొదటి స్థానం లో నిలిచిన ఫిన్ ల్యాండ్ :
ఎవరు: ఫిన్ ల్యాండ్
ఎప్పుడు : మార్చ్ 18
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బంగినపల్లి మామిడికాయ లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేస్తున్న కేంద్రం :

భౌగోళిక గుర్తింపు (జీఐట్యాగ్) పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రసిద్ది గాంచిన బంగినపల్లి మామిడికాయలు దక్షిణ కొరియాకు భారీగా ఎగుమతి అవుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశీయంగా జియలజికల్ ఐడెంటిఫికేషణ్( జీఐ) ట్యాగ్ ను పొందిన ఓక వ్యవసాయ ఉత్పత్తలను వాటి ఎగుమతులను ప్రోత్సహించే క్రమంలో కొత్త ఉత్పత్తులతో కొత్త ఎగుమతి గమ్యస్థానాలు కూడా పెంచాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
- అన్ద్రప్రదేశ్ రాష్ట్ర రాజదాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం :వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వ భూషన్ హరిచంద్
- దక్షిణ కొరియా దేశ రాజధాని :సియోల్
- :దక్షిణ కొరియా దేశ కరెన్సీ : సౌత్ కొరియన్ వాన్
క్విక్ రివ్యు :
ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బంగినపల్లి మామిడికాయ లను దక్షిణ కొరియా ఎగుమతి చేస్తున్న కేంద్రం:
ఎవరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦
ఎక్కడ: దక్షిణ కొరియా
ఎప్పుడు : మార్చ్ 17
భారత్ సహకారంతో నేపాల్ లో ప్రారంబించిన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ భవనం :

నేపాల్ దేశంలోని భోజ్ పూర్ జిల్లాలో భారతదేశ సహకారంతో నిర్మించిన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ భవనం ను ప్రారంబించారు.ఇండియన్ డిప్యుటీ చీఫ్ ఆఫ్ మిషన్ సమాగ్య సి.ఖంపా ,నేపాల్ కమ్యునికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ౦త్రి జ్ఞానేంద్ర బహదూర్ కర్మి తో సహా వివిధ మంత్రులు సంయుక్తంగా ఆసుపత్రి భవనాన్ని ప్రారంబించారు.నేపాలి రూపాయల వ్యయం తో 22.60 మిలియన్ ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ను భారత దేశ స్వాత్రంత్ర్య యొక్క 75 సంవత్సరాల ను జరుపుకునే ఇండియా “@75 ఆజాది క అమృత్ మహోత్సావ్” లో భాగంగా ఈ సంవత్సరం నేపాల్ లో ప్రారంబించిన75 ప్రాజెక్ట్ లలో ఇది ఒకటి .
- నేపాల్ దేశ రాజధాని : ఖాట్మండు
- నేపాల్ దేశ కరెన్సీ : నేపాలీస్ రూపి
- నేపాల్ దేశ అద్యక్షుడు : బిద్యాదేవి బండారి
- నేపాల్ దేశ ప్రధాని : షేర్ బహదూర్ దేబా
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ సహకారంతో నేపాల్ లో ప్రారంబించిన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ భవనం :
ఎవరు: భారత్
ఎక్కడ:నేపాల్ లో
ఎప్పుడు :మార్చ్ 18
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |